|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బిర్యానీ కోసం తండ్రి ఆరాటం! కదిలిస్తున్న వీడియో వైరల్! కంటతడి పెట్టిస్తున్న దృశ్యం!

Published: 18-04-2026, 6:05 AM
బిర్యానీ కోసం తండ్రి ఆరాటం! కదిలిస్తున్న వీడియో వైరల్! కంటతడి పెట్టిస్తున్న దృశ్యం!
  • పేద తండ్రి కొడుకు బిర్యానీ తినాలనే కోరికను నెరవేర్చిన వీడియో వైరల్.
  • నారాయణ్ సర్కార్ తన జీవితంలోని విషయాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
  • డిస్కౌంట్లో బిర్యానీ కొని కుటుంబంతో ఆనందంగా తిన్న తండ్రి.
  • కళ్ళలో తృప్తి నిండిన తండ్రిని చూసి నెటిజన్లు భావోద్వేగానికి గురయ్యారు.

ప్రస్తుత కాలంలో బిర్యానీ అనేది సాధారణ ఆహారంగా మారింది. అయితే పేద కుటుంబాలకు ఇది ఒక కల. అలాంటి ఒక పేద తండ్రి తన కొడుకు కోరిక మేరకు బిర్యానీ తీసుకురావడంతో ఆ కుటుంబం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

బిర్యానీ కోసం పేద కుటుంబం ఆరాటం

ప్రస్తుత రోజుల్లో బిర్యానీ (Biryani) అనేది చాలా మందికి సాధారణ ఆహారంగా మారిపోయింది. ఏ చిన్న పండగ వచ్చిన బిర్యానీ చేసుకోవడం అలవాటుగా మారుతోంది. ఇదంతా ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకునే వారికి బిర్యానీ కొనుగోలు చేసుకోనే స్తోమత ఉండవచ్చు. కానీ దిగువ మధ్యతరగతి కుటుంబాలకు, పేద కుటుంబాలకు మాత్రం బిర్యానీ తినడం అనేది ఇప్పటికీ ఓ కల. అటువంటి ఒక పేద కుటుంబంలో ఓ కొడుకు బిర్యానీ కల ఎట్టకేలకు సాకారమైంది. తన తండ్రి ఓ బిర్యానీ తీసుకురాగా ఆ తండ్రి కొడుకులు కలిసి తింటున్న ఆ హార్ట్ టచ్చింగ్ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

నారాయణ్ సర్కార్ అనే వ్యక్తి తన దైనందిన జీవితంలోని విశేషాలను సోషల్ మీడియాలో పంచుకుంటుంటారు. తన కొడుకు ఎప్పటి నుంచో బిర్యానీ కావాలని అడుగుతున్నా, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ తండ్రి ఆ కోరికను తీర్చలేకపోయారు. కానీ, తాజాగా బిర్యానీపై డిస్కౌంట్ రావడంతో.. మూడు ప్యాకెట్లు కొని తన కుటుంబంతో కలిసి ఆనందంగా ఆరగించారు. తన కొడుకు ఆత్రంగా బిర్యానీ తింటుంటే, ఆ తండ్రి కళ్లలో కనిపించిన తృప్తి, ముఖం మాటల్లో వర్ణించలేము. ఈ వీడియోను నారాయణ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా లక్షలాది మంది వీక్షకులు కదిలిపోయారు. ఒక చిన్న బిర్యానీ ప్యాకెట్ కోసం పేద కుటుంబాలు పడే ఆరాటం, కన్నబిడ్డ కోరిక తీర్చినప్పుడు తండ్రి పొందే ఆనందం ఈ వీడియోలో ప్రతిబింబిస్తున్నాయని ఇలాంటి చిన్న చిన్న సంతోషాలు ఆ కుటుంబంలో మరిన్ని కలగాలి అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

కొడుకు కోరిక తీర్చిన తండ్రి

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

పేద కుటుంబంలో ఒక చిన్న బిర్యానీ సంతోషాన్ని నింపింది. కన్నబిడ్డల కోరికలు తీర్చడంలో తల్లిదండ్రులు పడే ఆరాటం ఎంతో గొప్పది. ఇలాంటి వీడియోలు మానవత్వాన్ని గుర్తు చేస్తాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.