|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Palak Tiwari: ఆ స్టార్ హీరో నా వ్యక్తిత్వాన్నే మార్చేశాడు.. హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published: 13-06-2025, 7:58 AM
Palak Tiwari: ఆ స్టార్ హీరో నా వ్యక్తిత్వాన్నే మార్చేశాడు.. హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

టెలివిజన్ నటి శ్వేతా తివారీ కుమార్తె పాలక్ తివారీ, తన వ్యక్తిత్వంపై సల్మాన్ ఖాన్ ప్రభావాన్ని వెల్లడించింది. ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన పాలక్, సల్మాన్ ఖాన్ ఇచ్చిన సలహాలను పాటిస్తున్నట్లు తెలిపింది.

Key Points

1

పాలక్ తివారీ, సల్మాన్ ఖాన్ తో తన అనుభవాలను పంచుకుంది.

2

సల్మాన్ ఖాన్ ఆమె వ్యక్తిత్వాన్ని మార్చారని పేర్కొంది.

4

‘ఆంటిమ్: ది ఫైనల్ ట్రూత్’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసింది.

సల్మాన్ ఖాన్ తో పాలక్ తివారీ అనుభవం

టెలివిజన్ నటి శ్వేతా తివారీ కుమార్తె పాలక్ తివారీ (Palak Tiwari).. 2023లో సల్మాన్ ఖాన్ (Salman Khan) నటించిన ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చింది. అయితే.. మషబుల్ ఇండియా నిర్వహించిన ఈ బాండే జర్నీ తాజా ఎపిసోడ్‌లో పాలక్ తివారీ మాట్లాడుతూ.. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తన వ్యక్తిత్వాన్నే మార్చేశారు అని తెలిపింది. ‘ఒకసారి బిగ్‌బాస్ (Bigg Boss) మీటింగ్‌లో సల్మాన్ ఖాన్ నాతో మాట్లాడారు. అప్పుడు నువ్వు జీవితంలో ఏం అవ్వాలి అనుకుంటున్నావు అని నన్ను అడిగారు. హీరోయిన్ అవ్వాలని ఉందని చెప్పా. అప్పుడు నా వయసు 18 ఏళ్లు మాత్రమే. దీంతో సల్మాన్ ఖాన్.. నువ్వు నటిగా కంటే ముందు కెమెరా వెనుక పనిచేయమని సలహా ఇచ్చారు.

ఇంత పెద్దగా ఎదిగిన నటుడు ఇచ్చిన సలహా నేను పాటించాలని సరే అన్నాను. సల్మాన్ నటించిన ‘ఆంటిమ్: ది ఫైనల్ ట్రూత్’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. సల్మాన్ ఖాన్, ఆయుష్ శర్మ ఈ చిత్రానికి ముఖ్య పాత్రలు పోషించారు. నేను ఆయనతో సినిమా మొత్తం చేశాను. సల్మాన్‌ను కలిసినప్పుడల్లా చాలా ఆశ్చర్యపోతాను. నేను సాధారణంగా స్టార్-స్ట్రక్ అవ్వను.. మీరు ఎవరినైనా నా ముందు కూర్చోబెట్టవచ్చు. కానీ సల్యాన్ నా ముందు ఉన్నప్పుడు మాత్రం నేను మాట్లాడటం మానేసి నత్తిగా మాట్లాడటం ప్రారంభిస్తాను. అతను నా మొత్తం వ్యక్తిత్వాన్ని మార్చేసాడు’ అని చెప్పుకొచ్చింది. కాగా.. పాలక్ తివారీ సినీ కెరీర్ స్టార్ట్ చెయ్యకముందే ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చి తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. ఈ ఏడాది వచ్చిన ‘భూత్నీ’ (Bhootni) చిత్రంలో కనిపించి మెప్పించింది.

కిసీ కా భాయ్ కిసీ కి జాన్ సినిమా ప్రస్తావన

వ్యక్తిత్వంలో మార్పు

చివరగా, సల్మాన్ ఖాన్ పాలక్ తివారీ జీవితం మరియు వృత్తిపై ఎంతో ప్రభావం చూపాడని, ఆమె తన అనుభవాలను పంచుకుంది. తన వృత్తి జీవితంపై సల్మాన్ ఖాన్ సలహాలు ఎంతగా ప్రభావితం చేశాయో తెలియజేసింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.