|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

OTT Movie: మూడేళ్ల తర్వాత ఓటీటీలో తెలుగు వెర్షన్ రిలీజ్

Updated: 14-06-2025, 8:45 AM
OTT Movie: మూడేళ్ల తర్వాత ఓటీటీలో తెలుగు వెర్షన్ రిలీజ్

ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో వినోదం పెరుగుతోంది. తాజాగా, తమిళ సినిమా ‘యుగి’ తెలుగు డబ్బింగ్ వెర్షన్ ‘కార్తీక: మిస్సింగ్ కేస్’ పేరుతో ఆహా ఓటీటీలో విడుదలైంది. మూడేళ్ల తర్వాత ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను అలరించనుంది.

Key Points

1

మూడేళ్ల తర్వాత 'యుగి' సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ 'కార్తీక: మిస్సింగ్ కేస్' పేరుతో ఆహా ఓటీటీలో రిలీజ్.

2

కార్తీక అనే అమ్మాయి మిస్సింగ్ కేసు నేపథ్యంలో సాగే థ్రిల్లింగ్ కథ.

4

థియేటర్లలో కొత్త సినిమాలు లేకపోవడంతో ఓటీటీ మూవీస్‌పై ప్రేక్షకుల దృష్టి పడింది.

‘కార్తీక: మిస్సింగ్ కేస్’ విడుదల

ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. అయితే వాటిలో చాలామంది చూసేవి థ్రిల్లర్స్. అందుకు తగ్గట్లే ఇతర భాషల్లో అలరించిన కొన్ని మూవీస్‌ని డబ్బింగ్ చేసి తెలుగులోనూ రిలీజ్ చేస్తుంటారు. అలా ఇ‍ప్పుడు ఓ తమిళ చిత్రాన్ని దాదాపు మూడేళ్ల తర్వాత తెలుగులోకి తీసుకొచ్చారు. సడన్ సర్‌ప్రైజ్ అన్నట్లు మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంతకీ ఏంటా మూవీ? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది?

ఆహా ఓటీటీలో కొత్త సినిమాలు

2022లో తమిళంలో రిలీజై ఆకట్టుకున్న మిస్టరీ థ్రిల్లర్ మూవీ ‘యుగి’. కథిర్, నరైన్, జోజూ జార్జ్, ఆనంది ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాని ఇ‍ప్పుడు ‘కార్తీక: మిస్సింగ్ కేస్’ పేరుతో తెలుగులోకి అనువదించారు. ఆహా ఓటీటీలోకి శుక్రవారం(జూన్ 13) నుంచి అందుబాటులోకి తీసుకొచ్చారు. కార్తీక అనే అమ్మాయి మిస్సింగ్ కేసుని ఛేదించే క్రమంలో ఓ డిటెక్టివ్ బృందానికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? చివరకు ఆ అమ్మాయి దొరికిందా లేదా అనేదే మిగతా స్టోరీ.

ఇకపోతే ఇదే వీకెండ్‌లో ఈ సినిమాతో పాటు మరో 22 సినిమాలు-వెబ్ సిరీసులు ఓటీటీల్లోకి వచ్చేయడం విశేషం. వీటిలో శుభం, కేసరి 2, ఏస్, ఎలెవన్, జింఖానా, బ్లైండ్ స్పాట్, సిన్, డియర్ ఉమ, డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవల్ చిత్రాలతో పాటు రానా నాయుడు 2 సిరీస్ కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఇ‍ప్పుడు చెప్పినవన్నీ కూడా తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీసే. ఈసారి థియేటర్లలో కొత్త సినిమాలేం రిలీజ్ కాలేదు కాబట్టి  ఓటీటీ మూవీస్‌పై తెలుగు ప్రేక్షకులు లుక్కేయడం గ్యారంటీ.

తెలుగు ప్రేక్షకులకు ఓటీటీ ఎంపికలు

చివరగా, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో సినిమాలకు డిమాండ్ పెరుగుతోంది. ‘కార్తీక: మిస్సింగ్ కేస్’ వంటి సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.