
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరియు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రావణం సినిమా తెరకెక్కనుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమా గురించి కొన్ని గాసిప్స్ వినిపించాయి. ఈ నేపథ్యంలో దిల్ రాజు స్పందించారు.
Key Points
ప్రభాస్-ప్రశాంత్ నీల్ 'రావణం' సినిమా ఖచ్చితంగా తెరకెక్కనుంది.
ప్రశాంత్ నీల్ ప్రస్తుతం 'సలార్ 2' మరియు ఎన్టీఆర్ సినిమాతో బిజీగా ఉన్నారు.
'రావణం' పెద్ద బడ్జెట్ సినిమా కావడం వల్ల కొంత సమయం పడుతుంది.
దిల్ రాజు గారు ఈ సినిమా గురించి పూర్తి స్పష్టత ఇచ్చారు.
‘రావణం’ సినిమా గురించి గాసిప్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabahs) ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. ఇక అప్పట్లో ప్రభాస్- ప్రశాంత్ నీల్(Prashanth Neel) కాంబినేషన్‌లో రావణం అనే మూవీ తెరకెక్కుతోందని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమా డైరెక్టర్, హీరో మారిపోయారని కొన్ని గాసిప్స్ వినిపించాయి. ఈ నేపథ్యంలో తాజాగా నిర్మాత దిల్‌రాజు(Dil Raju) ఈ పుకార్ల పై స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ‘రావణం సినిమా పక్కా ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లోనే ఉంటుంది.
ప్రస్తుతం ఆయన రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘సలార్ పార్ట్-2’(Salar-2) అలాగే ఎన్టీఆర్(NTR) గారితో చేసే యాక్షన్ ఎంటర్‌టైనర్. ఈ రెండు పూర్తయిన వెంటనే, రావణం సెట్స్ పైకి వస్తుంది. ఇది పెద్ద బడ్జెట్, భారీ కథా నేపథ్యం కలిగిన సినిమా. అందుకే కొంత టైమ్ పడుతుంది. కానీ ప్రభాస్‌తోనే, ప్రశాంత్ నీల్‌తోనే ఈ ప్రాజెక్ట్ ముందుకు పోతుంది’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతోంది. Link
దిల్ రాజు స్పందన
సినిమా భవిష్యత్తు
చివరగా, దిల్ రాజు గారి స్పష్టతతో ‘రావణం’ సినిమాపై ఉన్న అనుమానాలు తొలగిపోయాయి. ప్రభాస్ మరియు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.


