|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఆహా ఓటీటీలో ‘పోచమ్మ’ విధ్వంసం! అంబటి అర్జున్ విశ్వరూపం! రికార్డులు బద్దలు!

Published: 16-04-2026, 11:35 PM
ఆహా ఓటీటీలో 'పోచమ్మ' విధ్వంసం! అంబటి అర్జున్ విశ్వరూపం! రికార్డులు బద్దలు!
  • పోచమ్మ వెబ్ సిరీస్‌లో అంబటి అర్జున్, అచ్యుత్ కుమార్, పూజా రెడ్డి, స్నేహల్ కీలక పాత్రలు పోషించారు.
  • ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ ఫాంటసీ థ్రిల్లర్ సిరీస్‌కు రమేష్ ఇందిరా దర్శకత్వం వహించారు.
  • ఈ సిరీస్‌లో పోచమ్మ దేవత గుడి చుట్టూ జరిగే మిస్టరీ కథాంశం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది.
  • ట్విస్ట్ లు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ వెబ్ సిరీస్‌ రాయలసీమ రామన్న చౌదరి సినిమాను గుర్తు చేస్తుంది.

ఆహా ఓటీటీలో విడుదలైన ‘పోచమ్మ’ వెబ్ సిరీస్ సంచలనం సృష్టిస్తోంది. అంబటి అర్జున్, అచ్యుత్ కుమార్ నటించిన ఈ థ్రిల్లర్ మిమ్మల్ని ఉర్రూతలూగిస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం!

పోచమ్మ వెబ్ సిరీస్: కథాంశం

అంబటి అర్జున్, అచ్యూత్‌ కుమార్‌, పూజా రెడ్డి, స్నేహాల్‌, రమేష్‌ ఇందిరా ప్రధాన పాత్రధారులుగా `పోచమ్మ` వెబ్‌ సిరీస్‌ రూపొందింది. దీనికి రమేష్‌ ఇందిరా దర్శకుడు కావడం విశేషం. ఆహా నిర్మించింది. ఫాంటసీ థ్రిల్లర్‌ గా రూపొందిన ఈ సిరీస్‌ నేటి నుంచి( ఈ నెల 17) నుంచి `ఆహా`లో స్ట్రీమింగ్‌ అవుతుంది. `ఆహా` గోల్డ్ లో అన్ని ఎపిసోడ్లని ఒకేసారి చూడొచ్చు. మరి సిరీస్‌ ఎలా ఉంది? అంబటి అర్జున్‌కి హిట్‌ని ఇచ్చిందా? రమేష్‌ ఇందిరా దర్శకుడిగా మెప్పించారా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

ఫారెస్ట్ లోని ఒక ఊర్లో పోచమ్మ ఎస్టేట్‌లో స్పెషల్‌గా నిర్మించిన గెస్ట్ హౌజ్‌ రంగనాథ్‌(అచ్యుత్‌ కుమార్‌) కుటుంబానిది. అయితే ఆయన వ్యాపారంలో నష్టపోయి ఆ ఎస్టేట్‌ని అమ్ముకోవాల్సి వస్తుంది. దాన్ని వ్యాపారవేత్త (రమేష్‌ ఇందిరా) కొనుక్కుంటాడు. ఆయన తన ఫ్యామిలీతో కలిసి ఆ ఎస్టేట్‌కి వెళ్తారు. ఆయనకు పెద్ద కూతురు ఇవానా(పూజారెడ్డి), అల్లుడు డానియల్‌(అర్జున్‌ అంబటి), చిన్న కూతురు జెస్సీ(స్నేహాల్‌) తో కలిసి ఉంటారు. రంగనాథ్‌ అదే ఇంటికి మెనేజర్‌గా పనిచేస్తుంటాడు. ఆయన భార్య, కుమారుడు, కూతురు కూడా అందులోనే పనిచేస్తుంటారు. ఆ ఎస్టేట్‌ కాఫీ తోటల్లో చాలా మంది పనిచేస్తుంటారు. ఆ ఇంటి వద్ద పోచమ్మ విగ్రహం ఉంటుంది. ఆ పోచమ్మనే తమ గ్రామాన్ని కాపాడుతుందని, ఆ ఊరి వాళ్ల నమ్మకం. అయితే ఆ ఎస్టేట్‌ యజమాని క్రిస్టియన్‌, దీంతో ఆ పోచమ్మ విగ్రహాన్ని తీసేయిస్తాడు. ఆ తర్వాత ఇంట్లో వరుసగా అపశకునాలు జరుగుతుంటాయి. చిన్న కూతురు జెస్సీ ఇంటిపైనుంచి పడి చనిపోతుంది. ఇంట్లోకి పాము వస్తుంది.  ఆయన భార్య విచిత్రంగా ప్రవర్తిస్తుంటుంది. పెద్ద కూతురు ఇవానా పోతురాజు మాస్క్ తో ఒక వ్యక్తిని చూసి భయపడుతుంది. ఇవన్నీ ఆ పోచమ్మ విగ్రహాన్ని తీసేయడం వల్లే జరిగాయని అంతా నమ్ముతారు. మరి ఆ యజమాని ఫ్యామిలీ దాన్ని వదిలేసిందా? ఆ ఎస్టేట్‌పై ఎవరి కన్ను ఉంది? డానియల్‌లోని మరో కోణం ఏంటి? ఈ ఎస్టేట్‌ కోసం రంగనాథ్‌ ఫ్యామిలీ ఆడిన గేమ్‌ ఏంటనేది మిగిలిన కథ.

