
📌 Key Points
- పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు.
- ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు.
- జైత్రా రామ్ మూవీస్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
- రాజకీయాలతో పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరం అవుతారనే ఊహాగానాలకు చెక్ పడింది.
పవన్ కళ్యాణ్ అభిమానులకు నూతన సంవత్సర కానుకగా అదిరిపోయే వార్త అందింది. ఆయన కొత్త సినిమాను అధికారికంగా ప్రకటించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మాణంలో ఈ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. పవన్ సినిమాలకు దూరమవుతారని వచ్చిన వార్తలకు ఇది చెక్ పెట్టింది.
పవన్ సినిమాలపై ఊహాగానాలకు తెర
Pawan Kalyan: టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఇటీవల కొత్త సినిమాలకు ఏమాత్రం కమిట్ అవ్వడం లేదు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఇక సినిమాలు చేయరేమోనని భావన అభిమానులలో ఉండేది. పవన్ కళ్యాణ్ సినిమాల గురించి తరచూ సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వచ్చిన ఏ విషయం గురించి అధికారిక ప్రకటన లేకపోవడంతో పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో అభిమానులు కూడా సందిగ్ధంలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో బిజీగా ఉండటమే కాకుండా ఉన్నత హోదాలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సినిమాలకు దూరం అవుతారని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమానే ఆఖరి సినిమా అవుతుందని అభిమానులు భావించారు కానీ కొత్త సంవత్సరం వేల పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్ తెలియజేశారు. ఈయన కొత్త సినిమాకు కమిట్ అవుతున్నట్లు ఈ సందర్భంగా చిత్ర బృందం వెల్లడించారు. పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు అంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వినపడుతూనే ఉన్నాయి. ఇక ఈ వార్తలను నిజం చేస్తూ చిత్ర బృందం తాజాగా అధికారికంగా వెల్లడించారు.
ఇలా పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా సురేందర్ రెడ్డి (Surender Reddy)దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రాన్ని జైత్రా రామ్ మూవీస్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మిస్తూ ఈ విషయాన్ని అధికారకంగా వెల్లడించారు. ఇక ఈ పోస్టుతో పాటు పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి అలాగే నిర్మాత కలిసి ఉన్న ఫోటోని షేర్ చేయడంతో ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని సమాచారం. ఏది ఏమైనా పవన్ సినిమాలకు దూరమవుతారు అంటూ వచ్చిన వార్తలకు చెక్ పెడుతూ కొత్త సినిమా ప్రకటించడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్
Producer Ram Talluri teamd up with Pawan Kalyan, Surender Reddy & Vakkantham Vamsi for a New Beginning #JaithraRamaMovies 🎥✨ #ProductionNo1 Loading ⏳ @PawanKalyan @DirSurender @VamsiVakkantham #PawanKalyan pic.twitter.com/em9SRX0ot6
— Thyview (@Thyview) January 1, 2026
రామ్ తాళ్లూరి నిర్మాణంలో భారీ చిత్రం
ఇక పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు, ఓజి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి వీరమల్లు కాస్త నిరాశపరిచిన ఓజి సినిమా మాత్రం పవన్ అభిమానుల ఆకలి తీర్చిందని చెప్పాలి. ఇక త్వరలోనే హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్(Ustad Bhagath Singh) విడుదల కానుంది. ఈ సినిమా మార్చి లేదా ఏప్రిల్ నెలలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మరోసారి పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. ఇందులో శ్రీ లీల, రాశిఖన్నా హీరోయిన్లుగా నటించారు. ఇదివరకే పవన్ కళ్యాణ్ హరీష్ డైరెక్షన్లో గబ్బర్ సింగ్ లాంటి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరోసారి వీరిద్దరి కాంబోలో ఈ సినిమా రాబోతున్న నేపథ్యంలో భారీగా అంచనాలు ఉన్నాయి.
మొత్తానికి, పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ప్రకటనతో అభిమానులలో ఉత్సాహం నిండింది. రాజకీయాలతో పాటు సినిమాలను కొనసాగిస్తానని ఆయన పరోక్షంగా స్పష్టం చేశారు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.


