
📌 Key Points
- యూఏఈలో బక్రీద్ పండగకు 15 నిమిషాల్లో ఆన్‌లైన్ డెలివరీ సేవ ప్రారంభం.
- ‘నూన్’ అనే ఇన్‌స్టంట్ డెలివరీ సంస్థ గొర్రెలు, ఆవులు, ఒంటెల డెలివరీ ప్రకటించింది.
- కొందరు దీన్ని ఫన్నీగా చూడగా, మరికొందరు జంతుబలులను ప్రోత్సహిస్తున్నారని మండిపడుతున్నారు.
- కంపెనీ వివరణ: బలిచ్చిన మాంసాన్ని మాత్రమే డెలివరీ చేస్తారు, జంతువులను కాదు.
బక్రీద్ పండగకు యూఏఈలో ఆన్‌లైన్ డెలివరీ సంస్థ ‘నూన్’ చేసిన ప్రకటన తీవ్ర చర్చకు దారితీసింది. 15 నిమిషాల్లో గొర్రెలు, ఒంటెలు డెలివరీ చేస్తామన్న ఈ ప్రకటనపై ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది మతపరమైన ఆచారాలపై సాంకేతికత ప్రభావంపై సామాజిక చర్చకు దారితీసింది.
ఆన్‌లైన్‌లో గొర్రెలు, ఒంటెలు: కొత్త ట్రెండ్
ఇంట్లోకి కావాల్సిన వస్తువులు ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తే.. పది నిముషాల్లోనే ఇంటికి వస్తాయి. ఇప్పటి వరకు కూరగాయలు, గ్రోసరీ, కిచెన్ సామాన్లు వంటి రకరకాల వస్తువులు ఆన్లైన్ లో అమ్మడం మనం చూసాం. అయితే రానున్న ఈద్ ఉల్ ఆధా (బక్రీద్) పండగను దృష్టిలో పెట్టుకొని ఇన్స్టంట్ డెలివరీ యాప్ కంపెనీలు కొత్త తరహా అఫర్ కు తెరలేపారు. మే 27న జరగనున్న బక్రీద్ పండగ నేపథ్యంలో గొర్రెలను ఆన్లైన్ డెలివరీ చేయనున్నట్టు ప్రకటించింది ఓ కంపెనీ. ఈద్ రోజున 15 నిముషాల్లోనే కశ్మీరీ సోమాలీ షీప్స్, ఆవులు, ఒంటెలు డెలివరీ చేస్తామని అని పేర్కొంది. అయితే ఇది మన దేశంలో కాదు. యూఏఈ కంట్రీస్ లోని ‘నూన్’ అనే ఇన్స్టంట్ ఆన్లైన్ డెలివరీ సంస్థ చేసిన ఈ ప్రకటనపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
కొందరు ఆన్లైన్ డెలివరీకి కాదేదీ అనర్హం అని ఫన్నీ కామెంట్లు చేస్తుండగా.. మరికొందరు మాత్రం జంతు బలులను ప్రోత్సహిస్తున్నాయని మండిపడుతున్నారు. అయితే ఈ వ్యవహారంపై సదరు కంపెనీ చెబుతున్న వివరణ ఏమిటీ అంటే.. నేరుగా గొర్రెలను, ఆవులను, ఒంటెలను డెలివరీ చేయడం కాదని, ఏది కావాలో ఎన్నుకొని డబ్బులు పే చేసిన అనంతరం వాటిని బలిచ్చి, తర్వాత ఆ మాంసాన్ని మాత్రమే డెలివరీ చేస్తామని పేర్కోవడం కొసమెరుపు.
యూఏఈ కంపెనీ సంచలన ప్రకటన
జంతుబలిపై భిన్నాభిప్రాయాలు, కంపెనీ వివరణ
ఆన్‌లైన్‌లో జంతుబలి మాంసం డెలివరీపై భిన్నాభిప్రాయాలున్నాయి. సాంకేతికత, మతపరమైన ఆచారాల కలయికపై సామాజిక చర్చ కొనసాగుతుంది. ఈ వినూత్న సేవ భవిష్యత్తులో ఎలాంటి మార్పులు తెస్తుందో చూడాలి.


