|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: హైకోర్టు మెట్లెక్కిన పవన్ తనయుడు అకీరా నందన్! కారణం తెలిస్తే దిమ్మతిరగాల్సిందే!

Published: 24-01-2026, 7:35 AM
షాకింగ్: హైకోర్టు మెట్లెక్కిన పవన్ తనయుడు అకీరా నందన్! కారణం తెలిస్తే దిమ్మతిరగాల్సిందే!
  • పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ వ్యక్తిగత హక్కుల కోసం హైకోర్టును ఆశ్రయించడం సంచలనం!
  • AI టెక్నాలజీతో అకీరా నందన్ ఫోటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ దాఖలు.
  • తన అనుమతి లేకుండా AI కంటెంట్ క్రియేట్ చేయకుండా, తొలగించాలని కోర్టును కోరిన అకీరా నందన్.
  • అకీరా నందన్ ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకొని కొందరు ఆకతాయిలు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆందోళన.

టాలీవుడ్ లో ఇప్పుడు ఒక సంచలన వార్త వైరల్ అవుతోంది! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ హైకోర్టును ఆశ్రయించారు. అసలు ఎందుకు? ఏం జరిగింది? పూర్తి వివరాల్లోకి వెళ్దాం!

అకీరా నందన్ హైకోర్టుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది?

Akira Nandan: సోషల్ మీడియా, AI అందుబాటులోకి వచ్చాక మార్పింగ్ వీడియోలు ఎక్కువగా హల్చల్ చేస్తున్నాయి. ఏది నిజం ఏది అబద్దం అనేది కూడా తెలుసుకోనంతగా వాటిని క్రియేట్ చేస్తున్నారు కొంతంది ఆకతాయిలు. దాంతో, చాలా మంది సెలబ్రెటీలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. అందుకే, ఈ మధ్య కాలంలో తమ అనుమతి లేకుండా తమ ఫోటోలను, వీడియోలను వాడే అవకాశం లేకుండా కోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకుంటున్నారు.

AI వీడియోలతో అకీరాకు తలనొప్పి!

టాలీవుడ్, బాలీవుడ్ నుంచి ఇప్పటికే చాలా మంది స్టార్స్, ప్రముఖులు ఇలాంటి ఆర్డర్స్ తెచ్చుకున్నారు. తాజాగా ఈ లిస్టులో పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్(Akira Nandan) కూడా చేరాడు. పవన్ కళ్యాణ్ కొడుకుగా అకీరా నందన్ కి ఫాలోయింగ్ ఒక రేంజ్ లో పెరిగింది. దీంతో, అతని ఫోటోలను, వీడియోలను మార్పింగ్ చేస్తూ వీడియోలు చేస్తున్నారు. ఈమధ్య ఏకంగా ఆయన హీరోగా AIతో సినిమా కూడా తీశేశారు.

వ్యక్తిగత హక్కుల కోసం అకీరా పోరాటం!

దీంతో, అకీరా నందన్ ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించాడు. తన వ్యక్తిత్వ హక్కులను కాపాడాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. తనపై వచ్చిన ఏఐ కంటెంట్‌ను వెంటనే తొలగించాలని, భవిష్యత్తులో కూడా క్రియేట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని అకీరా కోరారు. అలాగే అలాంటి కంటెంట్ క్రియేటర్లపై నియంత్రణ చర్యలు తీసుకోవాలని కోరారు.

అకీరా నందన్ హైకోర్టును ఆశ్రయించడంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.