|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రభాస్-విజయ్ వార్: తెలుగులో విజయ్ హవా, తమిళంలో ప్రభాస్‌కు నిరాశ!

Published: 04-01-2026, 12:30 AM
ప్రభాస్-విజయ్ వార్: తెలుగులో విజయ్ హవా, తమిళంలో ప్రభాస్‌కు నిరాశ!
  • సంక్రాంతికి ప్రభాస్ ‘ది రాజా సాబ్’, విజయ్ ‘జన నాయగన్’ చిత్రాలు విడుదల.
  • తెలుగు రాష్ట్రాల్లో విజయ్ సినిమాకు మంచి సంఖ్యలో థియేటర్లు లభిస్తున్నాయి.
  • తమిళనాడులో ప్రభాస్ ‘ది రాజా సాబ్’కు సరైన స్క్రీన్‌లు దక్కడం లేదని టాక్.
  • విజయ్ సినిమా నందమూరి బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ రీమేక్ కావచ్చని ప్రచారం.

సంక్రాంతి పండుగకు విడుదలవుతున్న ప్రభాస్, విజయ్ సినిమాల చుట్టూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో విజయ్ సినిమాకు గొప్ప ఆదరణ లభిస్తుండగా, తమిళనాడులో ప్రభాస్ సినిమాకు సరైన థియేటర్లు దక్కడం లేదని వార్తలు వస్తున్నాయి. ఇది అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది.

విజయ్ సినిమాకు తెలుగులో ఘన స్వాగతం

Prabhas vs Thalapathy Vijay: తెలుగు..తమిళ సినిమా పరిశ్రమల మధ్య.. ఉన్న వ్యత్యాసాలు మరోసారి వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా విడుదల కాబోతున్న సంక్రాంతి..సినిమాల విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఒకవైపు విజయ్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఘన స్వాగతం లభిస్తుంటే.. మరోవైపు ప్రభాస్ సినిమాకు తమిళనాడులో మాత్రం సరైన థియేటర్లు దక్కడం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ నెలలో ఒకే రోజు రెండు పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం ది రాజా సాబ్ జనవరి 9న విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు విజయ్ నటించిన డబ్బింగ్ సినిమా జన నాయగన్..తెలుగులో జననాయకుడుగా.. విడుదలకు సిద్ధమవుతోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటేమీ..తెలుగు రాష్ట్రాల్లో విజయ్ సినిమా మొదటి రోజే మంచి సంఖ్యలో స్క్రీన్స్ పొందుతోంది. థియేటర్ యజమానులు కూడా ఆ సినిమాకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

తమిళనాడులో ప్రభాస్‌కు థియేటర్ల కరువు?

అయితే దీనికి పూర్తి భిన్నంగా తమిళనాడులో పరిస్థితి ఉంది. భారతదేశంలోనే పెద్ద స్టార్‌గా పేరు పొందిన ప్రభాస్‌కు.. అక్కడ సరైన స్క్రీన్స్ ఇవ్వడం లేదన్న టాక్ వినిపిస్తోంది. తెలుగు హీరో అయినప్పటికీ ప్రభాస్‌కు తమిళనాడులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయినా కూడా ఈసారి ఆయన సినిమా అక్కడ వెనుకబడుతోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదే విషయంపై సోషల్ మీడియాలో అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇక మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే..విజయ్ సినిమా ఒక తెలుగు సినిమా రీమేక్ అన్న ప్రచారం కూడా జరుగుతోంది. అది నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి..ఆధారంగా తీసుకున్న కథ అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై దర్శకుడు ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఇది రీమేక్ కాదు అని..ఖండించకపోవడం కూడా ఈ వార్తలకు బలం చేకూర్చుతోంది.

బాలకృష్ణ సినిమా రీమేక్ విజయ్ మూవీ?

మొత్తానికి చూస్తే..విజయ్‌కు తెలుగు రాష్ట్రాల్లో పల్లకీ వేస్తున్న పరిస్థితి కనిపిస్తుండగా.. ప్రభాస్‌కు తమిళనాడులో మాత్రం ఆశించిన గౌరవం దక్కడం లేదన్న అభిప్రాయం ఏర్పడింది. భవిష్యత్తులో సినిమా విడుదలయ్యాక అసలు ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. అప్పటివరకు ఈ అంశం తెలుగ.. తమిళ సినీ అభిమానుల మధ్య పెద్ద చర్చగానే కొనసాగనుంది.

మొత్తానికి, సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వార్ తెలుగు, తమిళ సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సినిమా విడుదలయ్యాక అసలు ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.