
హాలీవుడ్ సినిమా ప్రియులకు మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ ఎంతో ప్రత్యేకం. ఇటీవల విడుదలైన ఎనిమిదో భాగం ‘ది ఫైనల్ రికనింగ్’ గురించి ఈ రివ్యూలో చూద్దాం.
Key Points
టామ్ క్రూజ్ అద్భుతమైన స్టంట్స్ తో ఆకట్టుకుంటారు.
మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ లోని 8వ చిత్రం 'ది ఫైనల్ రికనింగ్'.
యాక్షన్ థ్రిల్లర్ ప్రేమికులకు విజువల్ ఫీస్ట్.
కథానాయకుడు తన టీమ్ తో కలిసి ప్రపంచాన్ని రక్షించే ప్రయత్నం.
అద్భుతమైన స్టంట్స్
హాలీవుడ్ సిరీస్‌లలో ‘మిషన్ ఇంపాజిబుల్’కి ప్రత్యేక క్రేజ్ ఉంది. ఈ సిరీస్‌లో ఎనిమిదో భాగం మిషన్ ఇంపాజిబుల్–ది ఫైనల్ రికనింగ్ ఇటీవల విడుదలైంది. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.
ఓ సీరియల్‌ను ప్రేక్షకులకు అలవాటుగా మార్చడం కొంచెం సులభం. కానీ అదే కథను సిరీస్ రూపంలో సినిమాలుగా చేస్తూ ప్రేక్షకులను మెప్పించడం మాత్రం కాస్త కష్టమనే చెప్పాలి. ఆ విషయంలో పాశ్చాత్య సిరీస్‌లు చాలావరకు విజయం సాధించాయి. అది కూడా పాతికేళ్ళకు పైగా ఒకే సిరీస్‌లో సినిమాలు నడపడమంటే మాటలా… ఇంపాజిబుల్. కానీ ఆ ఇంపాజిబుల్ టాస్క్‌ని పాజిబుల్ చేసి, ప్రేక్షకులను అలరిస్తున్న సిరీస్ ‘మిషన్ ఇంపాజిబుల్’. ఇటీవల ఈ హాలీవుడ్ సిరీస్‌లో 8వ సినిమాగా రిలీజ్ అయిన ‘మిషన్ ఇంపాజిబుల్–ది ఫైనల్ రికనింగ్’ సూపర్ అనే చెప్పాలి.
ఆకట్టుకునే కథాంశం
క్రిస్టోఫర్ మెక్ క్వారీ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈసారి కథానాయకుడైన ఇథన్ హంట్ స్టంట్స్ అదరహో అనేలా ఉన్నాయి. సిరీస్‌లోని అన్ని సినిమాలలో ఇథన్ హంట్ పాత్రలో ప్రముఖ హాలీవుడ్ కథానాయకుడు టామ్ క్రూజ్ నటించారు. ఆయన నిజమైన సూపర్ స్టంట్స్‌తో ఆకట్టుకుంటారు. అందుకే ఈ సిరీస్ అంత స్పెషల్. ముఖ్యంగా ఎనిమిదో భాగంలో వచ్చే రెండు స్టంట్ ఎపిసోడ్లలో ప్రేక్షకులకు మతి పోతుందనే చెప్పాలి.
విజువల్ ఫీస్ట్
సిరీస్ మొత్తం ఒకే పరమైన కథాంశంతో ఉంటుంది. కథానాయకుడు తన టీమ్‌తో కలిసి ప్రపంచాన్ని రక్షించడానికి విలువైన డాక్యుమెంట్లు, ఆయుధాలు శత్రువుల చేతుల్లోకి వెళ్ళకుండా చూడడమే మిషన్ ఇంపాజిబుల్. సిరీస్ మొదటినుంచి ఒకే టీమ్‌ను మెయింటైన్ చేస్తూ ఈ సినిమాలో మాత్రం టీమ్‌లోని ఓ మెంబరైన లూథర్ పాత్రను చంపేశారు. అదే ఆడియన్స్‌ను కొంచెం ఆలోచనలో పడేస్తుంది. ఓవరాల్‌గా ‘మిషన్ ఇంపాజిబుల్–ది ఫైనల్ రికనింగ్’ సినిమా యాక్షన్ థ్రిల్లర్‌ను ఇష్టపడేవాళ్ళకి… అలాగే ఈ సిరీస్‌ను ఫాలో అయ్యేవాళ్ళకు విజువల్ ఫీస్ట్ అనే చెప్పాలి. సో… ‘ఎంజాయ్ మిషన్ ఇంపాజిబుల్–ది ఫైనల్ రికనింగ్’ ఇన్ థియేటర్స్. – హరికృష్ణ ఇంటూరు
మొత్తం మీద, ‘మిషన్ ఇంపాజిబుల్ – ది ఫైనల్ రికనింగ్’ యాక్షన్ థ్రిల్లర్ ప్రేమికులకు తప్పనిసరిగా చూడాల్సిన చిత్రం. టామ్ క్రూజ్ అభిమానులకు ఇది ఒక విందు.


