
📌 Key Points
- ప్రభాస్ కి నాగార్జున నటించిన గీతాంజలి సినిమా అంటే చాలా ఇష్టం.
- యువి క్రియేషన్స్ బ్యానర్ లో సంతోష్ శోభన్ నటించిన కపుల్ ఫ్రెండ్లీ సినిమాను ప్రభాస్ ప్రశంసించారు.
- ప్రభాస్ ప్రస్తుతం ఫౌజీ, స్పిరిట్ సినిమాల షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.
- గీతాంజలి సినిమా చూసినప్పుడు కలిగిన భావనే కపుల్ ఫ్రెండ్లీ చూసినప్పుడు కలిగిందని ప్రభాస్ అన్నారు.
ప్రభాస్ తన ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమా గురించి రీసెంట్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. నాగార్జున నటించిన గీతాంజలి సినిమా అంటే ఆయనకు చాలా ఇష్టమని తెలిపారు. అంతేకాకుండా కపుల్ ఫ్రెండ్లీ సినిమాపై కూడా ప్రశంసలు కురిపించారు.
ప్రభాస్ ఫేవరెట్ మూవీ ఏది?
Prabhas: ప్రభాస్ కృష్ణంరాజు వారసుడిగా ఈశ్వర్ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యారు. ఇలా మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న ప్రభాస్ (Prabhas) ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ప్రస్తుతం ఈయన ఫౌజీ , స్పిరిట్ సినిమాల షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇకపోతే తాజాగా ప్రభాస్ యు వి క్రియేషన్ బ్యానర్ లో సంతోష్ శోభన్(Santosh Sobhan) హీరోగా నటించిన కపుల్ ఫ్రెండ్లీ(Couple Friendly) చిత్ర బృందంతో చిట్ చాట్ చేశారు.
తాజాగా ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన పూర్తి వీడియో విడుదల చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియోలో భాగంగా ప్రభాస్ సినిమాల గురించి మాట్లాడుతూ ఎన్నో విషయాలు తెలియజేశారు. ఇక కపుల్ ఫ్రెండ్లీ సినిమా ప్రేమ కథ సినిమా కావడంతో ప్రేమ గురించి ప్రభాస్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ప్రభాస్ తనకు ఎంతో ఇష్టమైన సినిమాల గురించి కూడా మాట్లాడారు.
కపుల్ ఫ్రెండ్లీ సినిమాపై ప్రభాస్ ప్రశంసలు
తనకు నాగార్జున నటించిన గీతాంజలి సినిమా చాలా ఇష్టమని ఆ సినిమా ఆల్ టైం ఫేవరెట్ మూవీ అంటూ ప్రభాస్ తెలియచేయడంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి. తాను మణిరత్నం గారికి పెద్ద ఫ్యాన్ అని, గీతాంజలి సినిమా చాలా సూపర్ గా ఉంటుందని ఆ సినిమా చూసినప్పుడు ఏదో తెలియని భావన కలుగుతుందని తెలిపారు. ఇలా గీతాంజలి సినిమా తర్వాత కపుల్ ఫ్రెండ్లీ సినిమా చూసిన అదే భావన కలిగిందని తెలిపారు. కపుల్ ఫ్రెండ్లీ సినిమా చాలా అద్భుతమైన సినిమా, ఈ సినిమా నుంచి బయటపడటానికి నాకు చాలా సమయం పట్టిందని ప్రభాస్ తెలిపారు.
పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ప్రభాస్…
గీతాంజలి సినిమా గురించి ప్రభాస్ ఏమన్నారంటే?
ఇలా కపుల్ ఫ్రెండ్లీ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూనే తనకు గీతాంజలి సినిమా అంటే చాలా ఇష్టం అనే విషయాన్ని ఈయన తెలియచేయడంతో అక్కినేని అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక నాగార్జున గిరిజ హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన గీతాంజలి సినిమా ఎవర్గ్రీన్ క్లాసికల్ సినిమా అనే చెప్పాలి. ఇప్పటికి ఈ సినిమాకు ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. ఇలాంటి కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీ సినిమా ప్రభాస్ ని కూడా ఆకట్టుకుందనే విషయం తెలిసిన అక్కినేని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రభాస్ ప్రస్తుతం ఫౌజీ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు .ఈ సినిమాతో పాటు మరోవైపు సందీప్ రెడ్డి డైరెక్షన్ లో స్పిరిట్ సినిమా పనులను కూడా కొనసాగిస్తున్నారు.
ప్రభాస్ గీతాంజలి సినిమాను ఎంతగానో అభిమానిస్తారని చెప్పడం అక్కినేని అభిమానులకు ఆనందాన్ని కలిగించింది. ఆయన ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు.


