|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పెద్ది: సంక్రాంతికి మెగా ఫ్యాన్స్ కు ఊహించని సర్ ప్రైజ్! ఆ సాంగ్ పై భారీ అంచనాలు

Published: 05-01-2026, 12:37 AM
పెద్ది: సంక్రాంతికి మెగా ఫ్యాన్స్ కు ఊహించని సర్ ప్రైజ్! ఆ సాంగ్ పై భారీ అంచనాలు
  • రామ్ చరణ్, జాన్వీ కపూర్ కాంబోలో ‘పెద్ది’ సినిమా మార్చి 27న విడుదల కానుంది.
  • ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సనా దర్శకత్వం, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
  • ‘చికిరి చికిరి’ పాట యూట్యూబ్‌లో ఒక నెలలోనే 100 మిలియన్ వ్యూస్ సాధించి సంచలనం సృష్టించింది.
  • సంక్రాంతికి రెండవ పాట విడుదల, రామ్ చరణ్ తో కలిసి జాన్వీ కపూర్ కూడా స్టెప్పులు వేయనుంది.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే ‘చికిరి చికిరి’ పాట రికార్డులు సృష్టించగా, ఇప్పుడు సంక్రాంతి కానుకగా రెండవ పాటను విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోంది. ఈ పాట మెగా ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ ఇవ్వనుంది.

పెద్ది: రామ్ చరణ్, జాన్వీ కపూర్ ల జోడి

Peddi Movie: గ్లోబల్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్న రామ్ చరణ్ (Ram Charan) తాజాగా ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సనా (Bucchibabu Sana)దర్శకత్వంలో ‘పెద్ది’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా మార్చ్ 27వ తేదీన రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi kapoor) హీరోయిన్గా నటిస్తోంది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ దాదాపు పూర్తి కావస్తోంది..అలా ఇటీవలే ఢిల్లీలో కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. స్పెషల్ సాంగ్ త్వరలోనే చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ పతాకం పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తూ ఉండగా.. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో భాగస్వామ్యలుగా ఉండడం ఈ సినిమాకు మరింత బలం చేకూర్చింది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్(AR Rahman) ఈ సినిమాకి సంగీతం అందిస్తుండగా.. శివ రాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన “చికిరి చికిరి” పాట యూట్యూబ్లో సెన్సేషన్ గా నిలిచింది. అయితే ఇప్పుడు సెకండ్ సింగిల్ పై అందరి దృష్టి పడిందనే చెప్పాలి. ఈ క్రమంలోనే తాజాగా సంక్రాంతి కానుకగా ఈ సినిమా నుండి రెండవ పాటను విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. వాస్తవానికి గత ఏడాది డిసెంబర్లోనే ఈ సినిమా నుండీ 2వ పాటను రిలీజ్ చేయాల్సి ఉండగా.. కొన్ని సినిమాల రిలీజ్ కారణంగా ఈ ఆలోచనను వాయిదా వేసుకున్నారు మేకర్స్. అయితే ఈసారి సంక్రాంతి సినిమాలు వస్తున్న నేపథ్యంలో అటు రామ్ చరణ్ అభిమానుల కోసం ఈ సినిమా నుండి రెండో పాటను మేకర్స్ రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.

బ్లాక్ బస్టర్ ‘చికిరి చికిరి’ పాట

ఈ పాట పక్కా మాస్ స్టైల్ లో ఉంటుందని, రామ్ చరణ్ ఎనర్జీకి తగ్గట్టుగా దాదాపు 500 మంది గ్రూప్ డాన్సర్లతో రామ్ చరణ్ కలిసి స్టెప్పులు వేయనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ పాటలో రామ్ చరణ్ తో పాటు జాన్వీకపూర్ కూడా పాదం కలపనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఒక పాటతో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన బుచ్చిబాబు సనా ఈ రెండో పాటతో మరింత రికార్డులు క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నారు.

సంక్రాంతి ట్రీట్: రెండవ సాంగ్ పై అంచనాలు

ఇదిలా ఉండగా.. ఈ చికిరి పాట విడుదలైన ఒక నెలలోనే తెలుగు వెర్షన్ ఏకంగా 100 మిలియన్ వ్యూస్ దక్కించుకోవడం సంచలనం గా మారింది. ఇక ఐదు భాషల్లో విడుదలైన ఈ పాట అన్ని వెర్షన్లలో కలిపితే 150 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ఇక ఈ నేపథ్యంలోనే రెండో పాటపై అభిమానులలో అంచనాలు పెరిగిపోయాయి. ఇకపోతే పాటలతోనే సినిమాపై అంచనాలు పెంచాలని చూస్తున్న బుచ్చిబాబు సన ఈ సినిమా నుండి టీజర్లు, గ్లింప్స్ ఎప్పుడు విడుదల చేస్తారని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంక్రాంతికి విడుదల కానున్న ‘పెద్ది’ రెండవ పాట మెగా ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపుతోంది. రామ్ చరణ్ ఎనర్జిటిక్ స్టెప్పులతో, జాన్వీ కపూర్ తో కలిసి చేసే ఈ పాట సినిమాపై అంచనాలను మరింత పెంచడం ఖాయం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.