|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రాజా సాబ్ రిలీజ్: ప్రభాస్ సినిమా కోసం పాయల్ కన్నీళ్లు! ఇంతకీ ఏం జరిగింది?

Published: 10-01-2026, 4:00 AM
రాజా సాబ్ రిలీజ్: ప్రభాస్ సినిమా కోసం పాయల్ కన్నీళ్లు! ఇంతకీ ఏం జరిగింది?
  • ప్రభాస్, మారుతి కాంబినేషన్లో వచ్చిన ‘ది రాజా సాబ్’ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది.
  • సినిమాపై కొందరు పాజిటివ్‌గా, మరికొందరు నెగెటివ్‌గా స్పందిస్తున్నారు.
  • పాయల్ రాజ్ పుత్ ‘రాజా సాబ్’ టీమ్‌కు విషెస్ తెలుపుతూ వీడియో షేర్ చేసింది.
  • ప్రభాస్ సినిమాలో అవకాశం కోసం పాయల్ కన్నీళ్లు పెట్టుకుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

ప్రభాస్, మారుతి కాంబినేషన్‌లో వచ్చిన ‘ది రాజా సాబ్’ సినిమా విడుదలపై పాయల్ రాజ్ పుత్ స్పందించారు. ఆమె ఎమోషనల్ వీడియోను షేర్ చేయగా, అది వైరల్ అవుతోంది. సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకోవడం చర్చనీయాంశంగా మారింది.

రాజా సాబ్ సినిమాకు మిక్స్‌డ్ టాక్

Payal Rajput: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas)మారుతి(Maruthi) దర్శకత్వంలో తాజాగా నటించిన చిత్రం ది రాజా సాబ్(The Raja Saab). ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో పలువురు ప్రభాస్ అభిమానులు సినిమా విషయంలో నిరాశ వ్యక్తం చేస్తూ డైరెక్టర్ మారుతి పై విమర్శలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక మరి కొంతమంది సినిమా సూపర్ హిట్ అని, ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కూడా మండిపడుతున్నారు.

ఇలా ప్రభాస్ లాంటి సూపర్ హీరోతో చేయాల్సిన సినిమా కాదంటూ ప్రభాస్ అభిమానులు వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో ఎన్నో రకాల పోస్టులు దర్శనం ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నటి పాయల్ రాజ్ పుత్(Payal Raj Puth) సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో భాగంగా ఈమె రాజా సాబ్ సినిమా కోసం కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్న ఒక వీడియోని షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది.

పాయల్ రాజ్ పుత్ ఎమోషనల్ వీడియో

పాయల్ రాజ్ పుత్ రాజా సాబ్ సినిమా గురించి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ.. “హాయ్ డార్లింగ్స్.. ది రాజా సాబ్ టీం మొత్తానికి ఆల్ ది బెస్ట్.. ఈ సినిమా ఇప్పటివరకు ఉన్న రికార్డులను బ్రేక్ చేయాలి.. ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికి అభినందనలు “అంటూ ఒక వీడియోని షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. ఈ వీడియో పై పలువురు విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఈసారి గట్టిగా అనుకోండి మీకు కూడా ప్రభాస్ సినిమాలో నటించే అవకాశం వస్తుంది.. ఇప్పుడే బాధపడకండి అంటూ ఈ పోస్ట్ పై కామెంట్లు చేస్తున్నారు.

ప్రభాస్ సినిమాలో ఛాన్స్ రాని నేపథ్యంలోనే కన్నీళ్లు పెట్టుకున్నారు అంటూ అభిమానులు విభిన్న శైలిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇక రాజా సాబ్ సినిమా హర్రర్ కామెడీ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ జోడిగా నిధి అగర్వాల్, రిద్ది కుమార్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. ఇలా ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేకపోవడంతో అభిమానులలో కూడా ఏదో తెలియని వెలితి ఉంది. ఇక ఈ సినిమా విడుదలైన అనంతరం చిత్ర బృందం ఇప్పటివరకు మీడియా ముందుకు రాలేదు త్వరలోనే చిత్ర బృందం మీడియా సమావేశంలో పాల్గొనబోతున్నారని తెలుస్తుంది.

నెటిజన్ల ఆసక్తికర కామెంట్స్

మొత్తానికి పాయల్ రాజ్ పుత్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజా సాబ్ సినిమా భవిష్యత్తు ఎలా ఉండబోతుందో వేచి చూడాలి. ఈ చిత్రం ప్రభాస్ అభిమానులను ఎంతవరకు అలరిస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.