
📌 Key Points
- పీఎన్జీ ఉన్నవారికి ఎల్‍పీజీ కనెక్షన్ రద్దు చేస్తూ కేంద్రం గెజిట్ విడుదల చేసింది.
- పైపుడ్ గ్యాస్ ఉన్నవారు ఎల్‍పీజీ కనెక్షన్ సరెండర్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
- కొత్తగా పీఎన్‍జీ కనెక్షన్ ఉన్న ఇళ్లకు ఎల్‍పీజీ కనెక్షన్లు ఇవ్వడం నిలిపివేసింది.
- ఒక్కరోజులో దేశవ్యాప్తంగా 24 లక్షల ఎల్పీజీ సిలిండర్లను డెలివరీ చేసినట్లు కేంద్రం తెలిపింది.
దేశంలో గ్యాస్ కొరత ఏర్పడిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పీఎన్‍జీ కనెక్షన్ ఉన్నవారికి ఎల్‍పీజీ గ్యాస్ కనెక్షన్ రద్దు చేస్తూ గెజిట్ విడుదల చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పీఎన్‍జీ ఉన్నవారికి ఎల్‍పీజీ రద్దు – కేంద్రం గెజిట్
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరాలో ఏర్పడిన అంతరాయం భారత్‍లో ఎల్‍పీజీ గ్యాస్ సిలిండర్ల కొరతకు దారి తీసింది. గ్యాస్ సిలిండర్లకు భారీగా డిమాండ్ పెరగడంతో అక్రమార్కులు దీనిని బ్లాక్ మార్కెట్ దందాకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పైపుడ్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్ కలిగి ఉన్నవారకి డొమెస్టిక్ ఎల్‍పీజీ రద్దు చేసింది. పీఎన్జీ కలిగి ఉండి అదే సమయంలో డొమెస్టిక్ ఎల్‌పీజీ (LPG) కనెక్షన్ ఉన్నవారు ఇకపై ఎల్‌పీజీ కనెక్షన్‌ను ఉంచుకోవడానికి వీల్లేదని ఈ మేరకు తాజాగా కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ కీలక మార్పులు చేస్తూ అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పైప్డ్ గ్యాస్ ఉన్న వారు వెంటనే తమ ఎల్‍పీజీ కనెక్షన్లు సరెండర్ చేయాలని ఆదేశించింది. పీఎన్డీ కనెక్షన్ ఉన్న ఇళ్లకు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు కొత్తగా ఎల్‍పీజీ కనెక్షన్లు ఇవ్వడం కానీ సరఫరా చేయడం కానీ నిషేధించింది.
ఎల్‍పీజీ కనెక్షన్లపై ప్రభుత్వ ఆదేశాలు
నిన్న ఒక్క రోజే 24 లక్షల సిలిండర్లు డెలివరీ:
యుద్ధ పరిస్థితుల్లో గ్యాస్ సిలిండర్ల పంపిణీ
యుద్ధం కారణంగా దేశంలో గ్యాస్ విషయంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున గ్యాస్ సిలిండర్ల బుకింగ్స్ పెరిగాయాయి. ఈ క్రమంలో నిన్న (శనివారం) ఒక్కరొజే దేశవ్యాప్తంగా 24 లక్షల ఎల్పీజీ సిలిండర్లు డెలివరీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఇందులో ఇండియన్ గ్యాస్ 93,826, హెచ్‍పీ 79,974, భారత్ గ్యాస్ కు సంబంధించి 68,571 మొత్తం 2,42,371 సిలిండర్లు డెలివరీ చేయబడ్డాయని చమురు సంస్థలు వెల్లడించాయి.
పీఎన్‍జీ కనెక్షన్ ఉన్నవారికి ఎల్‍పీజీ కనెక్షన్ రద్దు నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య గ్యాస్ సరఫరా వ్యవస్థను క్రమబద్ధీకరించడానికి ఉద్దేశించబడింది. దీనిపై ప్రజల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.


