|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: మారుతికి మరో ఛాన్స్ ఇచ్చిన ప్రభాస్.. ఫ్యాన్స్ కి దిమ్మతిరిగే న్యూస్!

Published: 30-01-2026, 9:05 AM
షాకింగ్: మారుతికి మరో ఛాన్స్ ఇచ్చిన ప్రభాస్.. ఫ్యాన్స్ కి దిమ్మతిరిగే న్యూస్!
  • మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ‘ది రాజాసాబ్’ మూవీ భారీ డిజాస్టర్!
  • సంక్రాంతికి విడుదలైన ఈ సినిమాను దారుణంగా తిరస్కరించిన ప్రేక్షకులు, ఫ్యాన్స్
  • హోంబాలే ఫిలింస్ నిర్మాణంలో మారుతితో ప్రభాస్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్!
  • రాజాసాబ్ సినిమా విడుదల కాకముందే ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తీసుకున్న ఒక సంచలన నిర్ణయం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది. రాజాసాబ్ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ, మారుతికి మరో అవకాశం ఇవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

రాజాసాబ్ ప్లాప్.. మారుతిపై ట్రోలింగ్!

Prabhas: ది రాజాసాబ్ సినిమాతో భారీ ప్లాప్ ను తన ఖాతాలో వేసుకున్నాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమాను ఆడియన్స్ దారుణంగా రిజెక్ట్ చేశారు. కనీసం ప్రభాస్ ఫ్యాన్స్ ని కూడా మెప్పించలేకపోయింది ఈ సినిమా. నిజానికి మాస్ చిత్రాల మూస నుంచి బయటకు వచ్చి దర్శకుడు మారుతీ మీద ఉన్న నమ్మకంతో చాలా జెన్యూన్ గా రాజాసాబ్ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు ప్రభాస్(Prabhas).

అది కూడా కెరీర్ పీక్ టైంలో. కానీ, రొటీన్ కథ, కథనాలతో ఆడియన్స్ సహనానికి పరీక్ష పెట్టాడు మారుతీ. అందుకే, రాజసాబ్ సినిమా విడుదల తరువాత దర్శకుడు మారుతీ పై దారుణమైన ట్రోలింగ్ జరిగింది. ప్రభాస్ 3 ఇయర్స్ టైం వేస్ట్ చేశావంటూ మారుతీని ఒక ఆట ఆడేసుకున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. వింటేజ్ ప్రభాస్ ని ప్రెజెంట్ చేస్తావని నమ్మకం పెట్టుకున్నందుకు దెబ్బేశావ్ అంటూ ట్రోల్ చేశారు. ఇంకా ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉందని అనౌన్స్ చేశారు మేకర్స్.

ప్రభాస్ మరో సంచలన నిర్ణయం!

ఆ విషయంలో కూడా చాలా కోపంగా ఉన్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అయితే, ఇంకా రాజసాబ్ సినిమా షాక్ నుంచి కోలుకోకముందే ప్రభాస్ తన ఫ్యాన్స్ కి మరో షాక్ ఇవ్వడానికి సిద్ధం అయ్యాడట. అదేంటంటే. దర్శకుడు మారుతీతో మరో సినిమా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అవును, అది కూడా రాజాసాబ్ సినిమా విడుదల కాకముందే. ఈ సినిమాను ప్రభాస్ తో సలార్ సినిమా చేసిన ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబాలే ఫిలింస్ నిర్మించనున్నారట.

హోంబాలే ఫిలిమ్స్ నిర్మాణంలో సినిమా!

త్వరలోనే ఈ భారీ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రానుంది అని తెలుస్తోంది. ఇక ఈ న్యూస్ తెలిసిన ప్రభాస్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇక రాజాసాబ్ నుంచి కోలుకోకముందే మళ్ళీ షాక్ ఇస్తున్నావ్ ప్రభాస్ అన్నా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మళ్ళీ ఆ దర్శకుడితో సినిమా అవసరమా అన్నా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రభాస్, మారుతి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై మీ అభిప్రాయాలను తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.