|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పవన్‌ బ్యాగ్‌ ప్యాక్‌ చేసుకో, బిగ్‌ బాస్‌ గేట్‌ ఓపెన్‌.. నాగార్జున వార్నింగ్‌, అల్లాడిపోయిన రీతూ

Published: 01-11-2025, 2:47 PM
పవన్‌ బ్యాగ్‌ ప్యాక్‌ చేసుకో, బిగ్‌ బాస్‌ గేట్‌ ఓపెన్‌.. నాగార్జున వార్నింగ్‌, అల్లాడిపోయిన రీతూ

బిగ్‌ బాస్ తెలుగు 9 శనివారం ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్ల ఆటతీరుపై నిప్పులు చెరిగారు. పవన్, సంజన, కళ్యాణ్‌లకు సీరియస్ వార్నింగ్‌లు ఇవ్వగా, సుమన్ శెట్టిని ప్రశంసించారు. రీతూ అల్లాడిపోయింది. ఈ వీకెండ్ ఎపిసోడ్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది.

Key Points

1

బిగ్‌ బాస్ తెలుగు వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున కంటెస్టెంట్ల ఆట తీరును సమీక్షించారు.

2

పవన్, సంజన, కళ్యాణ్‌లకు సీరియస్ వార్నింగ్‌లు జారీ చేశారు, వారి తప్పులను ఎత్తి చూపారు.

4

నాగార్జున వ్యాఖ్యలతో పవన్, రీతూలు అల్లాడిపోవడం ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది.

నాగార్జున వార్నింగ్‌లు: ఎవరికి?

బిగ్‌ బాస్‌ తెలుగు 9.. శనివారం ఎపిసోడ్‌ ఆద్యంతం రసవత్తరంగా సాగింది. వీకెండ్‌లో హోస్ట్ నాగార్జున వస్తారనే విషయం తెలిసిందే. వారం మొత్తం కంటెస్టెంట్లు చేసిన తప్పులను ప్రశ్నిస్తూ, సరి చేస్తుంటారు. బాగా ఆట ఆడిన వారిని అభినందిస్తుంటారు. ఈ క్రమంలో శనివారం ఎపిసోడ్‌లోనూ నాగార్జున అదే చేశారు. సంజనా, కళ్యాణ్‌, ఇమ్మాన్యుయెల్‌, దివ్య, భరణిలకు ఇచ్చిపడేశాడు. సుమన్‌ శెట్టిని అభినందించారు. రాము చేసిన కామెడీని చూపించి నవ్వులు పూయించారు. చివరికి డీమాన్‌ పవన్‌కి కాసేపు చెమటలు పట్టించారు.

శనివారం ఎపిసోడ్‌లో నాగార్జున మొదట సుమన్‌ శెట్టిని అభినందించారు. కెప్టెన్‌గా బాగా చేశావని, అదే సమయంలో గేమ్ కూడా బాగా ఆడుతున్నావని, ఆడియెన్స్ ని ఎంటర్‌టైన్‌ చేస్తున్నావని ప్రశంసించారు. ఆయనే కాదు, ఆడియెన్స్ కూడా సుమన్‌ పై ప్రశంసలు కురిపించారు. చాలా నిజాయితీగా ఉంటున్నాడని కామెంట్‌ చేశారు. కెప్టెన్‌ గా ఉన్నప్పుడు కూడా చాలా బాగా చేశాడని, ఎవరి వైపు ఉండకుండా నిజం ఏంటనేది చెప్పే ప్రయత్నం చేశారు. ఇలానే గేమ్‌ ఆడాలని తెలిపారు. దీనికి సుమన్‌ సంతోషించారు.

ఇక సంజనా, మాధురిల మధ్య గొడవలను ప్రస్తావించారు. సుమన్‌ శెట్టిని సంజనా అసమర్థ కెప్టెన్‌ అనే కామెంట్‌ చేసింది. మాధురి విషయంలో తాను రాంగ్‌గా మాట్లాడినట్టుగా సుమన్‌ చెప్పడంతో ఆయనపై ఫైర్‌ అయ్యింది. ఆ వీడియో చూపించి తప్పు ఎవరిది అని నాగ్‌ ప్రశ్నించగా, అందులో సంజనాదే తప్పు అని సుమన్‌ చెప్పారు. దీంతో సంజనా డబుల్ గేమ్‌ ఏంటనేది అర్థమైపోయింది. తప్పు చేసినందుకు ఆమె ఫోటోకి కత్తిపోటు పొడిచాడు నాగ్‌. అయితే తనని నామినేట్‌ చేయడంతో వాటిని తీసుకోలేకపోతున్నానని, అందుకే అలా మాట్లాడినట్టు తెలిపింది సంజనా. అదే తగ్గించుకోవాలని, కంట్రోల్‌ చేసుకోవాలని తెలిపారు నాగ్‌.

సుమన్ శెట్టికి ప్రశంసలు

రేషన్‌కి సంబంధించి ఏ వంట చేయాలనేది కళ్యాణ్‌ ఆర్డర్‌ వేసిన సమయంలో తనూజకి, కళ్యాణ్‌కి మధ్య గొడవ అయ్యింది. అది పీక్‌లోకి వెళ్లింది. ఈ విషయంలో తప్పు ఎవరిదనేది నిలదీశారు నాగ్‌. వీడియోలు చూపించడంతో కళ్యాణ్‌ దొరికిపోయాడు. ఎవరిపైన అలా ఆర్డర్‌ వేయకూడదని హెచ్చరించారు. ఇటీవల తన ఫ్రెండ్స్ వచ్చాక గేమ్‌ మార్చుకున్నావని, అందుకే ఇవన్నీ చేస్తున్నావని నాగార్జున తెలిపారు. వాటిని తగ్గించుకోవాలని, ఎవరికి ఎలా చెప్పాలో అలానే చెప్పాలి అని, కావాల్సిన ఫుడ్‌ని అడిగి చేయించుకోవాలిగానీ, ఆర్డర్‌ వేయకూడదని తెలిపారు. దీంతో కళ్యాణ్‌కి కత్తిపోటు పడింది.

