
అనుపమ పరమేశ్వరన్ నటించిన ‘పరదా’ సినిమా ప్రమోషన్స్‌లో ఆమె చేసిన వినూత్న ప్రయత్నం ప్రేక్షకులను ఆకట్టుకుంది. వైజాగ్‌లో రోడ్డుపై కారులో నిలబడి, ‘పరదాలమ్మా పరదాలు’ అంటూ ప్రచారం చేసింది.
Key Points
అనుపమ పరమేశ్వరన్ 'పరదా' సినిమా ప్రమోషన్స్‌లో రోడ్డుపై ప్రచారం చేసింది.
'పరదాలమ్మా పరదాలు' అంటూ కారులో నిలబడి సినిమాను ప్రమోట్ చేసింది.
ఆగస్టు 22న 'పరదా' సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
అనుపమ యొక్క వినూత్న ప్రమోషన్
అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్ లో వస్తోన్న తాజా చిత్రం ‘పరదా’. ఈ లేడీ ఓరియంటెడ్ చిత్రానికి సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ఇప్పటికే పరదా ట్రైలర్ రిలీజ్ చేయగా .. ఈ మూవీపై అభిమానుల్లో అంచనాలు మరింత పెంచేసింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో అనుపమ ఫుల్ బిజీగా ఉంది . దీంతో వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతోంది .
తాజాగా తన మూవీ పరదా ప్రమోషన్స్ ను రోటీన్ కు భిన్నంగా నిర్వహించింది . వైజాగ్‌లో ఏకంగా రోడ్డుపై మైక్ పట్టుకుని ప్రచారం చేసింది . పరదాలమ్మా .. పరదాలు .. రంగురంగుల పరదాలు .. తీసుకోవాలమ్మా .. తీసుకోవాలి అంటూ కారులో నిలబడి తన మూవీని ప్రమోట్ చేసింది . దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది . కాగా.. అనుపమ పరమేశ్వరన్ నటించిన పరదా ఆగస్టు 22న థియేటర్లలోకి మూవీ రానుంది. ఇందులో అనుపమతో పాటు మలయాళ నటి దర్శన్, సంగీత కూడా కీలక పాత్రల్లో నటించారు.
రోడ్డుపై సినిమా ప్రచారం
‘పరదా’ సినిమా విడుదల తేదీ
అనుపమ పరమేశ్వరన్ చేసిన ఈ ప్రత్యేకమైన ప్రమోషన్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఆగస్టు 22న విడుదల కానున్న ‘పరదా’ సినిమా విజయవంతం కావాలని ఆశిద్దాం.


