
📌 Key Points
- ‘మన శంకర వరప్రసాద్‌గారు’ జనవరి 12న విడుదల కానుంది.
- ప్రభాస్ ‘ది రాజా సాబ్’ ప్రీమియర్స్ జనవరి 9న; చిరంజీవి సినిమాకి జనవరి 11న ప్లాన్.
- ‘ది రాజా సాబ్’ ప్రీమియర్ టికెట్ ధర రూ.800, చిరంజీవి సినిమాకి రూ.500గా ఉండొచ్చు.
- తెలంగాణలో పేయిడ్ ప్రీమియర్స్, టికెట్ పెంపుకు ప్రభుత్వం అనుమతించబోమని స్పష్టం చేసింది.
చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్‌గారు’, ప్రభాస్ ‘ది రాజా సాబ్’ సంక్రాంతికి సిద్ధమవుతున్నాయి. రెండు సినిమాలకు ప్లాన్ చేసిన ప్రీమియర్స్, వాటి టికెట్ ధరలపై చర్చ జరుగుతోంది. అయితే తెలంగాణ ప్రభుత్వం తాజా నిర్ణయం, ఈ ప్రీమియర్స్ జరగడంపై సస్పెన్స్ నెలకొల్పింది.
అంచనాలు పీక్స్‌కు చేరిన “మన శంకర వరప్రసాద్‌గారు”
Mana Shankara Varaprasad Garu Release Date: ‘మన శంకర వరప్రసాద్‌గారు’ సినిమాపై అంచనాలు పీక్స్‌కు చేరిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే అంచనాలు సహజంగానే ఆకాశాన్ని తాకుతాయి. అలాంటిది ఇప్పుడు కెరీర్ లో ఒక్క ఫ్లాప్ కూడా చూడని బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరు నటిస్తూ ఉండడం సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది. అనిల్ రావిపూడి అంటేనే ఫుల్ లెన్త్ ఎంటర్‌టైన్‌మెంట్, క్లిన్ కామెడీ, ఫ్యామిలీ ఫన్. అనిల్ రావిపూడి ఈ సినిమాతో చిరంజీవిని మరోసారి కొత్తగా చూపించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.
సినిమా విడుదల విషయానికి వస్తే మన శంకర వరప్రసాద్‌గారు సినిమా ఈ ఏడాది సంక్రాంతికి, జనవరి 12న విడుదల కాబోతోంది. ఇదే సమయంలో ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్ కూడా భారీ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో రెండు సినిమాలకు సంబంధించిన పెయిడ్ ప్రీమియర్స్ గురించే ఇప్పుడు ఎక్కువ చర్చ జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం, ప్రభాస్ ‘ది రాజా సాబ్’ కి జనవరి 9న ఇండియాలో ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు. అలాగే చిరంజీవి సినిమా మన శంకర వరప్రసాద్‌గారుకి జనవరి 11న పేడ్ ప్రివ్యూస్ ఉండొచ్చని టాక్.
ప్రీమియర్స్, టికెట్ ధరలపై ఉత్కంఠ
అయితే టికెట్ రేట్ల విషయంలో కూడా తేడా ఉందట. ‘ది రాజా సాబ్’ ప్రీమియర్ టికెట్ ధర రూ.800గా ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఇక చిరంజీవి సినిమా ప్రివ్యూస్‌కి రూ.500 టికెట్ రేట్ ఉండొచ్చని చెబుతున్నారు. కానీ తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఇటీవల పెయిడ్ ప్రీమియర్స్‌కి, టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం అమల్లో ఉంటే ఈ రెండు సినిమాల ప్రీమియర్ షోలు జరుగుతాయా లేదా అన్నది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది.
మన శంకర వరప్రసాద్‌గారు ఒక పక్కా కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. శ్రీమతి అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో అందిస్తున్నారు. తాజాగా అనిల్ రావిపూడి ఇచ్చిన మరొక అప్డేట్ ఫ్యాన్స్‌ను మరింత ఎక్సైట్ చేస్తోంది.
చిరంజీవి ఇంట్రో సాంగ్ రిలీజ్ పై అనిల్ రావిపూడి అప్‌డేట్
ఈ సినిమాలో చిరంజీవికి ఓ క్రేజీ ఇంట్రో సాంగ్ ఉంటుందని, అది సినిమా రిలీజ్‌కు కొన్ని రోజుల ముందే విడుదల చేస్తామని అనిల్ రావిపూడి స్పష్టంగా చెప్పారు. ఈ ఇంట్రో సాంగ్‌ను పూర్తిగా చిరంజీవి మాస్ ఇమేజ్‌ని సెలబ్రేట్ చేసేలా డిజైన్ చేశామని ఆయన చెప్పడం మరింత హైప్ పెంచుతోంది. మెగాస్టార్ స్క్రీన్ మీద అడుగు పెట్టగానే వచ్చే ఎనర్జీ, ఆయన స్టైల్, ఆ వింటేజ్ ఫీల్ అన్నీ ఈ పాటలో కనిపిస్తాయట. పాట రిలీజ్ అయితే ఫ్యాన్స్ థియేటర్లలోనే కాదు సోషల్ మీడియాలో కూడా గోల చేస్తారని అనిల్ రావిపూడి కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు.
చిరంజీవి, ప్రభాస్ చిత్రాల సంక్రాంతి ప్రీమియర్స్ జరగడంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంతో టికెట్ ధరలు, ప్రీమియర్ షోల భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. ఈ ఉత్కంఠకు తెర పడేదెప్పుడో చూడాలి.


