
📌 Key Points
- పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య తాత్కాలిక యుద్ధ విరమణ ఒప్పందం కుదిరింది.
- రంజాన్ పండుగ సందర్భంగా కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి.
- బుధవారం అర్ధరాత్రి నుంచి సోమవారం అర్ధరాత్రి వరకు కాల్పుల విరమణ కొనసాగుతుంది.
- ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ నుండి దాడులు జరిగితే ఆపరేషన్ తిరిగి ప్రారంభిస్తామని పాకిస్తాన్ హెచ్చరించింది.
పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య తాత్కాలికంగా యుద్ధ విరమణ జరిగింది. రంజాన్ పండుగ మరియు ఇతర దేశాల మధ్యవర్తిత్వం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది.
యుద్ధ విరమణకు కారణాలు ఏమిటి?
ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య తాత్కాలిక యుద్ధ విరమణ ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగానే ఆఫ్ఘనిస్తాన్ పై ప్రస్తుతం నిర్వహిస్తున్న దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారికంగా పాకిస్తాన్ ప్రకటన చేసింది. రంజాన్ పండుగ, సౌదీ అరేబియా, టర్కీ, ఖతర్ లాంటి దేశాల మధ్య వర్తిత్వం కారణంగా తాత్కాలిక కాల్పుల విరమణకు రెండు దేశాలు ఒప్పుకున్నాయి. ఈ మేరకు రెండు దేశాల మధ్య ఒప్పందం కూడా కుదిరింది. ముఖ్యంగా రంజాన్ మాసం ఉన్న నేపథ్యంలో యుద్ధానికి తాత్కాలిక బ్రేక్ పడింది.
ఎప్పటి వరకు కాల్పుల విరమణ?
ఈ కాల్పుల విరమణ బుధవారం అర్ధరాత్రి ప్రారంభమైనట్లు పాకిస్తాన్ సమాచారం మంత్రి అతవుల్లా తరార్ ప్రకటన చేశారు. వచ్చే సోమవారం అర్ధరాత్రితో ఈ ఒప్పందం ముగుస్తుందని కూడా క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ సమయంలో సరిహద్దుల నుంచి ఎలాంటి ఉగ్రవాద, డ్రోన్ దాడులు జరగకూడదని పేర్కొన్నారు అతవుల్లా తరార్. ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ నుంచి దాడులు జరిగితే మాత్రం ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. అలాంటి సంఘటన చోటు చేసుకుంటే వెంటనే ఆపరేషన్ పున: ప్రారంభిస్తామని హెచ్చరికలు జారీ చేశారు అతవుల్లా తరార్. దాదాపు 5 రోజుల పాటు పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య తాత్కాలిక యుద్ధ విరమణ ఉంటుందన్న మాట. ఇది ఇలా ఉండగా, రెండు రోజుల కిందట ఆఫ్ఘనిస్తాన్ లోని కాబూల్ ఆసుపత్రిపై పాకిస్తాన్ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ సంఘటనలో దాదాపు 400 మంది ఆఫ్గనిస్తాన్ అమాయక ప్రజలు మరణించారు.
పాకిస్తాన్ హెచ్చరికలు
A post shared by Stream Pakistan (@stream.pakistan)
మొత్తానికి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ల మధ్య ఐదు రోజుల పాటు యుద్ధ విరమణ కొనసాగనుంది. అయితే, పరిస్థితులు సద్దుమణగకపోతే మాత్రం పాకిస్తాన్ తన ఆపరేషన్లను తిరిగి ప్రారంభించే అవకాశం ఉంది.


