
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాల అప్డేట్స్ వచ్చాయి. ఈ క్రమంలో హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ చేయనున్న కొత్త సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు ‘ఫౌజీ’ అని పేరు పెట్టారు. ఇది అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది.
Key Points
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్-హను రాఘవపూడి కాంబోలో వస్తున్న సినిమా టైటిల్ 'ఫౌజీ'గా ఖరారైంది.
ఈ యాక్షన్ థ్రిల్లర్ ఓ ధైర్యవంతుడైన సైనికుడి కథను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతోంది.
పోస్టర్‌లో ప్రభాస్ పవర్‌ఫుల్ లుక్‌లో కనిపిస్తూ 'ఎ బెటాలియన్ హూ ఫైట్స్ ఎలోన్' అని క్యాప్షన్ ఇచ్చారు.
ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున రూపొందుతోంది.
ప్రభాస్ ‘ఫౌజీ’ టైటిల్ ఖరారు!
దిశ, వెబ్ డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా నేడు ఆయన నటిస్తున్న సినిమాల నుండి అప్డేట్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్ హను రాఘవపూడి కాంబోలో వస్తున్న సినిమా నుండి కీలక అప్డేట్ వచ్చింది. వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా టైటిల్ అనౌన్స్ చేశారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ పేరు ఫౌజీగా ప్రకటించారు. చాలా కాలం నుండి ఫౌజీనే టైటిల్ అని ప్రచారం జరుగుతుండగా చిత్రయూనిట్ దాన్నే ఫైనల్ చేసింది. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా పాన్ ఇండియా లెవల్ లో దీనిని తెరకెక్కిస్తున్నారు.
యాక్షన్ థ్రిల్లర్ కథాంశం
పోస్టర్ లో ప్రభాస్ పవర్ ఫుల్ లుక్ లో కనిపిస్తున్నాడు. అంతే కాకుండా ఎ బెటాలియన్ హూ ఫైట్స్ ఎలోన్ అంటూ పోస్టర్ కు క్యాప్షన్ ఇచ్చారు. అంతేకాకుండా పోస్టులో పద్మవ్యూహాన్ని జయించిన పద్మవ్యూహ విజయీ పార్థః అనే సంస్కృత శ్లోకాన్ని పేర్కొన్నారు. శ్లోకం అర్థం.. పద్మవ్యూహాన్ని జయించిన అర్జునుడు, పాండవుల పక్షాన నిలిచిన కర్ణుడు, గురువు లేని ఏక లవ్యుడు అని అర్థం వస్తుంది. దీంతో పాటు మన చరిత్రలో దాగిన ధైర్యవంతుడైన సైనికుడి కథ ఇది అని పోస్టులో పేర్కొన్నారు. దీంతో ఈ సినిమా ఓ సైనికుడి కథ అని అర్థం అవుతుంది.
పోస్టర్‌లో ప్రభాస్ పవర్‌ఫుల్ లుక్
గీతా ఆర్ట్స్‌తో ప్రభాస్ నెక్స్ట్.. బర్త్ డే సందర్భంగా స్పెషల్ వీడియో రిలీజ్!
‘ఫౌజీ’ టైటిల్, పోస్టర్ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. ఓ సైనికుడి కథతో వస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను అలరించడం ఖాయం. ప్రభాస్ అభిమానులకు ఇది గొప్ప బహుమతి.


