
📌 Key Points
- పవన్ కళ్యాణ్ శనివారం సాయంత్రం శస్త్రచికిత్స చేయించుకున్నారు.
- ఆరోగ్యం సహకరించకపోవడంతో అధికారిక కార్యక్రమాలు రద్దు చేసుకున్నారు.
- పవన్ త్వరగా కోలుకోవాలని రాజకీయ నేతలు, అభిమానులు ఆకాంక్షించారు.
- ‘OG’, ‘హరి హర వీరమల్లు’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలను పూర్తి చేయాల్సి ఉంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శనివారం సాయంత్రం శస్త్రచికిత్స చేయించుకున్నారు. గత కొంతకాలంగా రాజకీయ, సినిమా కార్యక్రమాలతో బిజీగా ఉండడం వల్ల ఆయన ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆయన ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది.
పవన్ కళ్యాణ్ కి సడన్ సర్జరీ
Pawan Kalyan : పవర్ స్టార్ .. పవన్ కళ్యాణ్ కి శనివారం సాయంత్రం శస్త్రచికిత్స జరిగిందనే వార్త ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది. గత కొద్ది నెలలుగా అటు పాలిటిక్స్, ఇటు సినిమాలంటూ బిజీ బిజీగా గడిపిన పవన్ శుక్రవారం ఉదయం తన అధికారులతో మీటింగ్‌లో ఉండగా ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నిజానికి ఏప్రిల్ 17వ తేదీ శుక్రవారం నాడు ఆయన ఎన్నో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉందని సమాచారం. కానీ ఆరోగ్యం సహకరించకపోవడంతో వాటన్నింటినీ రద్దు చేసుకుని వ్యక్తిగత వైద్యుల సలహాతో ఆసుపత్రికి వెళ్లారు.
శనివారం సాయంత్రం పవన్ కళ్యాణ్ కి సర్జరీ
అక్కడ MRI పరీక్షలు చేసిన వైద్యులు పరిస్థితిని బట్టి ఏప్రిల్ 18 శనివారం సాయంత్రం ఆయనకు సర్జరీ పూర్తి చేసినట్టు తెలుస్తుంది. ఇక ఒక్కసారిగా పవన్ కి సర్జరీ జరిగిందన్న వార్త బయటికి రావడంతో జనసైనికులు, ఇటు మెగా ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారట. మరోవైపు ఏపీ ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి వంటి కీలక శాఖల బాధ్యతలను ఆయన భుజాన వేసుకున్నారు. ఇక పది రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్స్ చెప్పినప్పటికీ మునుపటి యాక్టివ్ అవ్వాలంటే మాత్రం ఎక్కువ టైం పడుతుందని తెలుస్తుంది. ఇక ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి హరి ప్రసాద్, డిప్యూటీ సీఎంవో ప్రకటన విడుదల చేశాయి కూడా. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని రాజకీయ పార్టీల నేతలు, కూటమి కార్యకర్తలు, ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.
అంటే పది రోజుల విశ్రాంతి తర్వాత ఆయన అధికారిక కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం ఉన్నప్పటికీ, మునుపటిలా నిరంతరం ప్రజల్లో తిరగడం, సుదీర్ఘ ప్రయాణాలు చేయడం ప్రస్తుతానికి సాధ్యం కాకపోవచ్చన్న మాట. ఇక ఈ వార్త తెలిసిన వెంటనే మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ “పవనన్నా.. వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకోండి. నిత్యం రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమమే ఆశగా, శ్వాసగా పనిచేసే మీరు త్వరలో పూర్తి ఆరోగ్యవంతులై ప్రజాసేవకు పునరంకితం కావాలని కోరుకుంటున్నాను” అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు.
ఆరోగ్యంపై రాజకీయ నాయకుల స్పందన
కంప్లీట్ కావడానికి ఎలా సహకరిస్తుందో
ఇక సినిమాల విషయానికి వస్తే కమిట్ అయిన ‘OG’ (ఓజీ), ‘హరి హర వీరమల్లు’, మరియు ‘ఉస్తాద్ భగత్ సింగ్’లను పూర్తి చేసిన పవన్ ప్రస్తుతం సురేందర్ రెడ్డికి ఒకే చెప్పిన సంగతి తెలిసిందే. చూడాలి మరి పవన్ హెల్త్ ఈ సినిమా కంప్లీట్ కావడానికి ఎలా సహకరిస్తుందో. ఏదేమైనా డిప్యూటీ సియం గా బాధ్యతలు ఒకపక్క, మరోపక్క అభిమానుల్ని నమ్ముకొని కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్న మేకర్స్ మరోపక్క. మరి ఈ రెండింటినీ పవన్ కళ్యాణ్ ఎలా బ్యాలెన్స్ చేస్తారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న.
శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి @PawanKalyan గారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకోండి పవనన్న. నిత్యమూ రాష్ట్రాభివృద్ధి-ప్రజాసంక్షేమమే ఆశ, శ్వాసగా పనిచేసే మీరు త్వరలో పూర్తి ఆరోగ్యవంతులై ప్రజాసేవకు…
— Lokesh Nara (@naralokesh) April 18, 2026
సినిమాల భవితవ్యం ఏమిటి?
ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారికి శస్త్ర చికిత్స
ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శనివారం సాయంత్రం శస్త్రచికిత్స జరిగింది. శుక్రవారం ఉదయం తన అధికారులతో పాలనాపరమైన విషయాలపై చర్చిస్తున్న సందర్భంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొద్ది నెలలుగా…
— JanaSena Party (@JanaSenaParty) April 18, 2026
పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని మళ్ళీ తన కార్యక్రమాల్లో పాల్గొనాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.


