|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పవన్ కళ్యాణ్ 500 కోట్ల భూమి కబ్జా ఆరోపణలు: జనసేన దిమ్మతిరిగే కౌంటర్!

Published: 30-05-2026, 5:01 PM
పవన్ కళ్యాణ్ 500 కోట్ల భూమి కబ్జా ఆరోపణలు: జనసేన దిమ్మతిరిగే కౌంటర్!
  • పవన్ కళ్యాణ్ 500 కోట్ల విలువైన కోడి చెరువు భూమిని కబ్జా చేశారని రఘు ఆరోపణ.
  • 10 ఎకరాల విస్తీర్ణంలోని ఈ భూమి రంగారెడ్డి జిల్లా, శంకర్ పల్లి మండలం, జన్వాడలో ఉంది.
  • జనసేన శ్రేణులు ఆరోపణలను ఖండించాయి, ఇది రాజకీయ దివాళాకోరుతనం అని పేర్కొన్నాయి.
  • పవన్ కళ్యాణ్ భూమిని 2014లో చట్టబద్ధంగా కొనుగోలు చేశారని, ఆధారాలున్నాయని జనసేన వెల్లడి.

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై 500 కోట్ల విలువైన ‘కోడి చెరువు’ భూమిని కబ్జా చేశారనే ఆరోపణలు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపాయి. ఈ వివాదంపై జనసేన శ్రేణులు తీవ్రంగా స్పందించాయి, ఇది రాజకీయ కుట్రగా అభివర్ణించాయి.

కోడి చెరువు వివాదం: అసలేం జరిగింది?

Kodicheruvu controversy: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని వెలుగులోకి వచ్చిన సరికొత్త భూవివాదం ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది.విషయంలోకి వెళ్తే..తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా, శంకర్ పల్లి మండలం, జన్వాడ గ్రామం పరిధిలో ఉన్న “కోడి చెరువు” భూమిని పవన్ కళ్యాణ్ అక్రమంగా కబ్జా చేశారంటూ మన తొలివెలుగు రఘు నెట్టింట్లో విడుదల చేసిన వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది.

ప్రజల కోసం తన కష్టార్జితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని, సినీ కెరీర్‌ను సైతం త్యాగం చేసిన జనసేన పార్టీ అధినేత, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిపై భూ కబ్జా అంటూ అవాస్తవ ప్రచారాలు చేయడం రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనం.

జనసేన స్పందన: ఆరోపణల వెనుక కుట్ర?

రాజకీయంగా ఎదుర్కోలేక, ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను… pic.twitter.com/yFYE27GYm1

— JanaSena Shatagni (@JSPShatagniTeam) May 30, 2026

పవన్ కళ్యాణ్ ఫాం హౌస్ భూముల వాస్తవాలు

ఈ వివాదానికి సంబంధించి శంకర్ పల్లిలోని పవన్ కళ్యాణ్ ఫాం హౌస్ భూములపై జనసేన పార్టీ స్పష్టమైన చట్టబద్ధమైన వాస్తవాలను, ఆధారాలను ప్రజల ముందుంచింది. ఈ భూమిని 15 డిసెంబర్ 2014న ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్, 1882 లోని సెక్షన్ 54 ప్రకారం పూర్తి చట్టబద్ధంగా కొనుగోలు చేయడం జరిగిందని వారు స్పష్టం చేశారు. అంతేకాకుండా, రిజిస్ట్రేషన్ యాక్ట్, 1908 లోని సెక్షన్ 17 ప్రకారం అధికారికంగా రిజిస్టర్డ్ సేల్ డీడ్ నమోదైందని, ఒక రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అనేది చట్టబద్ధ యాజమాన్యానికి తిరుగులేని ప్రభుత్వ సాక్ష్యమని గుర్తు చేశారు. వివాదంలోకి లాగుతున్న ఎఫ్‌టీఎల్ (FTL) నిబంధనలు కేవలం శాశ్వత నిర్మాణాలకు మాత్రమే వర్తిస్తాయి తప్ప, భూమి యొక్క యాజమాన్య హక్కులపై ఎలాంటి ప్రభావం చూపవని వివరించారు. “ప్రభుత్వ భూమి”గా చిత్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ ఇక శిఖం పట్టా భూమి అంటేనే వ్యక్తిగత యాజమాన్య హక్కులు కలిగిన భూమి అని, దానిని కావాలనే “ప్రభుత్వ భూమి”గా చిత్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడం అజ్ఞానానికి లేదా ఉద్దేశపూర్వక మోసానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ఈ భూమికి సంబంధించిన మ్యుటేషన్లు, ఖాతా నంబర్లు, సబ్-డివిజన్లు అన్నీ తెలంగాణ రెవెన్యూ చట్టాల ప్రకారమే జరిగాయని, ఒక వ్యక్తికి ఒకే ఖాతా ఉండాలనే చట్టం ఎక్కడా లేదని వారు నిరూపించారు. చట్టబద్ధంగా రిజిస్టర్డ్ సేల్ డీడ్ ఉంటే అది లీగల్ ఓనర్‌షిప్‌ను సూచిస్తుందని, మ్యుటేషన్ అనేది పూర్తిగా రెవెన్యూ ప్రక్రియ అని, మల్టిపుల్ ఖాతాలు కలిగి ఉండటం చట్టబద్ధంగా అంగీకరించబడిన విషయమేనని స్పష్టం చేశారు. దమ్ముంటే ఒక్క ఆధారం అయినా బయట పెట్టాలి అన్ని ప్రభుత్వ రికార్డులు, చట్టబద్ధ పత్రాలు పక్కాగా ఒక వైపు ఉంటే… కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని జనసేన నాయకులు మండిపడ్డారు. భూ కబ్జా జరిగిందని ఆరోపిస్తున్న వారు దమ్ముంటే ఒక్క ఆధారం అయినా ప్రజల ముందుంచాలని, చట్టబద్ధంగా కొనుగోలు చేసిన భూమిని కబ్జాగా చిత్రీకరిస్తూ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత పరువుకు భంగం కలిగిస్తున్న వారు, తెర వెనుక ఉండి నడిపిస్తున్న చిల్లర నాయకులు ఎవరైనా సరే బయటకు వచ్చి తప్పు అని నిరూపించాలని జనసేన ‘శతఘ్ని సవాల్’ విసిరింది. విసిరారు. వాస్తవాలను వక్రీకరించి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు ఎంత చేసినా, పవన్ కళ్యాణ్ నిబద్ధతను, ప్రజల నమ్మకాన్ని దెబ్బతీయలేరని, ఆయనపై అబద్ధపు ఆరోపణలు చేయడం అంటే హిమాలయ శిఖరాన్ని గులకరాయితో కూల్చేయాలని ప్రయత్నించినట్టేనని జనసేన శ్రేణులు సోషల్ మీడియా వేదికగా తేల్చిచెప్పాయి. ఈ వివరణలతో కూడిన కౌంటర్ ఇప్పుడు నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది.చూడాలి మరి దీనికి మళ్ళీ రఘు ఎలాంటి కౌంటర్ వదులుతాడో !

మొత్తంగా, పవన్ కళ్యాణ్‌పై వచ్చిన భూకబ్జా ఆరోపణలు రాజకీయ దుమారాన్ని రేపాయి. జనసేన ఈ ఆరోపణలను ఖండిస్తూ, తమ నాయకుడి నిజాయితీని నిరూపించేందుకు సిద్ధంగా ఉంది. ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.