|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Prabhas: నేడు కన్నప్ప గ్రాండ్ రిలీజ్.. నెట్టింట వైరలవుతోన్న ప్రభాస్ పోస్ట్

Published: 26-06-2025, 11:22 PM
Prabhas: నేడు కన్నప్ప గ్రాండ్ రిలీజ్.. నెట్టింట వైరలవుతోన్న ప్రభాస్ పోస్ట్

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కన్నప్ప సినిమా నేడు విడుదలవుతోంది. ప్రభాస్, మోహన్ లాల్, విష్ణు మంచు తదితరులు నటించిన ఈ చిత్రంపై అంచనాలు అధికంగా ఉన్నాయి. ప్రభాస్ తన సంతోషాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు.

Key Points

1

నేడు థియేటర్లలో 'కన్నప్ప' గ్రాండ్ రిలీజ్.

2

ప్రభాస్ సోషల్ మీడియాలో తన ఆనందాన్ని పంచుకున్నారు.

4

పోస్టర్లు నెటిజన్లను ఆకట్టుకున్నాయి, భారీ అంచనాలున్నాయి.

కన్నప్ప సినిమా గ్రాండ్ రిలీజ్

నెటిజన్లు అంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోన్న మూవీల్లో కన్నప్ప ఒకటి. ఈ మూవీపై సినీ లవర్స్ భారీ అంచనాలు పెంచేసుకున్నారు. ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై డాక్టర్‌ మోహన్‌బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహించారు. అలాగే మోహన్ లాల్, విష్ణు మంచు, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ప్రభాస్ సోషల్ మీడియా పోస్ట్

ఈ మూవీలో మోహన్ బాబు మనవరాళ్లైన అరియానా, వివియానా శ్రీ కాళహస్తి పురాణాన్ని వివరించడానికి తమ గాత్రాలు అందించారు. వీరు ఇద్దరూ కన్నప్ప సినిమా ద్వారానే తమ గాత్రాలతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే ఈ సంతోషంలో మోహన్ బాబు ఈ విషయంపై గర్వపడుతున్నానని, వారిద్దరూ ఈ పురాణాన్ని వివరించడం సంతోషంగా ఉందని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్న విషయం తెలిసిందే.

మోహన్ బాబు మనవరాళ్ల గాత్రదానం

ఇక ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు నెటిజన్లను ఆకట్టుకోవడమే కాకుండా… సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఆగస్టు 18 2023 లో ప్రారంభించిన కన్నప్ప నేడు థియేటర్లలో గ్రాండ్ విడుదల అవ్వనుంది. కాగా ఈ సందర్భంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సోషల్ మీడియా వేదికన తన సంతోషాన్ని పంచుకున్నారు. ‘‘కన్నప్ప పెద్ద తెరపైకి వస్తున్నాడు. తన ప్రాణం కంటే ఎక్కువ ఇచ్చిన వ్యక్తి ఇతిహాస కథ ఇది. కన్నప్ప ఇప్పుడు దైవిక శరణాగతి సాక్షిగా నటిస్తున్నాడు’’. అంటూ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాసుకొచ్చారు.

ప్రభాస్ అభిమానులకు ‘కన్నప్ప’ సినిమా ఒక గొప్ప వినోదాన్ని అందిస్తుందని ఆశిద్దాం. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాలని కోరుకుందాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.