
📌 Key Points
- దూరంగా ఉంటున్న కూతురి కోసం తల్లిదండ్రుల ఆప్యాయతను సీసీ కెమెరాలో బంధించిన శివానీ శుక్లా.
- కూతురు క్షేమం కోసం సీసీ కెమెరాకు ఎదురుగా వచ్చి పలకరించిన తల్లిదండ్రులు.
- తల్లిదండ్రుల ప్రేమను చూసి మురిసిపోయిన నెటిజన్లు, వైరల్ అవుతున్న వీడియో.
- దూరమైనా తమ పిల్లల గురించి తల్లిదండ్రుల ప్రేమ ఎప్పటికీ తరగదని కామెంట్స్.
ఉరుకుల పరుగుల జీవితంలో ఉద్యోగాల కోసం పిల్లలు తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నారు. అయితే, దూరంగా ఉంటున్న తమ పిల్లల క్షేమం కోసం తల్లిదండ్రులు పడే తపనను తెలియజేసే వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
కూతురి కోసం సీసీ కెమెరా పెట్టిన తల్లిదండ్రులు
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో అయినవారికి దూర ప్రాంతంలో గడిపేలా చేస్తున్నాయి. ఉన్నత చదువుల కోసమో, ఉద్యోగాల కోసమో సొంత ఊరిని, కన్నవారిని వదిలి వెళ్లడం అనివార్యమైపోయింది. అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన అమ్మనాన్నలను అలనా పాలన చూసుకునే పరిస్థితులు కనిపించడం లేదు. ఇక తమది కాని ప్రదేశంలో తమ పిల్లలు ఎలా ఉంటున్నారు? ఏం తింటున్నారో అనే బెంగ తల్లిదండ్రులను వేధిస్తుంటుంది. తాజాగా తన పెరెంట్స్ కు దూరంగా ఉంటున్న ఓ కూతురు చేసిన పని సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. ఇది చూసిన వారంతా తల్లిదండ్రుల ప్రేమకు ఫిదా అవుతున్నారు.
శివానీ శుక్లా అనే ఇన్ స్టాగ్రామ్ యూజర్ తల్లిదండ్రులకు దూరంగా వేరే నగరంలో ఉండాల్సి వచ్చింది. దీంతో తాను దూరంగా ఉంటే ఇంట్లో తన తల్లిదండ్రులు సెఫ్టీ ఏంటో అనే బెంగ ఆవిడను వేధించింది. ఈ క్రమంలో ఇంట్లో సర్వైలెన్స్ కెమెరాను ఏర్పాటు చేయించగా ఈ నిర్ణయం ఆమెకు ఓ మధుర అనుభవం మిగిల్చింది. సీసీ కెమెరా ఏర్పాటు చేయించి వేరే ప్రాంతానికి వెళ్లిన తర్వాత శివాని తల్లిదండ్రులు ఆ కెమెరాకు ఎదురుగా వచ్చి లెన్స్ లోకి చూస్తూ ఆమెను పలకిస్తున్నట్లు చేతులు ఊపడం, సమయానికి తిన్నావా అంటూ సైగలు చేయడం చేస్తున్నారు. సీసీ సీసీ కెమెరా ముందు తన తల్లిదండ్రుల పలకరింపులకు సంబంధించిన వీడియోను శివానీ తాజా ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. ఇంట్లో సీసీ టీవీ ఇన్ స్టాల్ చేయడం నా జీవితంలో తీసుకున్నమంచి నిర్ణయం అంటూ రాసుకొచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తల్లిదండ్రులు పలకరింపుల పట్ల ఫిదా అవుతున్నారు. తల్లిదండ్రుల ప్రేమకు భాష అక్కర్లేదని దూరంగా ఉన్నా గుండెల్లో ఎప్పుడు తరగని ప్రేమను నింపుకుంటారని కామెట్ చేస్తున్నారు.
వైరల్ అవుతున్న తల్లిదండ్రుల ప్రేమ వీడియో
నెటిజన్ల స్పందన: తల్లిదండ్రుల ప్రేమకు భాష లేదు
దూరమెంత ఉన్నా, తల్లిదండ్రుల ప్రేమ మాత్రం ఎప్పటికీ తరగనిదని ఈ వీడియో నిరూపిస్తుంది. కళ్ళకు కనిపించకున్నా, గుండెల్లో కొలువై ఉంటారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.


