
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో జానపద గాయకుడు రాము రాథోడ్ యొక్క ఎంట్రీ సంచలనం. ‘రాను బొంబాయికి రాను’ పాటతో అతను సాధించిన విజయం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అతని పేద కుటుంబ నేపథ్యం మరియు అతని కష్టపడి పనిచేసే తత్వం గురించి ఈ కథనం వివరిస్తుంది.
Key Points
పేద కుటుంబం నుండి వచ్చిన రాము రాథోడ్ యూట్యూబ్‌లో సెన్సేషన్.
'రాను బొంబాయికి రాను' పాట 516 మిలియన్ల వ్యూస్ సాధించింది.
నాగార్జున కూడా రాము రాథోడ్ ప్రతిభకు ఆశ్చర్యపోయాడు.
కోవిడ్ సమయంలో తన కెరీర్‌ను ప్రారంభించి విజయం సాధించాడు.
రాము రాథోడ్ యొక్క అద్భుతమైన విజయం
కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లాంచ్ ఎపిసోడ్ గ్రాండ్ గా జరిగింది. హౌస్ లోకి జానపద గాయకుడు రాము రాథోడ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ కుర్రాడు యూట్యూబ్ లో ఫోక్ ఇండస్ట్రీని దున్నేస్తున్నాడు. రాను బొంబాయికి రాను అనే సాంగ్ యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తోంది. అతడు పాడుతున్న పాటలు ఎవ్వరి అంచనాలకు అందకుండా వందల మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంటున్నాయి.
‘రాను బొంబాయికి రాను’ పాట యొక్క ప్రభావం
రాము రాథోడ్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఒకసారి పరిశీలిస్తే.. అతడు తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లా గోపాలపూర్ అనే తాండాలో పేద కుటుంబంలో జన్మించాడు. రాము రాథోడ్ తన తల్లిదండ్రులకు ఐదవ సంతానం. చిన్నప్పటి నుంచి పాటలు, జానపద కళలపై రాము రాథోడ్ కి మక్కువ ఎక్కువ. పాటలు పాడడం అంటే చాలా ఇష్టం. పాటలు పాడే అలవాటుని సీరియస్ గా తీసుకుని కోవిడ్ టైం లో గట్టిగా ఫోకస్ చేశాడు. అప్పటి నుంచి రాము రాథోడ్ సెలెబ్రిటీగా మారిపోయారు.
నాగార్జున ప్రశంసలు మరియు ఆశ్చర్యం
నాగార్జున రాము రాథోడ్ గురించి మాట్లాడుతూ.. అతడి పాట మిస్ వరల్డ్ వేదికపైకి కూడా వినిపించింది అని ప్రశంసలు కురిపించారు. రాను బొంబాయికి రాను అనే సాంగ్ ఎన్ని వ్యూస్ సాధించింది అని నాగార్జున అడగగా.. 516 మిలియన్ల అని సింపుల్ గా ఆన్సర్ ఇచ్చారు. అంత సంచలనం సృష్టించి ఇంత సింపుల్ గా చెబుతావేంటి అని నాగార్జున కూడా ఆశ్చర్యపోయారు. పెద్ద పెద్ద సినిమా పాటలు కూడా ఆ రేంజ్ వ్యూస్ దక్కించుకోలేవు అని నాగార్జున అన్నారు. రాను బొంబాయికి రాను అనే సాంగ్ తో పాటు సొమ్మసిల్లి పోతున్నవే ఓ చిన్న రాములమ్మ అనే సాంగ్ కూడా వందల మిలియన్ల సాధించింది.
రాము రాథోడ్ యొక్క విజయం ప్రతిభావంతులకు స్ఫూర్తినిచ్చేది. తన కష్టపడి పనిచేసి, కోవిడ్ సమయంలోనూ అతను సాధించిన విజయం అభినందనీయం.


