|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రభాస్ ‘స్పిరిట్’ లీక్డ్ లుక్: ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తున్న కొత్త అవతార్!

Published: 03-06-2026, 3:45 PM
ప్రభాస్ 'స్పిరిట్' లీక్డ్ లుక్: ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తున్న కొత్త అవతార్!
  • ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ నుండి లీకైన సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్.
  • సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
  • ప్రభాస్ తన కెరీర్‌లోనే మొదటిసారిగా పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు.
  • తృప్తి డిమ్రి హీరోయిన్‌గా, వివేక్ ఒబెరాయ్ విలన్‌గా నటిస్తున్నట్లు సమాచారం.

గ్లోబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’ సినిమా లొకేషన్ నుండి ఒక సెల్ఫీ లీక్ అయి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సెల్ఫీలో ప్రభాస్ స్టైలిష్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.

‘స్పిరిట్’ లొకేషన్ నుండి లీకైన సెల్ఫీ

Spirit Update: ‘స్పిరిట్’…గ్లోబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా కోసం వరల్డ్ వైడ్ గా ఉన్న మూవీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ‘బాహుబలి’ సిరీస్ తర్వాత ప్రభాస్ రేంజ్ ఇంటర్ నేషనల్ రేంజ్ కి వెళ్ళడం, ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ చిత్రాలతో ట్రెండ్ సెట్ చేసిన సందీప్ వంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించి తాజాగా ఒక క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. షూటింగ్ లొకేషన్ నుండి ప్రభాస్ హెయిర్ స్టైలిస్ట్‌తో కలిసి దిగిన ఒక సెల్ఫీ ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఇందులో ప్రభాస్ స్టైలిష్ గాగుల్స్ ధరించి, క్లాస్ అండ్ మాస్ ఎలిమెంట్స్ కలగలిసిన సరికొత్త హెయిర్ స్టైల్‌తో లీక్ అయిన ఈ లుక్ చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సినిమాలో ప్రభాస్ మేకోవర్ ఇలాగే ఉండబోతోందంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Latest pic of #Prabhas from the shoot of #Spirit with hairstylist. ❤️‍🔥 #RebelstarPrabhas pic.twitter.com/bgVR2rQJuy

— Suresh PRO (@SureshPRO_) June 3, 2026

ప్రభాస్ కొత్త లుక్: ఫ్యాన్స్ లో ఉత్సాహం

ఇంటెన్స్ అండ్ హై వోల్టేజ్ కాప్ డ్రామా

ఈ చిత్రంలో ప్రభాస్ తన కెరీర్‌లోనే మొదటిసారిగా ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతుండటం విశేషం. కాస్టిక్, ఇంటెన్స్ అండ్ హై వోల్టేజ్ కాప్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టరైజేషన్ చాలా విభిన్నంగా, సందీప్ రెడ్డి వంగా మార్క్ యాటిట్యూడ్‌తో ఉంటుందని ఇన్ సైడ్  టాక్. ఇక సలార్ , ‘కల్కి 2898 AD’ వంటి సాలిడ్ హిట్స్ తర్వాత ప్రభాస్ నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై ట్రేడ్ వర్గాల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు గ్లోబల్ వైడ్‌గా ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్

ప్రభాస్, వివేక్ ఒబెరాయ్ మధ్య హై యాక్షన్ సీక్వెన్స్‌

ఇకపోతే ‘స్పిరిట్’ సినిమాలో నటీనటుల ఎంపిక కూడా చాలా ఆసక్తికరంగా సాగుతోంది. ‘యానిమల్’ సినిమాతో నేషనల్ క్రష్‌గా మారిన తృప్తి డిమ్రి ఈ చిత్రంలో కథానాయికగా కనిపించనుంది .. అలాగే బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ఈ సినిమాలో పవర్‌ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్, వివేక్ ఒబెరాయ్ మధ్య వచ్చే హై  యాక్షన్ సీక్వెన్స్‌లను ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌లో చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. వీరితో పాటు సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్, కాంచన, ఐశ్వర్యా దేశాయ్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారని ఇన్‌సైడ్ టాక్.

పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రభాస్

సినిమాపై ఉన్న అంచనాలను డబల్ చేస్తున్న లొకేషన్ సెల్ఫీ

ఇక ఈ భారీ ప్రాజెక్ట్ ను సందీప్ రెడ్డి వంగా హోం బ్యానర్ భద్రకాళి పిక్చర్స్, టీ-సిరీస్ సంస్థతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తోంది. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ లైనప్‌లో ఈ సినిమాతో కల్కి 2 ,ఫౌజీ  అలాగే ‘సలార్ 2’ వంటి భారీ చిత్రాలు ఉన్నప్పటికీ, ‘స్పిరిట్’ క్రియేట్ చేస్తున్న హైప్ మాత్రం వేరే లెవెల్‌లో ఉంది. రాబోయే రోజుల్లో ఈ సినిమా నుండి మరిన్ని అధికారిక అప్‌డేట్స్ రానున్నాయని, ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించేలా ఫస్ట్ లుక్ లేదా గ్లింప్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ లొకేషన్ సెల్ఫీ సినిమాపై ఉన్న అంచనాలను డబల్ చేస్తుంది.

మొత్తంగా, ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్ ప్రభాస్ అభిమానులలో ఉత్సాహాన్ని నింపింది. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రభాస్ ఎలా కనిపిస్తాడో చూడటానికి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.