|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ అరాచకం: షర్ట్ లెస్ అవతార్‌తో ఫ్యాన్స్‌కి పిచ్చెక్కిస్తున్న వంగా!

Published: 31-12-2025, 9:15 PM
ప్రభాస్ 'స్పిరిట్' ఫస్ట్ లుక్ అరాచకం: షర్ట్ లెస్ అవతార్‌తో ఫ్యాన్స్‌కి పిచ్చెక్కిస్తున్న వంగా!
  • ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్‌లో షర్ట్ లేకుండా, గాయాలతో కనిపించి సంచలనం సృష్టించారు.
  • హీరోయిన్ దిమ్రీ తృప్తితో కలిసి సిగరేట్ వెలిగిస్తున్న దృశ్యం అభిమానులను ఆకట్టుకుంటోంది.
  • 2026 న్యూ ఇయర్ సందర్భంగా సందీప్ రెడ్డి వంగా ఈ ప్రత్యేకమైన లుక్‌ని విడుదల చేశారు.
  • ప్రభాస్ IPS ఆఫీసర్‌గా, ప్రకాష్ రాజ్ జైలు సూపరిండెంట్‌గా కీలక పాత్రల్లో నటించనున్నారు.

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ విడుదలయ్యింది. షర్ట్ లేకుండా, గాయాలతో ఉన్న ప్రభాస్ లుక్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. హీరోయిన్ దిమ్రీ తృప్తితో రొమాంటిక్ పోజ్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచింది. వంగా మార్క్ మరోసారి కనిపించింది.

ప్రభాస్ షాకింగ్ ‘స్పిరిట్’ లుక్ వివరాలు

ప్రభాస్‌ త్వరలో `ది రాజాసాబ్‌` చిత్రంతో రాబోతున్నారు. దీంతోపాటు హను రాఘవపూడి దర్శకత్వంలో `ఫౌజీ` చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో `స్పిరిట్‌` మూవీని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ మధ్య ప్రభాస్‌ పుట్టిన రోజు సందర్బంగా ఒక ఆడియో టీజర్‌ని కూడా విడుదల చేశారు. ఇది సినిమాపై అంచనాలు పెంచింది. ఇందులో ప్రభాస్‌ పాత్ర ఎలా ఉండబోతుందో తెలిపారు. ఇక ఇప్పుడు కొత్త ఏడాది సందర్భంగా మూవీ నుంచి ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు.

2026 న్యూ ఇయర్‌ స్పెషల్‌గా అర్థరాత్రి అరాచకానికి తెరలేపారు దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా. `స్పిరిట్‌` మూవీ ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ప్రభాస్‌, హీరోయిన్‌ డిమ్రీ తృప్తి కలిసి ఉన్న ఫోటోని విడుదల చేశారు. ఇందులో ప్రభాస్‌ షర్ట్ లేకుండా, గాయాలతో ఉన్నారు. వాటికి ఫస్ట్ ఎయిడ్‌ చేసినట్టుగా ఉంది. హీరోయిన్‌ డిమ్రీ.. రొమాంటిక్‌గా, చీరకట్టులో ఉంది. ప్రభాస్‌ సిగరేట్‌ తాగుతుండగా, లైటర్‌తో సిగరేట్‌ అంటిస్తుంది డిమ్రీ. ప్రభాస్‌ బ్యాక్‌ నుంచి సైడ్‌లో సిగరేట్‌ తాగుతున్నట్టుగా ఉన్న లుక్‌ మైండ్‌ బ్లోయింగ్‌ అని చెప్పొచ్చు.

వంగా మార్క్: అంచనాలు పెంచుతున్న ఫస్ట్ లుక్

`స్పిరిట్‌`లోని ప్రభాస్‌ లుక్‌ సరికొత్తగా ఉంది. గెడ్డంతో ఉన్నాడు. వెనకాల జుట్టు పెద్దగా ఉంది. చూడబోతుంటే `యానిమల్‌` హీరోని తలపిస్తున్నాడు ప్రభాస్‌. మరి ఆ మూవీకి, దీనికి ఏదైనా సంబంధం ఉందా? అనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా విడుదల చేసిన `స్పిరిట్‌` ఫస్ట్ లుక్‌ ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తోంది. జస్ట్ లుక్‌తోనే సినిమాపై అంచనాలను అమాంతం పెంచారు సందీప్‌ రెడ్డి వంగా. ఆయన ఈ ఫస్ట్ లుక్‌ని ట్విట్టర్ ద్వారా పంచుకుంటూ, `భారతీయ సినిమా, మీ అజానుబాహుడిని చూడండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు 2026, స్పిరిట్‌ ఫస్ట్ లుక్‌` అని తెలిపారు. ఇది ప్రభాస్‌ అభిమానులను, నెటిజన్లని ఆద్యంతం కట్టిపడేస్తుంది. లుక్‌ ట్రెండ్‌ అవుతుంది.

ఇక ప్రభాస్‌ హీరోగా, డిమ్రీ తృప్తి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రకాష్‌ రాజ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రభాస్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌గా నటిస్తుండగా, ప్రకాష్‌ రాజ్‌ జైలు సూపరిండెంట్‌గా నటిస్తున్నట్టు ఆ మధ్య విడుదల చేసిన ఆడియో టీజర్‌లో అర్థమయ్యింది. ఇందులో జైలుకి ప్రభాస్‌ రాగా, ప్రకాష్‌ రాజ్‌ మాట్లాడుతూ, వీడి గురించి విన్నాను. యూనిఫాం ఉన్నా లేకపోయినా బిహేవియర్‌లో తేడా ఉండదు. చూద్దాం ఈ ఖైదీ యూనిఫాంలో ఎలా ఉంటాడో. వీడిని బట్టలూడదీసి మెడికల్‌ టెస్ట్ కి పంపించండి` అని ప్రకాష్‌ రాజ్‌ చెప్పగా, చివర్లో ప్రభాస్‌ `మిస్టర్‌ సూపరిండెంట్‌, నాకు చిన్నప్పట్నుంచి ఒక బ్యాడ్‌ హ్యాబిట్‌ ఉంది` అనే డైలాగ్‌ ఈ ఆడియో టీజర్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇప్పుడు దాన్ని మించేలా ఈ ఫస్ట్ లుక్‌ ఉండటం విశేషం.

‘స్పిరిట్’ కథ, ప్రభాస్ పాత్రపై ఆసక్తి

ఈ సినిమా వచ్చే ఏడాది ఆడియెన్స్ ముందుకు రానుందని సమాచారం. ఈ చిత్రాన్ని టీ సిరీస్‌, భద్రకాళి పిక్చర్స్ ప్రొడక్షన్స్ పతాకాలపై భూషణ్‌ కుమార్‌, ప్రణయ్‌ రెడ్డి వంగా, కృష్ణకుమార్‌, ప్రభాకర్‌ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, చైనా, జపాన్‌, కొరియా వంటి భాషల్లో ఈ మూవీని విడుదల చేయబోతున్నారు. ఇంటర్నేషనల్‌ రేంజ్‌లో దీన్ని రూపొందిస్తున్నారు సందీప్‌ రెడ్డి వంగా. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నేపథ్యంలో సినిమా సాగుతుందని సమాచారం.

మొత్తం మీద, ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ సినిమాపై భారీ హైప్‌ను సృష్టించింది. ప్రభాస్ సరికొత్త అవతార్, వంగా విజన్ సినిమాకు మరింత ప్లస్ అయ్యాయి. ఈ చిత్రం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.