
📌 Key Points
- మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబోలో ‘మెగా 158’ చిత్రం ప్రారంభమైంది.
- పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై, రామ్ చరణ్ స్థానంలో క్లాప్ కొట్టారు.
- చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు ఒకే వేదికపై కనిపించి అభిమానులను అలరించారు.
- 30 ఏళ్ల క్రితం చిరంజీవి సన్నివేశం పవన్ కళ్యాణ్ తో రిపీట్ అవ్వడం వైరల్ గా మారింది.
మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబోలో తెరకెక్కుతున్న ‘మెగా 158’ చిత్రం పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. 30 ఏళ్ల క్రితం చిరంజీవికి సంబంధించిన ఓ సీన్ పవన్ తో రిపీట్ అవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మెగా 158: అంచనాలు పెంచిన చిరు-బాబీ కాంబో
Mega158 Event: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా158 ఎట్టకేలకి ముహూర్తం పెట్టేసుకుంది.ఇదే చిరు- బాబీ కాంబోలో గతంలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం 2023 సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్లకు పైగా వసూళ్లతో ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ హిట్ కాంబో రిపీట్ అవుతుండటంతో అటు మెగా అభిమానుల్లో, ఇటు ట్రేడ్ వర్గాల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ (మెగా158) గురువారం నాడు హైదరాబాద్‌లోని అత్యంత వైభవంగా, సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ప్రారంభోత్సవం జరుపుకుంది. చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు దిగ్గజాలు ఈ వేడుకకు తరలివచ్చి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.
నివార్య కారణాల వల్ల ఆయన రాలేకపోయిన చరణ్
ఈ గ్రాండ్ ఓపెనింగ్‌కు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వాస్తవానికి ఈ వేడుకకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా హాజరవుతారని మేకర్స్ ముందుగా ప్రకటించినప్పటికీ, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన రాలేకపోయారు. అయినప్పటికీ మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు ముగ్గురూ ఒకే వేదికపై చాలా కాలం తర్వాత ఇలా సినిమా వేడుకలో కలిసి కనిపించడంతో ఫుల్ ఖుషీ అయిపోయారంతా. అయితే రామ్ చరణ్ కూడా వచ్చి ఉంటే ఆ హ్యాపీ నెస్ డబల్ అయ్యేదంటున్నారు మెగా ఫ్యాన్స్.
పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా సందడి
భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్
ఇక ఈ ముహూర్తపు వేడుకలో పవన్ కళ్యాణ్ చిత్ర యూనిట్ మొత్తంలో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతూ క్లాప్ కొట్టగా, మెగా డాటర్ సుష్మిత కొణిదెల కెమెరా స్విచ్ఛాన్ చేశారు. అలాగే చిత్ర స్క్రిప్ట్‌ను మెగా బ్రదర్ నాగబాబుతో పాటు టాలీవుడ్ లెజెండరీ దర్శకులు బి. గోపాల్, ఎ. కోదండరామిరెడ్డి చేతుల మీదుగా దర్శకుడు బాబీ, నిర్మాత వెంకట్ కె. నారాయణలకు అందజేశారు. కన్నడనాట ఎన్నో భారీ చిత్రాలను నిర్మించి, ప్రస్తుతం టాలీవుడ్‌లోనూ వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతున్న ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.
‘లవ్ యూ కళ్యాణ్’ అంటున్న చిరు
అయితే ఈ పూజా కార్యక్రమం ముగిసిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా ఎమోషనల్ అవుతూ ఒక ప్రత్యేకమైన పోస్ట్‌ను షేర్ చేశారు. ఈ రోజు కళ్యాణ్ బాబుకి, తనకు మధ్యలో క్లాప్ బోర్డ్ కనిపిస్తుంటే.. సరిగ్గా 30 సంవత్సరాల క్రితం జరిగిన ఒక మధుర జ్ఞాపకం గుర్తొచ్చిందని ఆయన పేర్కొన్నారు. 1996లో పవన్ కళ్యాణ్ హీరోగా పరిచయమైన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమా ముహూర్తపు షాట్‌కు చిరంజీవి క్లాప్ కొట్టగా, ఇప్పుడు సరిగ్గా దానికి రివర్స్‌లో పవన్ కళ్యాణ్ వచ్చి తన అన్నయ్య 158వ సినిమాకు క్లాప్ కొట్టడం విశేషం. ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ, సమయం కేటాయించి వచ్చి క్లాప్ ఇచ్చి యూనిట్ సభ్యులందరినీ ఆనందపరిచినందుకు ‘లవ్ యూ కళ్యాణ్’ అంటూ రాసుకొచ్చారు చిరు.
వైరల్ అవుతున్న 30 ఏళ్ల నాటి సీన్
అన్నదమ్ములు కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు విపరీతంగా ట్రెండ్
ఇకపోతే ప్రస్తుతం చిరు, పవన్ ముగ్గురు అన్నదమ్ములు కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ విజువల్స్ చూసిన నెటిజన్లు ఆనాటి రామలక్ష్మణులను మేం చూడలేదు కానీ, ఇప్పుడు మీ ఇద్దరినీ చూస్తున్నామంటూ ఎమోషనల్ అయిపోతున్నారు మూవీ లవర్స్. బాబీ మార్క్ పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో, కేవీఎన్ ప్రొడక్షన్స్ వాల్యూస్ తో రాబోతున్న ఈ సినిమా టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులని క్రియేట్ చేస్తుందని ఫుల్ కాన్ఫిడెంట్ చూపిస్తున్నారు మెగా ఫ్యాన్స్.చూడాలి మరి భారీ అంచనాలతో రాబోతున్న ఈ సినిమా వాటిని ఏ మేరకి అందుకుంటుందో !
మెగా బ్రదర్స్ ఒకే వేదికపై కనిపించడం, పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా రావడం సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.