థంబ్స్ అప్‌ టాస్క్ విషయంలో స్టాండ్‌ తీసుకోలేదనే టాపిక్‌లో భరణిని నిలదీశాడు నాగార్జున. అంతేకాదు సేఫ్‌ గేమ్‌ ఆడుతున్నావని తెలిపారు. ఇప్పటికే ఒకసారి ఎలిమినేట్‌ అయిన మళ్లీ హౌజ్‌లోకి వచ్చావని, అందుకోసం చాలా మంది సపోర్ట్ చేశారని, మళ్లీ ఇప్పుడు కూడా సేఫ్‌ గేమ్‌ ఆడి మళ్లీ వెళ్లిపోతావా? అంటూ హెచ్చరించారు. కెప్టెన్సీ టాస్క్ లోనూ స్టాండ్‌ తీసుకోలేకపోయావని, సేఫ్‌ గేమ్‌ ఆడినట్టు తెలిపారు నాగ్‌. ఆయనకు కొత్తిపోటు పొడిచాడు.

సంజనాకి మరో కత్తిపోటు పడింది. కిచెన్‌లో పప్పు విషయంలో తనూజతో గొడవ అవుతుంది. దానికి తనూజ వివరిస్తుంది. అయితే పప్పు వేసుకుంటే తప్పేంటని, తినే సమయంలో ఈ గొడవేంటి అంటూ ఫైర్‌ అయ్యింది సంజనా. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, తినే ప్లేట్‌ని విసిరింది. దీంతో అలా చేయడమేంటని ప్రశ్నించారు నాగ్‌. అది చాలా రూడ్‌గా వ్యవహరించడం అని, అలాంటి బిగ్‌ బాస్‌ హౌజ్‌లో చేయకూడదని హెచ్చరించారు. మరో కత్తిపోటు పొడిచాడు.

పవన్, రీతూలకు షాక్

ఫైనల్‌గా డీమాన్‌ పవన్‌.. రీతూ విషయంలో ప్రవర్తించిన తీరుని ప్రశ్నించారు. మొదట టాస్క్ లు బాగా ఆడుతున్నావని, నువ్వు ఎటు ఉంటే వాళ్లు విన్నర్ అని నాగార్జున తెలిపారు. కానీ అమ్మాయిలతో ప్రవర్తించే విషయంలో అదేంటని ప్రశ్నించారు. ఓ విషయంలో రీతూ, పవన్‌ మధ్య గొడవ జరుగుతుంది. దొబ్బేయ్‌ అని పవన్‌ అన్నాడు. దీనిపైనే ఆమె వాదిస్తుంది. వెళ్లిపో పవన్‌ అని చాలా సార్లు చెప్పినా విసిగిస్తూనే ఉన్నాడు. ఆమె వెళ్లబోతుంటే నెట్టేశాడు. దీన్ని నాగార్జున చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఇలాంటి ప్రవర్తనని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమని స్పష్టం చేశారు. బ్యాగ్‌ పాక్‌ చేసుకుని హౌజ్‌ నుంచి వెళ్లిపోమని ఆదేశించాడు నాగార్జున. సారీ చెప్పినా వినలేదు. గట్టిగా వార్నింగ్‌ ఇచ్చారు. కాసేపు హైడ్రామా నడిచింది. దీంతో రీతూ తల్లడిల్లిపోయింది. తన తప్పేం లేదని, తనతో ఉన్న చనువుతోనే అలా అన్నట్టుగా తెలిపారు. ఈ తీరు బిగ్‌ బాస్‌ షోకే అవమానం అని,  పవన్ చేత ఆడియెన్స్ అందరికి సారీ చెప్పించాడు, రీతూకి కూడా సారీ చెప్పించాడు నాగ్‌.

చివర్లో అదిరిపోయే కామెడీని చూపించాడు నాగార్జున. రాము హౌజ్‌లో ఎలా ప్రవర్తిస్తుంటాడు. ఏం చేస్తుంటాడో చూపించారు. ఇది ఆద్యంతం నవ్వులు పూయించింది. అలాగే శ్రీనివాస సాయి, గౌరవ్‌, నిఖిల్‌ హౌజ్‌లో ఉన్నారా లేరా అనేట్టుగా ఉంటున్నారని, గేమ్‌ ఆడాలని తెలిపారు. ఇలా ఉంటే కష్టమన్నారు నాగార్జున.  మొత్తంగా శనివారం ఎపిసోడ్‌లో ఇవి హైలైట్‌గా నిలిచాయని చెప్పొచ్చు.

మొత్తంగా, ఈ వీకెండ్ ఎపిసోడ్ బిగ్‌ బాస్ హౌస్‌లో ఉత్కంఠను మరింత పెంచింది. నాగార్జున కంటెస్టెంట్లకు స్పష్టమైన దిశానిర్దేశం చేసి, తప్పులను సరిదిద్దారు. రాబోయే వారంలో ఆట మరింత రసవత్తరంగా మారడం ఖాయం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.