
ఈ వారం థియేటర్లలో రష్మిక ‘ద గర్ల్‌ఫ్రెండ్’, సుధీర్ బాబు ‘జటాధర’ సందడి చేయనున్నాయి. అదే సమయంలో, ఓటీటీలోనూ ‘బ్యాడ్ గర్ల్’, ‘అర్జున్ చక్రవర్తి’ వంటి పలు ఆసక్తికర తెలుగు, ఇతర భాషా చిత్రాలు, వెబ్ సిరీస్‌లు విడుదల కానున్నాయి. ఈ వారం ఎంటర్‌టైన్‌మెంట్‌కు లోటుండదు.
Key Points
ఈ వారం థియేటర్లలో రష్మిక 'ద గర్ల్‌ఫ్రెండ్', సుధీర్ బాబు 'జటాధర' చిత్రాలు విడుదలవుతున్నాయి.
ఓటీటీలో 'బ్యాడ్ గర్ల్', 'అర్జున్ చక్రవర్తి' వంటి కొన్ని చిత్రాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
నవంబరు 03 నుంచి 09 వరకు ఓటీటీలో తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ చిత్రాలు, సిరీస్‌లు అందుబాటులో.
'మహారాణి సీజన్ 4', 'మాక్స్‌టన్ హాల్' వంటి ప్రముఖ సిరీస్‌లు కూడా ఓటీటీలోకి రానున్నాయి.
థియేటర్లలో ఈ వారం కొత్త చిత్రాలు
మరోవారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి రష్మిక ‘ద గర్ల్ ఫ్రెండ్’, సుధీర్ బాబు ‘జటాధర’తో పాటు ‘ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’, ‘ప్రేమిస్తున్నా’ అనే తెలుగు సినిమాలతో పాటు ‘ఆర్యన్’, ‘ఫీనిక్స్’ అనే డబ్బింగ్ చిత్రాలు రాబోతున్నాయి. వీటిలో రష్మిక మూవీ తప్పితే మిగతా వాటిపై హైప్ లేదు. ఓటీటీల్లోనూ ఈ వీకెండ్ రిలీజయ్యే వాటిలో కొన్నిమాత్రమే ఆసక్తి కలిగిస్తున్నాయి.
ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల్లో ‘బ్యాడ్ గర్ల్’, ‘బారాముల్లా’, ‘కిస్’, ‘ద ఫెంటాస్టిక్ ఫోర్’, ‘అర్జున్ చక్రవర్తి’.. ఉన్నంతలో కాస్త ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తున్నాయి. వీటితో పాటు కొన్ని ఇంగ్లీష్ మూవీస్, వెబ్ సిరీసులు కూడా ఉన్నాయి. ఇవి కాకుండా వీకెండ్‌లో సడన్ సర్‌ప్రైజ్ అన్నట్లు కొత్త చిత్రాలు ఏమైనా రావొచ్చు కూడా. ఇంతకీ ఏ ఓటీటీలో ఏయే మూవీస్ రానున్నాయంటే?
ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (నవంబరు 03 నుంచి 09 వరకు)
బ్యాడ్ గర్ల్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – నవంబరు 05
ద ఫెంటాస్టిక్ 4: ఫస్ట్ స్టెప్స్ (తెలుగు డబ్బింగ్ మూవీ) – నవంబరు 05
డాక్టర్ సూస్ ద స్నీచెస్ (ఇంగ్లీష్ సినిమా) – నవంబరు 03
ఇన్ వేవ్స్ అండ్ వార్ (ఇంగ్లీష్ మూవీ) – నవంబరు 03
ఓటీటీలో రిలీజయ్యే ఆసక్తికర మూవీస్
బారాముల్లా (ఇంగ్లీష్ సినిమా) – నవంబరు 07
ఫ్రాంకెన్ స్టెయిన్ (ఇంగ్లీష్ చిత్రం) – నవంబరు 07
నైన్ టూ నాట్ మీట్ టూ యూ (ఇంగ్లీష్ సిరీస్) – నవంబరు 03
మ్యాక్స్‌టన్ హాల్ (జర్మన్ సిరీస్) – నవంబరు 07
చిరంజీవ (తెలుగు చిత్రం) – నవంబరు 07
కిస్ (తమిళ సినిమా) – నవంబరు 07
తోడే దూర్ తోడే పాస్ (హిందీ సిరీస్) – నవంబరు 07
ఓటీటీలో విడుదల కానున్న చిత్రాల పూర్తి జాబితా
మహారాణి సీజన్ 4 (హిందీ సిరీస్) – నవంబరు 07
ప్లరిబస్ (ఇంగ్లీష్ సిరీస్) – నవంబరు 07
కరమ్ (మలయాళ సినిమా) – నవంబరు 07
ఫస్ట్ కాపీ సీజన్ 2 (హిందీ సిరీస్) – నవంబరు 05
అర్జున్ చక్రవర్తి (తెలుగు సినిమా) – నవంబరు 07
ద హ్యాక్ సీజన్ 1 (ఇంగ్లీష్ సిరీస్) – నవంబరు 07
ఈ వారం థియేటర్లలో, ఓటీటీల్లో వివిధ భాషల చిత్రాలు, సిరీస్‌లతో వినోదానికి లోటు లేదు. మీ అభిరుచికి తగ్గ సినిమాలు, సిరీస్‌లను ఎంచుకుని ఈ వీకెండ్ ఎంజాయ్ చేయండి.


