
📌 Key Points
- స్పీకర్ ఓం బిర్లాను తొలగించాలని ప్రతిపక్షాల తీర్మానం
- పశ్చిమాసియా సంక్షోభంపై చర్చకు విపక్షాల పట్టుబట్టి ఆందోళన
- స్పీకర్ అవిశ్వాసంపై చర్చ తేలే వరకు సభా పీఠంపై కూర్చోలేదని ప్రకటన
- ప్రతిపక్షాల తీరును తప్పుపట్టిన సభాధ్యక్షులు జగదాంబికా పాల్
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. పశ్చిమాసియా సంక్షోభంపై చర్చకు పట్టుబట్టి ప్రతిపక్షాలు ఆందోళనలు చేయడంతో సభ వాయిదా పడింది. ఈ పరిణామం రాజకీయ దుమారం రేపుతోంది.
స్పీకర్ తొలగింపు తీర్మానం వాయిదా
భారత పార్లమెంట్ లోని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా (Lok Sabha Speaker Om Birla)ను పదవి నుంచి తొలగించాలని ప్రతిపక్షాలు ఇచ్చిన తీర్మానం ఇచ్చిన విషయం తెలిసిందే. గత బడ్జెట్ సమావేశాల (Budget meetings) చివర్లో ఈ పరిణామం చోటు చేసుకొగా.. ఈ రోజు నుంచి రెండో విడత సెషన్స్ ప్రారంభం అయ్యాయి. ప్రతి పక్షాల తీరుపై అసహనం వ్యక్తం చేసిన స్పీకర్.. తనపై పెట్టిన అవిశ్వాస తీర్మానం తేలే వరకు ఆ కుర్చీలో కూర్చునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో రెండో సెషన్ ప్రారంభం అయిన ఈ సోమవారం కూడా స్పీకర్ అవిశ్వాసంపై చర్చ సాధ్యపడలేదు.
విపక్షాల ఆందోళనలతో సభలో గందరగోళం
పశ్చిమాసియా (Middle East) సంక్షోభంపై తక్షణమే చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు (Members of the opposition) సభలో నిరంతరాయంగా ఆందోళనలు చేపట్టారు. పలుమార్లు వాయిదాల అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభమైనా, విపక్ష సభ్యుల నినాదాల హోరు తగ్గకపోవడంతో సభలో గందరగోళం నెలకొంది. తనపై అవిశ్వాస తీర్మానం పెండింగ్‌లో ఉన్నందున, నిబంధనల ప్రకారం స్పీకర్ ఓం బిర్లా నేడు సభా పీఠంపై కూర్చోలేదు.
ప్రతిపక్షాలపై సభాధ్యక్షుల ఆగ్రహం
సభకు అధ్యక్షత వహించిన జగదాంబికా పాల్ (Jagadambika Paul) ప్రతిపక్షాల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ తొలగింపు తీర్మానం ఇప్పటికే ఎజెండాలో ఉందని, అయితే ప్రతిపక్షాలు కావాలనే వేరే అంశాలను తెరపైకి తెస్తూ సభను ‘బంధీ’గా మార్చాయని వారు ఆరోపించారు. రోజుకు సుమారు 9 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతోందని, విపక్షాల ప్రవర్తన “అపరిపక్వంగా, బాధ్యతారహితంగా” ఉందని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉన్నప్పటికీ, రాజకీయ ఎజెండా తోనే సభను అడ్డుకుంటున్నారని విమర్శిస్తూ సభను రేపటికి వాయిదా వేశారు.
ప్రతిపక్షాల తీరును సభాధ్యక్షులు తప్పుబట్టారు. చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ, రాజకీయ ఎజెండాతో సభను అడ్డుకుంటున్నారని విమర్శించారు. సభను రేపటికి వాయిదా వేశారు.


