
📌 Key Points
- పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూనే సినిమాలు చేస్తున్నారు.
- పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌ను తిరిగి ప్రారంభించినట్లు ప్రకటించారు.
- తన మార్షల్ ఆర్ట్స్ లో కొత్త ప్రయాణం గురించి, వీడియోల గురించి పవన్ సూచించారు.
- నిర్మాతగా పవన్ కళ్యాణ్ సినిమాలపై అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగాయి.
పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్నప్పటికీ, ఒక పోస్ట్‌తో సంచలనం సృష్టించారు. తన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌ను తిరిగి ప్రారంభించి, మార్షల్ ఆర్ట్స్ లో కొత్త ప్రయాణం గురించి ప్రకటించారు. ఇది అభిమానుల్లో భారీ అంచనాలను పెంచుతోంది.
పవన్ కళ్యాణ్ కొత్త అవతారం: డిప్యూటీ సీఎం నుంచి నిర్మాతగా!
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరో పక్క సినిమాలు తనకు కుదిరినప్పుడల్లా చేస్తున్నారు. OG తో వచ్చి పెద్ద హిట్ కొట్టిన పవన్ త్వరలో ఉస్తాద్ భగత్ సింగ్ తో రాబోతున్నారు. OG 2 కూడా అనౌన్స్ చేసారు. ఇటీవల న్యూ ఇయర్ కి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా అనౌన్స్ చేసారు.(Pawan Kalyan)
అయితే కొన్ని రోజుల క్రితం పవన్ హరిహర వీరమల్లు ప్రమోషన్స్ లో మీడియాతో మాట్లాడుతూ.. ఇకపై హీరోగా సినిమాలు చేస్తానో లేదో తెలీదు కానీ సినిమాల్లో మాత్రం ఉంటా. నిర్మాతగా సినిమాలు చేస్తాను అని ప్రకటించారు. గతంలో పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై సర్దార్ గబ్బర్ సింగ్, చల్ మోహన్ రంగ సినిమాలు నిర్మించారు.
క్రియేటివ్ వర్క్స్ రీలాంచ్: ఫ్యాన్స్ లో భారీ అంచనాలు
మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఆ సంస్థని బయటకు తీశారు. అధికారికంగా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ కొత్త సోషల్ మీడియా అకౌంట్స్ ని ప్రకటించారు పవన్ కళ్యాణ్. అంతే కాకుండా ఇటీవల OG సినిమా కోసం పవన్ తన మార్షల్ ఆర్ట్స్ ని బయటకు తీసిన సంగతి తెలిసిందే. ఆ మార్షల్ ఆర్ట్స్ లో కొత్త జర్నీ రానుంది అని ప్రకటించారు. దీంతో పవన్ మార్షల్ ఆర్ట్స్ కి సంబంధించి, దాని కోసం పవన్ పడిన కష్టాలు వీడియో రూపంలో త్వరలోనే రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.
మార్షల్ ఆర్ట్స్ జర్నీ: త్వరలో వీడియో రిలీజ్?
పవన్ కళ్యాణ్ అధికారికంగా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ గురించి, తన మార్షల్ ఆర్ట్స్ గురించి పోస్ట్ పెట్టడంతో పవన్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో త్వరలోనే పవన్ కళ్యాణ్ నుంచి నిర్మాతగా సినిమాలు వస్తాయని తెలుస్తుంది. మరి పవన్ నిర్మాణంలో ఏ హీరోలు సినిమాలు చేస్తారో చూడాలి.
పవన్ కళ్యాణ్ ప్రకటనలతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే నిర్మాతగా పవన్ కళ్యాణ్ నుండి మరిన్ని సినిమాలు, మార్షల్ ఆర్ట్స్ వీడియోలు రావడం ఖాయం. పవర్ స్టార్ భవిష్యత్ ప్రాజెక్టుల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


