|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రదీప్, ఏలేటితో డేంజర్ గేమ్: టాలీవుడ్ లో ఈ కాంబో సక్సెస్ అవుతుందా?

Published: 30-03-2026, 4:35 AM
ప్రదీప్, ఏలేటితో డేంజర్ గేమ్: టాలీవుడ్ లో ఈ కాంబో సక్సెస్ అవుతుందా?
  • ప్రదీప్ రంగనాథన్, చంద్రశేఖర్ ఏలేటి కాంబినేషన్ పై ట్రేడ్ పండితుల విశ్లేషణ.
  • తమిళంలో హిట్టయిన ఓవర్ యాక్షన్ తెలుగులో వర్కౌట్ అవుతుందా అనే సందేహాలు.
  • మైత్రీ మూవీ మేకర్స్ భారీగా పెట్టుబడి పెట్టడం సాహసమేనంటున్న విశ్లేషకులు.
  • తెలుగు నేటివిటీకి ప్రదీప్ సరిపోతాడా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

ప్రదీప్ రంగనాథన్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఒక యాక్షన్ థ్రిల్లర్ లో నటించబోతున్నారు. ఈ కలయిక ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

ప్రదీప్, ఏలేటి కాంబినేషన్ పై అంచనాలు

Pradeep Ranganathan: ప్రదీప్ రంగనాథన్.. ఒకపక్క తెలుగు హీరోలు ఒక్క వంద కోట్ల సినిమానే కొట్టడానికి ఆపసోపాలు పడుతుంటే ఏకంగా లవ్ టుడే’, ‘డ్రాగన్’, ‘డ్యూడ్’ అంటూ మూడు వంద కోట్ల సినిమాలని ఈ కుర్ర హీరో అవలీలగా తన ఖాతాలో వేసుకున్నసంగతి తెల్సిందే. ఇక ధనుష్ కి మరో వెర్షన్ లా కనిపించే ఈ కోలీవుడ్ కుర్రోడు ఇపుడు టాలీవుడ్ లో పాగా వేసేందుకు రెడీ అయిపోయాడట. అవును .. ప్రదీప్ ఇపుడు తన నెక్స్ట్ ఫిలిమ్ ని టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్‌ చంద్రశేఖర్ ఏలేటితో ఒక యాక్షన్ థ్రిల్లర్ చేయబోతున్నాడన్న వార్త ఇపుడు సోషల్ మీడియాలో తెగ హైలెట్ అవుతుంది.

నేటివిటీకి తగ్గట్టుగా పెర్ఫార్మ్ చేయగలడా

అయితే ‘అనుకోకుండా ఒక రోజు’, ‘సాహసం’ వంటి మైండ్ గేమ్‌లతో సినిమాలు తీసే చంద్రశేఖర్ ఏలేటి,డ్యూడ్’, ‘డ్రాగన్ అంటూ తన బాడీ లాంగ్వేజ్‌తో, ఓవర్ యాక్షన్‌తో యూత్ ఫుల్ సినిమాలు తీసే ప్రదీప్ తో జట్టు కట్టడం కాస్త ఆశ్చర్యమే. అసలు వీరి కాంబో వర్కౌట్ అవుతుందా అంటున్న వాళ్ళూ లేకపోలేదు. ప్రదీప్ చేసిన డ్యూడ్’, ‘డ్రాగన్’ సినిమాలు 100 కోట్లు వసూలు చేశాయంటే అది తమిళ తంబీలకి నచ్చే ఓవరాక్షన్ వల్లే అని, తెలుగులో ఇలాంటి కథలు వర్కవుట్ అవ్వడం కష్టమని పెదవి విరుస్తున్నారు ట్రేడ్ పండితులు..ఇక పుష్ప 2 లాంటి సాలిడ్ పాన్ ఇండియా ఫిలిమ్స్ తీస్తున్న మైత్రీ మూవీ మేకర్స్, ఇప్పుడు ఈ తమిళ కుర్రాడిపై కోట్లు కుమ్మరించడం ఒక రకంగా సాహసమే . కేవలం డబ్బింగ్ సినిమాలతో పేరు తెచ్చుకున్న ప్రదీప్, స్ట్రెయిట్ తెలుగు సినిమాలో ఇక్కడి నేటివిటీకి తగ్గట్టుగా పెర్ఫార్మ్ చేయగలడా అన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్.

ఓవర్ యాక్షన్ తెలుగులో వర్కౌట్ అవుతుందా?

ఇంకొకరు వచ్చి మాకు థ్రిల్లర్స్ నేర్పాలా?

ఇక ప్రదీప్ రంగనాథన్ తన సినిమాల్లో చేసే ‘ఓవర్ యాక్షన్’ పై ఇప్పటికే తెలుగు నెటిజన్లు మీమ్స్ వేస్తున్నారు కూడా.ఇంకొంతమంది అడుగు ముందుకేసి “మా దగ్గర ఆల్రెడీ చాలా మంది టాలెంటెడ్ యంగ్ హీరోలు ఉన్నారు.. పక్క రాష్ట్రం నుంచి ఇంకొకరు వచ్చి మాకు థ్రిల్లర్స్ నేర్పాలా?” అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. అయితే ఏలేటి తన స్థాయికి తగ్గ హీరోను కాకుండా, కేవలం బాక్సాఫీస్ నెంబర్ల కోసమే ప్రదీప్‌ను ఎంచుకున్నారా ఏంటి ? అన్న అనుమానాలు రైజ్ అవుతున్నాయ్ .

మైత్రీ మూవీస్ సాహసం చేస్తుందా?

ప్రదీప్ రంగనాథన్ కలలు కల్లలవ్వడం ఖాయం

మరి మూడు వరుస 100 క్రోర్ సినిమాలున్న ప్రదీప్‌కు తెలుగు ప్రేక్షకులు ఎలాంటి ట్రీట్ ఇస్తారో చూడాలి. ఏలేటి ఈ ప్రయోగాన్ని సక్సెస్ చేస్తే ఓకే.. అలా కాక ఈ ‘యాక్షన్ థ్రిల్లర్’ ఏ మాత్రం తేడా కొట్టినా.. ప్రదీప్ రంగనాథన్ టాలీవుడ్ కలలు కల్లలవ్వడం ఖాయం.చూడాలి ముందు ముందు ఏం జరుగుతుందో !

మొత్తానికి ప్రదీప్ రంగనాథన్ టాలీవుడ్ ఎంట్రీ ఎలా ఉండబోతుందో వేచి చూడాలి. ఏలేటి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ప్రదీప్ కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అవుతుందా లేదో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.