|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పవన్ కళ్యాణ్ సినిమాలో ప్రభాస్ హీరోయిన్? సురేందర్ రెడ్డి సంచలన నిర్ణయం! అభిమానుల్లో ఉత్కంఠ!

Published: 06-02-2026, 11:05 AM
పవన్ కళ్యాణ్ సినిమాలో ప్రభాస్ హీరోయిన్? సురేందర్ రెడ్డి సంచలన నిర్ణయం! అభిమానుల్లో ఉత్కంఠ!
  • పవన్ కళ్యాణ్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొత్త సినిమాకు కమిట్ అయ్యారు.
  • ప్రభాస్ ‘ఫౌజీ’ సినిమాలో నటిస్తున్న ఇమాన్వి, పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి.
  • గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చి 26న విడుదల కానుంది.
  • పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉండటం అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తోంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాలతో బిజీ అవుతున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఆయన ఓ సినిమా చేయనుండగా, ఇందులో ప్రభాస్ హీరోయిన్ ఇమాన్వి నటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా, ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలకు సిద్ధంగా ఉంది.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సినిమా

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల పరంగా ఎంతో బిజీ అవుతున్నారు. ఈయన గత మూడు సంవత్సరాల క్రితం కమిట్ అయిన సినిమాలు అన్నింటిని పూర్తి చేసి ఆ సినిమాలను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాల తర్వాత పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలకు కమిట్ అవ్వరని అభిమానులు అందరూ భావించారు కానీ ఆ వార్తలలో నిజం లేదని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఇటీవల దర్శకుడు సురేందర్ రెడ్డి(Surendar reddy) డైరెక్షన్ లో ఓ సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పనులు అతి త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.

ఇప్పటికే స్క్రిప్ట్ మొత్తం పూర్తి అయ్యిందని, ఈ సినిమాలో నటీనటుల ఎంపిక విషయంలో సురేందర్ రెడ్డి బిజీగా ఉన్నారని తెలుస్తుంది. ఉగాది పండుగ తర్వాత రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నాయని తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ఎంపిక గురించి సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడిగా ప్రభాస్ (Prabhas)హీరోయిన్ ను తీసుకోవాలనే ఆలోచనలు సురేందర్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ (Fauzi)సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ప్రభాస్ హీరోయిన్ పవన్ కళ్యాణ్ సరసన?

ఈ సినిమాలో ప్రభాస్ జోడిగా నటి ఇమాన్వి (Imanvi)నటిస్తున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్న ఈమె ఏకంగా ప్రభాస్ సినిమాలు ఛాన్స్ అందుకోవటం విశేషం. ప్రభాస్ సినిమాలో నటిస్తున్న ఈమె తన రెండో సినిమానే పవన్ కళ్యాణ్ తో చేసే అవకాశాన్ని అందుకోబోతున్నారనే విషయం తెలిసి అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమాలో ఇమాన్వి నటించబోతున్నారు అంటూ వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.

గబ్బర్ సింగ్ సక్సెస్ వచ్చేనా?

ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల తేదీ ఖరారు!

ఇక పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వస్తే ఎన్నికల కంటే ముందుగానే హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా ఏప్రిల్ లేదా మే నెలలో విడుదల కాబోతుందని అభిమానులు భావించారు కానీ మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇటీవల ఈ సినిమా విడుదల తేదీని చిత్ర బృందం అధికారకంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. గబ్బర్ సింగ్ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. మరి ఈ సినిమా విషయంలో గబ్బర్ సింగ్ సక్సెస్ రిపీట్ అవుతుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది.

పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉండటం, కొత్త కాంబినేషన్లు తెరపైకి వస్తుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ వార్తలు నిజమవుతాయో లేదో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.