|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సభలో గ్యాస్ గొడవ: రాహుల్ ప్రశ్నలకు కేంద్ర మంత్రి ఘాటు సమాధానం! దుమారం రేపిన చర్చ!!

Published: 12-03-2026, 8:35 AM
సభలో గ్యాస్ గొడవ: రాహుల్ ప్రశ్నలకు కేంద్ర మంత్రి ఘాటు సమాధానం! దుమారం రేపిన చర్చ!!
  • భారత్‌లో పెట్రోల్, డీజిల్ కొరత లేదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ ప్రకటన.
  • దేశంలో 28% గ్యాస్ ఉత్పత్తి పెంచామని, వినియోగదారులకు ఇబ్బంది ఉండదన్న మంత్రి.
  • అమెరికా అనుమతి లేకుండా ముడి చమురు కొనలేరా అని రాహుల్ గాంధీ ప్రశ్న.
  • హర్మూజ్ జలసంధి భారత్ కోసమే తెరిచారని, సంక్షోభం లేదని కేంద్ర మంత్రి కౌంటర్.

భారతదేశంలో ఇంధన కొరత లేదని కేంద్రం స్పష్టం చేసింది. లోక్ సభలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ ఈ విషయాన్ని ప్రకటించారు. వంటగ్యాస్ కొరతపై రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన భరోసా ఇచ్చారు.

గ్యాస్ కొరతపై కేంద్రం ప్రకటన

ఇరాన్ యుద్ధం నేపథ్యంలో భారత్‍లో ఇంధనం కొరతపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. భారత్ లో పెట్రోల్, డీజిల్ కొరత లేదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ (Hardeep Singh Puri) లోక్ సభలో ఇవాళ ప్రకటించారు. వంటగ్యాస్ కొరతపై ఆందోళన వద్దని, సంక్షోభాన్ని ఎదుర్కొవడానికి కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు. దేశంలో 28 శాతం గ్యాస్ ఉత్పత్తిని పెంచామని గృహవినియోగదారులకు ఇబ్బందులు రానివ్వమని స్పష్టం చేశారు. బుకింగ్ చేసిన రెండున్నర రోజుల్లోనే గ్యాస్ డెలివరీ చేస్తున్నట్టు తెలిపారు. సీఎన్జీ 100 శాతం సరఫరా జరుగుతోందని విదేశాలతో పోలిస్తే మన దగ్గర గ్యాస్ చౌక అన్నారు. దేశంలోని చమురు శుద్ధి కర్మాగారాలు పూర్తి సామర్థ్యంతో పని చేస్తున్నాయని హర్మూజ్ ఇబ్బందుల దృష్ట్యా ప్రత్యామ్నాయ మార్గాల్లో సరఫరా జరుగుతోందని హర్మూజ్ యేతర ముడి చమురు సరఫరా 70 శాతానికి పెరిగిందన్నారు. ప్రతి రోజు 90 మిలియన్ మెట్రిక్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి చేస్తున్నామని చెప్పారు.

వంటగ్యాస్ కొరతపై లోక్ సభలో రాహుల్ గాంధీ కేంద్రాన్ని ప్రశ్నించారు. అమెరికా అనుమతి లేకుంటే ముటిచమురు కొనరా అని నిలదీశారు. భారత్ వ్యవహారాలను అమెరికా శాసిస్తోందని విమర్శించారు. యుద్ద సమయంలో హర్మూజ్ జలసంధి నుంచి దిగుమతులు ఆగిపోయాయని గ్యాస్ కొరతతో దేశం అల్లాడిపోతుందన్నదన్నారు. ఆరంభంలోనే పరిస్థితి ఇలా ఉందని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా సభలో ఎఫ్‍స్టీన్ ఫైల్స్ ను రాహుల్ ప్రస్తావించారు. హల్దీప్ సింగ్‍కు ఎఫ్‍స్టీన్‍తో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. దీంతో రాహుల్ గాంధీకి కౌంటర్ ఇచ్చారు. హర్మూజ్ జలసంధి భారత్ కు మాత్రమే తెరిచారని, హర్మూజ్ సంక్షోభంతో భారత్ కు సంబంధం లేదన్నారు.

రాహుల్ గాంధీ ప్రశ్నలు

కేంద్ర మంత్రి కౌంటర్

సభలో గ్యాస్ సిలిండర్ల కొరతపై చర్చ జరిగింది. రాహుల్ గాంధీ ప్రశ్నలకు కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, ప్రజలకు ఇబ్బంది ఉండదని మంత్రి హామీ ఇచ్చారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.