|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు: నాగేశ్వర్‌పై దాడి రాజకీయ గూండాయిజమే!

Published: 23-05-2026, 5:15 AM
ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు: నాగేశ్వర్‌పై దాడి రాజకీయ గూండాయిజమే!
  • ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై ట్రోలింగ్, బెదిరింపులు, కేసులపై ప్రకాష్ రాజ్ స్పందన.
  • ప్రశ్నించే వారిని భయపెట్టడం రాజకీయ గూండాయిజం అని ప్రకాష్ రాజ్ ఆగ్రహం.
  • నాగేశ్వర్ గతంలో అందరినీ ప్రశ్నించారని, ఇప్పుడు టార్గెట్ చేయడం ద్వంద్వ వైఖరి.
  • ప్రకాష్ రాజ్ నాగేశ్వర్‌కు మద్దతుగా నిలిచి, “కీప్ అప్ ద గుడ్ వర్క్” అన్నారు.

సీనియర్ జర్నలిస్ట్ ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై జరుగుతున్న ట్రోలింగ్, బెదిరింపులపై నటుడు ప్రకాష్ రాజ్ తీవ్రంగా స్పందించారు. ప్రశ్నించే గొంతుకలను అణచివేయడం రాజకీయ గూండాయిజం అని ఆయన మండిపడ్డారు. నాగేశ్వర్‌కు తన పూర్తి మద్దతు ప్రకటించిన ప్రకాష్ రాజ్, ఇలాంటి చర్యలను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు.

ప్రకాష్ రాజ్ మద్దతు, రాజకీయ గూండాయిజంపై ఫైర్

Prakash Raj: సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ రావుపై సోషల్ మీడియాలో జరుగుతున్న విపరీతమైన ట్రోలింగ్, బెదిరింపులు, పోలీసు కేసుల నమోదుపై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ తీవ్రంగా స్పందించారు. నాగేశ్వర్ గారికి పూర్తి మద్దతు ప్రకటించిన ఆయన, ప్రశ్నించే వారిని భయభ్రాంతులకు గురిచేయడం కొత్త రాజకీయ సంస్కృతి ఏంటని ప్రశ్నించారు. జస్ట్ ఆస్కింగ్ అంటూ మరో సారి తెరపైకి వచ్చిన ప్రకాష్ రాజ్ కు

ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఎన్నో ఏళ్లుగా అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా సరే.. ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడి నిలదీస్తున్నారని ప్రకాష్ రాజ్ గుర్తుచేశారు. ఆయన మాట్లాడిన సుదీర్ఘ విశ్లేషణను, మొత్తం విషయాన్ని పక్కన పెట్టేసి, కేవలం తమకు కావాల్సిన ఒకే ఒక్క లైన్‌ను మాత్రమే కట్ చేసుకుని సోషల్ మీడియాలో వేధించడం సరికాదన్నారు.

“ఆయన మాట్లాడిన మాటల్లో ఏదైనా తప్పు ఉందనిపిస్తే దానికి ఆధారాలు అడగండి లేదా రాజకీయంగా కౌంటర్ ఇవ్వండి. అంతే తప్ప వ్యక్తిత్వం హత్య చేయడం, సోషల్ మీడియాలో అవమానించడం, పోలీసు కేసులతో భయపెట్టడం ఏంటి? మా నాయకుడిని ప్రశ్నిస్తే నాశనం చేస్తాం అనడం రాజకీయ గుండాయిజం కాదా?” అంటూ ప్రకాష్ రాజ్ నిలదీశారు.

నాగేశ్వర్‌పై ట్రోలింగ్: ప్రకాష్ రాజ్ ఆగ్రహం

గతంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు గారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కేసీఆర్, వైఎస్ జగన్, రేవంత్ రెడ్డి మరియు బీజేపీ.. ఇలా అందరినీ, అన్ని పార్టీలనూ ప్రశ్నలు అడిగారని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. “అప్పుడు ఆయన అడిగిన ప్రశ్నలు, ఆయన నిజాయితీ మీకు గుర్తుకు రాలేదా? ఇప్పుడు కేవలం ఒకే ఒక్క మాట మీకు నచ్చలేదనే కారణంతో ఆయన మీద యుద్ధం ప్రకటించడం మీ ద్వంద్వ వైఖరికి నిదర్శనం కాదా?” అని ఆయన మండిపడ్డారు.

ప్రస్తుత రాజకీయ పరిస్థితిలో ఏ ఏ పార్టీలు ఎవరితో పొత్తులు పెట్టుకున్నాయి, ఎవరు ఎవరి పట్టులో ఉన్నారనే విషయాలు అందరికీ, అన్నీ తెలుసని ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు. ప్రశ్నించే గొంతులను ఇలా కేసులతో మౌనం చేయాలని చూడడం సమాజానికి తీవ్ర ప్రమాదకరమని, ఈరోజు నాగేశ్వర్ గారిని టార్గెట్ చేస్తే, రేపు ఇంకెవరినైనా చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి అర్థం లేని పనులను వెంటనే ఆపాలని, పద్ధతిగా ప్రవర్తించాలని హెచ్చరిస్తూనే.. “నాగేశ్వరరావు .. మీ అండగా మేమున్నాం, కీప్ అప్ ద గుడ్ వర్క్” అంటూ ప్రకాష్ రాజ్ ధైర్యం చెప్పారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ప్రకాష్ రాజ్ కు ఇలా వివాదాలపై స్పందించడం కొత్తేమీ కాదు. మరోసారి ఇలా ప్రోఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టిన వారిపై ప్రకాష్ రాజ్ ఫైర్ అయ్యారు.

ప్రశ్నించే గొంతుకలను అణచివేయడం సరికాదు

ప్రశ్నించే గొంతులను కేసులతో మౌనం చేయాలని చూడటం ప్రమాదకరం. ఈరోజు నాగేశ్వర్… రేపు ఎవరు? #justasking pic.twitter.com/DbZDHMlcjW

— Prakash Raj (@prakashraaj) May 23, 2026

ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు ప్రస్తుత రాజకీయ వాతావరణంలో ప్రశ్నించే వారిపై జరుగుతున్న దాడులను హైలైట్ చేశాయి. నాగేశ్వర్‌కు ఆయన మద్దతు, ఇలాంటి చర్యలను ఖండించడం సమాజానికి ఒక ముఖ్యమైన సందేశాన్ని పంపింది. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును కాపాడాల్సిన అవసరాన్ని ఇది గుర్తుచేస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.