|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Pakashala Pantham : రమ్యకృష్ణ – ఐశ్వర్య రాజేష్ ‘పాకశాల పంతం’… పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్

Published: 09-12-2025, 12:08 PM
Pakashala Pantham : రమ్యకృష్ణ – ఐశ్వర్య రాజేష్ ‘పాకశాల పంతం’… పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్
  • రమ్యకృష్ణ, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో ‘పాకశాల పంతం’ చిత్రం తెరకెక్కుతోంది.
  • ‘ఈటీవీ ఒరిజినల్స్’ నిర్మిస్తున్న ఈ సినిమా లాంచ్ పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది.
  • కరణ్ తుమ్మకొమ్మ దర్శకత్వం వహిస్తుండగా, ప్రవీణ్ కొల్లా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
  • అత్తాకోడళ్ల గిల్లికజ్జల నేపథ్యంలో సాగే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది.

పవర్ ఫుల్ నటి రమ్యకృష్ణ, స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ కలయికలో రూపొందుతున్న ‘పాకశాల పంతం’ సినిమా లాంచ్ ఘనంగా జరిగింది. ఈటీవీ ఒరిజినల్స్ నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అత్తాకోడళ్ల సరదా గిల్లికజ్జాల నేపథ్యంలో ప్రేక్షకులను అలరించనుంది.

‘పాకశాల పంతం’ మూవీ లాంచ్ వివరాలు

Pakashala Pantham : పవర్ ఫుల్ రోల్స్ కు కేరాఫ్ అడ్రస్ రమ్యకృష్ణ. రొమాంటిక్ రోల్స్ తో పాటు లేడీ ఓరియెంటెడ్ రోల్స్ తో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది ఐశ్వర్య రాజేష్. ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న ఈ ఇద్దరు హీరోయిన్లు కలిసి చేస్తున్న సినిమానే ‘పాకశాల పంతం’. తాజాగా ఈ మూవీ లాంచ్ ఘనంగా జరిగింది.

రమ్యకృష్ణ, ఐశ్వర్య రాజేష్ కీలక పాత్రల్లో

‘కొల్లా’ సమర్పణలో ‘ఈటీవీ ఒరిజినల్స్’ నిర్మిస్తున్న మూవీ ‘పాకశాల పంతం’. ఈ సినిమా పూజా కార్యక్రమం ఈరోజు హైదరాబాద్ లో జరిగింది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు కరణ్ తుమ్మకొమ్మ దర్శకత్వం వహిస్తుండగా, ప్రవీణ్ కొల్లా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చంద్రశేఖర్ మహదాస్ సహ నిర్మాత కాగా, ‘పాకశాల పంతం’ చిత్రంలో సీనియర్ నటి రమ్యకృష్ణ, స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మెయిన్ లీడ్స్ గా నటిస్తున్నారు. సమీరా భరద్వాజ్, రాకేష్ రాచకొండ, మాయా నెల్లూరి, సంజయ్ స్వరూప్, మహత్ రాఘవేంద్ర, ఎస్.ఎస్. కాంచీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా మూవీ లాంచ్ సందర్భంగా రమ్యకృష్ణ, ఐశ్వర్య రాజేష్ సినిమా పూజా కార్యక్రమానికి హాజరై సందడి చేశారు. ఈ సినిమాకు ఆర్‌.హెచ్‌. విక్రమ్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే మూవీ రెగ్యులర్ షూటింగ్ షురూ కానుంది. అత్తాకోడళ్ల గిల్లికజ్జాల టైప్ కథతో తెరకెక్కబోతున్న ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ కు పక్కా మంచి ట్రీట్ అవుతుంది. మూవీ థియేట్రికల్ రిలీజ్ డేట్ ను మేకర్స్ త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.

అత్తాకోడళ్ల గిల్లికజ్జాల ఫ్యామిలీ ఎంటర్టైనర్

Read Also : తనూజాకు ఝలక్ ఇచ్చిన కళ్యాణ్… అమ్మను కాపాడుకోలేకపోయిన ఇమ్మూ… టార్గెట్ అయ్యి తల్లడిల్లిన సంజన

మొత్తానికి రమ్యకృష్ణ, ఐశ్వర్య రాజేష్ కాంబినేషన్లో వస్తున్న ఈ ‘పాకశాల పంతం’ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌కు మంచి ట్రీట్ ఇస్తుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.