|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రదీప్ రంగనాథన్ మళ్ళీ దర్శకుడిగా: స్టార్ హీరోయిన్‌తో భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రం!

Published: 03-01-2026, 6:00 AM
ప్రదీప్ రంగనాథన్ మళ్ళీ దర్శకుడిగా: స్టార్ హీరోయిన్‌తో భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రం!
  • ప్రదీప్ రంగనాథన్ తన తదుపరి సినిమాను సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో దర్శకత్వం వహించనున్నారు.
  • ఈ సినిమాలో ప్రదీప్ కు జోడీగా మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించనున్నట్లు వార్తలు.
  • సినిమా స్క్రిప్ట్ ఫైనల్ అయింది, ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ పనులు జరుపుకోనుంది.
  • ప్రదీప్ దర్శకత్వంలో వచ్చిన ‘కోమాలి’, ‘లవ్ టుడే’ వంటి చిత్రాలు ఘన విజయాలు సాధించాయి.

ప్రదీప్ రంగనాథన్ మళ్లీ మెగాఫోన్ పట్టి దర్శకుడిగా మారబోతున్నారు. తన తదుపరి సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్‌ను ఫిబ్రవరిలో ప్రారంభించనున్నారు. ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ మీనాక్షి చౌదరి నటించనున్నట్లు సమాచారం. ప్రదీప్ గత విజయాల తర్వాత ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ప్రదీప్ రంగనాథన్ దర్శకుడిగా రీఎంట్రీ

Pradeep Ranganathan: తమిళ చిత్ర పరిశ్రమలో నటుడిగా దర్శకుడిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న వారిలో ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan)ఒకరు. కెరియర్ మొదట్లో దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయమైన ప్రదీప్ అనంతరం హీరోగా సినిమాలు చేస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇలా తన సినిమాల ద్వారా సూపర్ సక్సెస్ అందుకున్న ప్రదీప్ కేవలం తమిళ చిత్ర పరిశ్రమలో మాత్రమే కాకుండా తెలుగు ఇండస్ట్రీలో కూడా అదే స్థాయిలో ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇటీవల ప్రదీప్ డ్యూడ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఏకంగా 100 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది.

ఇక త్వరలోనే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ(LIK) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా డిసెంబర్ నెలలోనే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల వాయిదా పడుతూ ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదల కాబోతోందని సమాచారం. ఇదిలా ఉండగా ప్రదీప్ తన తదుపరి సినిమాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారని తెలుస్తోంది. ఈయన తదుపరి చేయబోయి సినిమా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాలో ప్రదీప్ నటించిన కాకుండా సినిమాకు దర్శకుడిగా కూడా వ్యవహరించబోతున్నట్టు తెలుస్తుంది.

మీనాక్షి చౌదరితో సైన్స్ ఫిక్షన్ చిత్రం

ఈ సినిమాలో ప్రదీప్ కు జోడీగా మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary)హీరోయిన్ గా నటించబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా స్క్రిప్ట్ ఫైనల్ అయిందని, ఫిబ్రవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు జరుపుకోబోతుందని తెలుస్తోంది. ప్రదీప్ నటించిన లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ వంటి మూడు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ 100 కోట్ల కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించాయి.

ఇక ప్రదీప్ హీరోగా మాత్రమే కాకుండా దర్శకుడిగా కూడా సత్తా చాటారు. ప్రదీప్ డైరెక్షన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కోమాలి సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ప్రదీప్ తదుపరి లవ్ టుడే సినిమాకు దర్శకత్వంతో పాటు హీరోగా నటించి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక మీనాక్షి చౌదరి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రదీప్ రంగనాథన్ తో ఈమె చేయబోయే సినిమా కూడా కీలకంగా ఉండబోతుందని తెలుస్తోంది. ఇక లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా విషయానికి వస్తే విగ్నేష్ శివన్ దర్శకత్వంలో నయనతార నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రదీప్ కు జోడిగా కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన సందడి చేశారు.

గత విజయాలు, తదుపరి ప్రాజెక్ట్ వివరాలు

ప్రదీప్ రంగనాథన్ తిరిగి దర్శకుడిగా మారడం, సైన్స్ ఫిక్షన్ జానర్‌లో స్టార్ హీరోయిన్‌తో సినిమా చేయబోవడం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆయన గత విజయాల పరంపరను కొనసాగిస్తారో లేదో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.