ఊరు దేవతల నేపథ్యంలో థ్రిల్లర్‌ కథాంశాలతో ఇటీవల చాలా సినిమాలు వస్తున్నాయి. ఆ కోవకు చెందిన మూవీనే `పోచమ్మ`. పోచమ్మ దేవత గుడి చుట్టూ, ఆ ఎస్టేట్‌ చుట్టూ ఈ సిరీస్‌ కథ సాగుతుంది. చూడ్డానికి `రాయలసీమ రామన్న చౌదరి`ని పోలి ఉంటుంది. కాకపోతే ఆద్యంతం ట్విస్ట్ లు, టర్న్‌లతో సాగుతుంది. థ్రిల్లింగ్‌ ఎలిమెంట్లు ఆకట్టుకుంటున్నాయి. ప్రారంభంలో సిరీస్‌ పోచమ్మ దేవత గొప్పతనం చెబుతూ సాగుతుంది. ఆ తర్వాత అచ్యూత్‌ కుమార్‌ ఫ్యామిలీ తన ఎస్టేట్‌ని కోల్పోవడం, ఆ తర్వాత దాన్ని రమేష్‌ ఇందిరా ఫ్యామిలీ దక్కించుకుని ఆ ఇంటికి రావడంతో కథ ప్రారంభమవుతుంది. వచ్చి రావడంతో పోచమ్మ విగ్రహాన్ని తొలగించిన తర్వాత చోటు చేసుకునే సంఘటనలు ఉత్కంఠభరితంగా సాగుతాయి. రమేష్‌ ఇందిరా చిన్న కూతురు మేనేజర్‌ కొడుకుతో ప్రేమలో పడటం, దాన్ని అక్క వ్యతిరేకించడం, ఆ అమ్మాయి చెప్పేది ఎవరూ పట్టించుకోకపోవడంతో మానసికంగా ఇబ్బంది పడుతుంది. ఆ తర్వాత అక్క బర్త్ డే పార్టీలో ఆమె మేడమీద నుంచి కింద పడిచనిపోతుంది. దీంతో పోచమ్మ వల్లే ఇది జరిగిందని అంతా నమ్ముతారు. వరుసగా ఇలాంటి అనుమానాస్పద సంఘటనలు చోటు చేసుకుంటాయి. భయానికి గురి చేస్తుంటాయి. అంతా మేనేజర్‌ కొడుకే చేశాడని నమ్ముతారు. పోలీసులు కూడా అదే కోణంలో ఇన్వెస్టిగేషన్‌ చేస్తుంటారు. మరోవైపు అంబటి అర్జున్‌ కి సంబంధించిన షాకింగ్‌ విషయాలు తెలుస్తాయి. దీంతో కథ మొత్తం మరోవైపు టర్న్ తీసుకుంటుంది. మరింత ఉత్కంఠగా సాగుతుంది.

