|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పెద్ది సినిమా కథ లీక్: పూలచొక్కా నవీన్ ఆరోపణలు, రామ్ చరణ్ మూవీకి కొత్త తలనొప్పి!

Published: 22-12-2025, 1:04 AM
పెద్ది సినిమా కథ లీక్: పూలచొక్కా నవీన్ ఆరోపణలు, రామ్ చరణ్ మూవీకి కొత్త తలనొప్పి!
  • మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా కథ లీక్ వివాదం.
  • పూలచొక్కా నవీన్ బయటపెట్టినట్టు చెబుతున్న ‘పెద్ది’ కథ వివరాలు.
  • 90వ దశకం నేపథ్యం, క్రికెటర్ పాత్రలో చరణ్, తండ్రిని రక్షించే కథ.
  • లీకులపై ఇండస్ట్రీ ఆగ్రహం, సినిమాపై నెగటివ్ టాక్ ప్రభావం.

రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా విడుదల కాకముందే భారీ వివాదంలో చిక్కుకుంది. పూలచొక్కా నవీన్ ఆ సినిమా కథను లీక్ చేశాడని సోషల్ మీడియాలో కథలు వైరల్ అవుతున్నాయి. ఈ లీకుల వల్ల సినిమాపై నెగటివ్ టాక్ రావడంతో చిత్ర యూనిట్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

పూలచొక్కా నవీన్ లీక్ చేసిన పెద్ది కథ ఇదేనా?

Peddi:ఒకప్పుడు ఇండస్ట్రీకి ఫైరసీ అనేది పెద్ద భూతంలా ఉండేది. దానిని ఇప్పుడిప్పుడే ప్రభుత్వం నిర్ములించడానికి ప్రయత్నిస్తుంది.  అయితే ఇప్పుడు దానికి మించిన మరో భూతం ఇండస్ట్రీని పట్టిపీడించడానికి రెడీ అవుతుంది. అదే లీకులు. ఒక సినిమా రిలీజ్ కాకముందే ఆ సినిమా లీకులు గురించి చెప్తూ.. అది హిట్ అవుతుందా..  లేదా అని కొందరు రివ్యూయర్లు సోషల్ మీడియాలో చర్చలు పెడుతున్నారు.  కోట్లు ఖర్చుపెట్టి తీసిన సినిమా గురించి నెగిటివ్ టాక్ వచ్చేలా చేస్తున్నారు. ఇక ఇదంతా ఇప్పుడు ఎందుకు అంటే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.  వచ్చే ఏడాది మార్చి 27 న పెద్ది సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే పెద్ది చిత్రం నుంచి రిలీజైన చికిరి చికిరి సాంగ్ ఏ రేంజ్ లో సెన్సేషన్ సృష్టిస్తుందో అందరికీ తెల్సిందే. అంతా పాజిటివ్ టాక్ ఉన్న సమయంలో కొందరు రివ్యూయర్లు  సినిమాల గురించి మాట్లాడుతూ ఉండగా పూల చొక్కా నవీన్ పెద్ది గురించి మాట్లాడాడు. ఆ సినిమా స్టోరీ తనకు తెలుసు అని, అసలు ఇలాంటి లైన్ తో సినిమా తీసి ఎలా హిట్ కొడతాడని అనుకున్నాడో ఏమో అని చెప్పుకొచ్చాడు. దీంతో పెద్ది సినిమాపై ఒక నెగిటివ్ టాక్ క్రియేట్ అయ్యింది. పూలచొక్కా నవీన్ పై ఇండస్ట్రీ మొత్తం ఫైర్ అయ్యింది. ఇలాంటివారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.

పెద్ది సినిమా లీకైన అసలు కథాంశం

ఇక పూలచొక్కా చెప్పిన పెద్ది కథ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఒక కథ వైరల్ అవుతుంది. పెద్ది సినిమా 90 వ దశకంలో జరుగుతుంది. హీరో.. క్రికెటర్ గా కనిపిస్తాడు. అతని తండ్రి కొన్ని కారణాల వలన జైలుకు వెళ్తాడు. అతడు అమాయకత్వాన్ని అడ్డుపెట్టుకొని కొందరు వారి తప్పును అతనిపై వేసి మరణశిక్ష పడేలా చేస్తారు. ఎలాగైనా తండ్రిని కాపాడుకోవాలని కొడుకు ఎన్నో ప్రయత్నాలు చేసి చేసి చివరకు రాష్ట్రపతి వద్దకు వెళ్లి క్షమాభిక్ష కోరడానికి ఢిల్లీ వెళ్తాడు. హీరోను ఢిల్లీ వెళ్లకుండా విలన్స్ అడ్డుపడతారు. వారిని దాటుకొని హీరో.. తన తండ్రిని కాపాడుకున్నాడా.. ? లేదా.. ? అనేదే పెద్ది కథ అని చెప్పుకొస్తున్నారు.

లీకులపై పరిశ్రమ ఆగ్రహం, సినిమాపై ప్రభావం

కథ ప్రకారం చూస్తే ఇప్పటికే ఈ లైన్ తో చాలా సినిమాలు వచ్చాయి. అవ్వడానికి లైన్ చిన్నదే అయినా కూడా బుచ్చి  ఎలా తెరకెక్కించాడు అనేది ముఖ్యం. చరణ్ అగ్రెసివ్ లుక్, జాన్వీ అందాలు, ఎమోషన్స్ అన్ని సమపాళ్లలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి నెగిటివ్ టాక్ ను నమ్మకుండా సినిమాను సినిమాలా చూస్తే కచ్చితంగా పెద్ది అందరికి నచ్చుతుందని చరణ్ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

పెద్ది కథ లీకులపై పరిశ్రమ ఆగ్రహంగా ఉంది. లీకైన కథ సాధారణంగా అనిపించినా, బుచ్చిబాబు దర్శకత్వం, రామ్ చరణ్ నటన కీలకం. ఈ నెగటివ్ టాక్‌ను నమ్మకుండా సినిమాను థియేటర్లలో చూడాలని చిత్ర బృందం కోరుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.