
📌 Key Points
- బాలయ్య హీరోయిన్‌గా ప్రగ్యా జైస్వాల్ గ్లామర్ ట్రీట్: గోల్డ్ డ్రెస్‌లో అదరగొట్టిన ఫోటోలు వైరల్!
- అఖండ, డాకు మహారాజ్ సినిమాలతో ప్రగ్యా జైస్వాల్‌కు బాలయ్యతో కలిసి సూపర్ హిట్ కాంబినేషన్!
- సోషల్ మీడియాలో ప్రగ్యా జైస్వాల్ ఫోటోలకు విపరీతమైన క్రేజ్: ఫ్యాన్స్ ఫిదా!
- లేటెస్ట్ ఫోటోలలో గోల్డ్ కలర్ డ్రెస్‌లో ప్రగ్యా జైస్వాల్ అందాలకు కుర్రకారు ఫిదా!
బాలకృష్ణతో కలిసి నటించిన ప్రగ్యా జైస్వాల్ తన అందంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా ఆమె గోల్డ్ కలర్ డ్రెస్‌లో మెరిసిపోతూ కుర్రకారు గుండెల్లో సెగలు రేపుతోంది. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
బాలయ్యతో కలిసి ప్రగ్యా జైస్వాల్ సంచలనం
తెలుగు సినిమా పరిశ్రమలో కెరీర్ ప్రారంభం నుంచి ఎన్నో చిత్రాల్లో నటించినప్పటికీ ఆశించిన స్థాయి క్రేజ్‌ను అందుకోలేకపోయిన హీరోయిన్లలో ప్రగ్యా జైస్వాల్ ఒకరు. ఈమె డేగ చిత్రంతో తన సినీ కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత 2015లో మిర్చి లాంటి కుర్రాడు చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.
అనంతరం పలు సినిమాల్లో నటించినప్పటికీ, కంచె సినిమా ద్వారా నటిగా మంచి గుర్తింపు పొందినప్పటికీ భారీ స్థాయి విజయాలు మాత్రం అందుకోలేకపోయారు. ఇలా కొంతకాలం పాటు డల్‌గా కెరిర్ సాగుతున్న సమయంలోనే బాలకృష్ణ హీరోగా రూపొందిన అఖండ చిత్రంలో హీరోయిన్‌గా నటించే అవకాశం లభించింది.
గోల్డ్ డ్రెస్‌లో ప్రగ్యా జైస్వాల్ గ్లామర్ ట్రీట్
ఈ సినిమా భారీ విజయాన్ని సాధించడంతో పాటు, అందులో ప్రగ్యా జైస్వాల్ తన నటనతో, అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఒక్కసారిగా ఈ యంగ్ బ్యూటీకి మంచి క్రేజ్ వచ్చింది. అనంతరం బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన డాకు మహారాజ్ చిత్రంలో కూడా ఈమె హీరోయిన్‌గా నటించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
ఇలా బాలకృష్ణ సినిమాల ద్వారా ఈ హీరోయిన్ విజయాలతో పాటు మంచి గుర్తింపును కూడా సంపాదించుకున్నారు. సినిమాల్లో అందాలను ఆరబోయడంలో ఏమాత్రం వెనుకాడని ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ నటి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను పోస్ట్ చేశారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు
ఆ ఫోటోలలో ఈ హాట్ బ్యూటీ గోల్డ్ కలర్‌లో మెరిసే స్లీవ్‌లెస్ పొట్టి టైట్ డ్రెస్ ధరించి హాట్ యాంగిల్స్‌లో స్టిల్స్ ఇచ్చింది. ఇక ఈ ఫోటోలలో చిన్న ఇయర్‌రింగ్స్ ధరించి, గోల్డ్ కలర్ హైహీల్స్‌తో పాటు తన కురులను హైలైట్ చేస్తూ స్టైలిష్ లుక్‌లో మెరిసింది. ఈ పిక్స్‌లో ఈ బ్యూటీ సూపర్ హాట్ లుక్‌లో ఉండడంతో ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.
Photos Courtesy: Instagram
ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్నాయి. ఆమె ఫ్యాన్స్ ఈ ఫోటోలను తెగ షేర్ చేస్తున్నారు. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