నటీనటుల అద్భుత నటన

ఒక్కో ఎపిసోడ్‌ ఆద్యంతం రక్తికట్టించేలా సాగుతుంది. ఎస్టేట్‌ యజమాని రెండో కూతురుకి ప్రమాదం జరిగిన తర్వాత నుంచి కథ స్పీడందుకుంటుంది. ఒక్కో ట్విస్ట్ రివీల్‌ అవుతుంటాయి. చివర్లో మరో అదిరిపోయే ట్విస్ట్ ఉంటుంది. దాన్ని రివీల్‌ చేసిన తీరు, కథ వెనక్కి వెళ్లిన తీరు వాహ్‌ అనిపిస్తుంది. ఎండింగ్‌ మాత్రం ఊహించని విధంగా ఉంటుంది. అయితే వెబ్‌ సిరీస్‌లు అంటే స్లోగా సాగుతాయి, లెన్తీగా ఉంటాయి. ఇది కూడా స్లోగానే సాగుతుంది. కానీ ఎపిసోడ్లు షార్ట్ గా ఉండటం విశేషం. కథ ఊహించినట్టుగానే సాగుతుంది. ట్విస్ట్ లు కొన్ని అంతగా పేల లేదు. ఆశించినట్టుగా ఉంటాయి. చాలా వరకు రొటీన్‌గానే ఉంటుంది. కొన్ని సీన్లు లాజిక్‌ లెస్‌గా ఉంటాయి.

ఎస్టేట్‌ యజమానిగా రమేష్‌ ఇందిరా చాలా బాగా నటించారు. ఆయన హీరోలా కనిపిస్తారు. ఎస్టేట్‌ మేనేజర్‌గా అచ్యుత్‌ కుమార్‌ ఇరగదీశాడు. ఆయన పాత్రలోని ట్విస్ట్ వాహ్‌ అనిపించేలా ఉంటుంది. డానియల్‌గా అంబటి అర్జున్‌ ఉన్నంత సేపు బాగా నటించాడు. ఆయన పాత్రని అర్థాంతరంగా ముగించారు. పెద్దగా ప్రయారిటీ లేదు. ఇక ఇవానాగా పూజా రెడ్డి బాగా చేసింది. అలాగే జెస్సీగా స్నేహాల్‌ నటన కూడా ఆకట్టుకుంటుంది. అచ్యూత్‌ భార్యగా కృషి శెట్టి అదరగొట్టింది.  రమేష్‌ ఇందిరా భార్యగా ప్రియా శతమర్షన్‌ నటన కూడా ఆకట్టుకుంటుంది. అచ్యూత్‌ కుమార్‌ కొడుకుగా వివేక్‌ సిన్హా పాత్రలోని ట్విస్ట్ లు కూడా అలరిస్తాయి.

ఆహా ఓటీటీలో థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్

టెక్నీకల్‌గా సిరీస్‌ బాగుంది. చాలా స్ట్రాంగ్‌గా ఉంది. మ్యూజిక్‌ హైలైట్‌గా నిలుస్తుంది. ముఖ్యంగా బీజీఎం పెద్ద సినిమా రేంజ్‌లో ఉంది. ట్విస్ట్ ల సమయంలో వచ్చే ఆర్‌ఆర్‌ ఆకట్టుకుంది. విజువల్‌గానూ కొత్తగా ఉంది. కనువిందు చేసేలా ఉంది. ఎడిటింగ్‌ పరంగా కొంత వర్క్ చేయాలి. అయితే ఉన్నంతలో చాలా నీట్ గా ఉంది. నిర్మాణ విలువలకు కొదవలేదు. దర్శకుడు రమేష్‌ ఇందిరా ఈ సిరీస్‌ని చాలా బాగా తెరకెక్కించారు. షార్ట్ అండ్‌ స్వీట్‌గా రూపొందించారు. ఆడియెన్స్ కి మంచి థ్రిల్ ఫీలింగ్‌ని ఇచ్చారని చెప్పొచ్చు.

పోచమ్మ దేవత చుట్టూ తిరిగే ఈ సిరీస్‌ థ్రిల్ ఇవ్వడంతో సక్సెస్‌ అయ్యిందని చెప్పొచ్చు. షార్ట్ అండ్‌ స్వీట్‌ సిరీస్‌.

పోచమ్మ వెబ్ సిరీస్ ప్రస్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ సిరీస్‌పై మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.