
📌 Key Points
- ప్రదీప్ రంగనాథన్ హీరోగా, దర్శకుడిగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
- విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’లో ప్రదీప్ నటిస్తున్నారు.
- ఏఐ టెక్నాలజీపై ప్రదీప్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
- భవిష్యత్తులో పెళ్లిళ్లు కూడా ఏఐ నిర్ణయిస్తుందేమో అని ప్రదీప్ అన్నారు.
ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తున్న ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా ప్రదీప్ ఏఐ టెక్నాలజీ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రదీప్ రంగనాథన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు
Pradeep Ranganathan:ఒకవైపు దర్శకుడిగా, మరొకవైపు హీరోగా పలు చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ప్రముఖ కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. చేసింది తక్కువ సినిమాలే అయినా తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న ఈయన.. జూనియర్ ధనుష్ అని పిలిపించుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. అలాంటి ఈయన హీరోగా నటిస్తూ.. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల అవ్వగా 2040 కాలంలో ఒక యాప్ ఆధారంగా ప్రేమ, బ్రేకప్స్ ఎలా ఉంటాయనేది ఇందులో చాలా వినూత్నంగా చూపించారు. పైగా కృతి శెట్టి (Kriti Shetty) హీరోయిన్గా నటిస్తుండగా.. ఎస్.జే. సూర్య కీలకపాత్ర పోషించారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా.. ఏప్రిల్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
అటు విడుదల తేదీకి దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాదులోని పార్క్ హయత్ లో ఘనంగా నిర్వహించారు. అందులో పాల్గొన్న ప్రదీప్ రంగనాథ్ అత్యాధునిక టెక్నాలజీ ఏఐ గురించి చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా ఏఐ ప్రభావం యువతపై ఎలా ఉంది అనే విషయాలను ఆయన స్పష్టంగా తెలిపారు.ఈ మేరకు ప్రదీప్ రంగనాథన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం మనం వింత ప్రపంచంలో బ్రతుకుతున్నాము..ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే చాలు ఎంతోమంది హీరోయిన్ల మార్ఫింగ్ ఫోటోలు కనిపిస్తున్నాయి. ఇవి ఎంత సహజంగా ఉంటున్నాయి అంటే వీటిని చూసి ఒక్కోసారి మనమే షాక్ అవుతున్నాము. ఇదే ఏఐ విప్లవం తీసుకొచ్చిన పెద్ద అనర్ధం.
‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్
ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనుషుల కంటే ఫోన్లనే ఎక్కువగా నమ్మే పరిస్థితి వచ్చింది.. రిలేషన్షిప్, డ్రెస్సింగ్, మెడిసిన్ ఇలా ప్రతి విషయంలో కూడా చాలామంది చాట్ జిపిటి వంటి టెక్నాలజీ పై ఆధారపడుతున్నారు.. భవిష్యత్తులో ఎవరిని పెళ్లి చేసుకోవాలో కూడా ఈ ఏఐ చాట్ బాట్ లే నిర్ణయించే రోజులు వస్తాయేమో అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. ఇకపోతే ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని సినిమా ఉంటుందని ప్రదీప్ వెల్లడించారు. ఏది ఏమైనా ఏఐ ప్రపంచం భవిష్యత్తుపై తీసుకొస్తున్న మార్పులను దృష్టిలో పెట్టుకొని విఘ్నేష్ శివన్ ఒక సరికొత్త కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి ఈ సినిమా ఏప్రిల్ 10వ తేదీన ఎలాంటి రికార్డ్స్ సొంతం చేసుకుంటుందో చూడాలి.
ఏఐపై ప్రదీప్ రంగనాథన్ సంచలన కామెంట్స్
లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా విషయానికి వస్తే.. రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై నయనతార ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. నయనతార భర్త ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎప్పుడూ వినూత్నమైన కథలతో ప్రేక్షకులను అలరించే ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు మరోసారి యువతను దృష్టిలో పెట్టుకొని.. భవిష్యత్తులో టెక్నాలజీ యువతను ఏ విధంగా ఎఫెక్ట్ చేయబోతోంది అనే అంశాలను ఇప్పుడు తెరపై చూపించబోతున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.
ఏది ఏమైనా, విఘ్నేష్ శివన్ ఏఐ ప్రపంచం భవిష్యత్తుపై చూపే ప్రభావం ఆధారంగా సరికొత్త కథాంశంతో వస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదల కానుంది. ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.


