|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రభాస్-హను రాఘవపూడి మూవీ టైటిల్ ఇదే.. అదిరిపోయిన లుక్.. ఒంటరిగా పోరాడే బెటాలియన్

Published: 23-10-2025, 2:58 AM
ప్రభాస్-హను రాఘవపూడి మూవీ టైటిల్ ఇదే.. అదిరిపోయిన లుక్.. ఒంటరిగా పోరాడే బెటాలియన్

ప్రభాస్ అభిమానుల ఎదురుచూపులకు తెరపడింది. ప్రభాస్-హను రాఘవపూడి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా టైటిల్‌ను మేకర్స్ ప్రకటించారు. డార్లింగ్ పుట్టినరోజు సందర్భంగా ‘ఫౌజీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ పాన్ ఇండియా చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.

Key Points

1

ప్రభాస్-హను రాఘవపూడి సినిమా టైటిల్ 'ఫౌజీ'గా ఖరారు.

2

ప్రభాస్ పుట్టినరోజు (అక్టోబర్ 23) సందర్భంగా టైటిల్ ప్రకటించారు.

4

పోస్టర్‌పై "పాండవపక్షే సంస్థిత కర్ణః" శ్లోకంతో స్టోరీ హింట్.

“ఫౌజీ” టైటిల్ అనౌన్స్మెంట్

ప్రచారమే నిజమైంది. ప్రభాస్-హను రాఘవపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా టైటిల్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. ఫౌజీ పేరునే టైటిల్ గా పెట్టారు. ఇవాళ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ప్రకటించారు.

ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రోజు వచ్చింది. ప్రభాస్- హను రాఘవపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీ టైటిల్ ను ఇవాళ అనౌన్స్ చేశారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ కు ‘ఫౌజీ’ అనే టైటిల్ పెట్టారు. ప్రచారంలోనే ఉన్న పేరునే ఫిక్స్ చేశారు. ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు. ఇవాళ (అక్టోబర్ 23) ప్రభాస్ బర్త్ డే సందర్భంగా టైటిల్ ప్రకటించారు.

ప్రభాస్ బర్త్ డే కానుక

పాండవపక్షే సంస్థిత కర్ణః ।

పాన్ ఇండియా స్థాయిలో సినిమా విశేషాలు

అనే శ్లోకంతో టైటిల్ పోస్టర్ షేర్ చేశారు మేకర్స్. అంటే పద్మ వ్యూహాన్ని జయించిన అర్జునుడు, పాండవుల పక్షాన నిలిచిన కర్ణుడు, గురువు లేని ఏకలవ్యుడు అనే అర్థం వస్తుంది. మన చరిత్రలో దాగిన ధైర్యవంతుడైన సైనికుడి కథ ఇది అని పోస్టులో పేర్కొన్నారు.

‘ఫౌజీ’ టైటిల్, పోస్టర్ ప్రభాస్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఒక ఒంటరి సైనికుడి కథగా రూపొందుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.