
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించే ‘ఫౌజీ’ చిత్రం షూటింగ్‌లో ఆయన తీవ్రంగా గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. కాలికి ఫ్రాక్చర్ అయినట్లు పుకార్లు వినిపిస్తుండగా, అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
Key Points
ప్రభాస్ ‘ఫౌజీ’ సినిమా షూటింగ్‌లో గాయపడ్డారని వార్తలు
కాలికి ఫ్రాక్చర్ అయిందని పుకార్లు
ఇటలీలో చికిత్స తర్వాత కూడా షూటింగ్‌లో పాల్గొంటున్నారట
అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు
‘ఫౌజీ’ షూటింగ్‌లో ప్రమాదం
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) చేతిలో భారీ బడ్జెట్ చిత్రాలున్నాయి. బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్‌లో పాల్గొంటూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. అయితే డార్లింగ్ నటిస్తున్న సినిమాలో ‘ఫౌజీ’ కూడా ఒకటి. హను రాఘవపూడి(Hanu Raghavapudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి టైటిల్ ఫిక్స్ చేయనప్పటికీ ‘ఫౌజీ’ (Fauji) పేరుతో రాబోతున్నట్లు అంతా ఫిక్స్ అయిపోయారు. అయితే ఇందులో కొత్త బ్యూటీ ఇమాన్వి(Imanvi) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ప్రభాస్ మాత్రం ఒక మిలటరీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు టాక్.
కాలికి గాయం, ఫ్రాక్చర్ పుకార్లు
దీనిని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేనీ, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకోగా.. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కానీ మూవీ మేకర్స్ మాత్రం అప్డేట్స్ విడుదల చేయలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా, ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌లో పలు సీన్స్ చేస్తుండగా.. తీవ్ర గాయం అయినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. కాలికి ఫ్రాక్చర్ జరిగిందని పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే ఇంతకు ముందే ఆయన కాలికి గాయం అవడంతో సర్జరీ కూడా చేయించుకున్నారు.
అభిమానుల ఆందోళన
ఇటీవల మళ్లీ ఒకసారి టెస్టులు చేయించుకోవడానికి ఇటలీకి వెళ్లి వచ్చారు. ఇక ఇప్పుడు మరో కాలికి గాయం కావడంతో అయినప్పటికీ విశ్రాంతి తీసుకోకుండా షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు టాక్. అయితే గాయం ఉన్న కాలికి జరిగిందా లేక మరో కాలికి ఫ్రాక్చర్ అయిందా అనేది తెలియాల్సి ఉంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ.. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అంతా కంగారు పడిపోతున్నారు.
ప్రభాస్ ఆరోగ్యం గురించి అధికారిక ప్రకటన రావడం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. త్వరగా కోలుకోవాలని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.


