
డార్క్ థీమ్‌కు పెట్టింది పేరు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఎప్పుడూ నల్లని దుస్తుల్లో కనిపించే ఆయన, ఇటీవల తెల్లటి పంచె, షర్ట్‌లో దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. భువన్ గౌడ పెళ్లిలో ఆయన కనిపించిన ఈ అరుదైన లుక్‌పై భార్య లిఖిత రెడ్డి ఫన్నీగా స్పందించడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Key Points
డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తొలిసారి తెల్లని దుస్తుల్లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఆయన భార్య లిఖిత రెడ్డి 'నా దొంగమొగుడి ఫైనల్లీ వైట్ దుస్తుల్లో..' అంటూ పోస్ట్ చేశారు.
కేజీఎఫ్ సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ పెళ్లి వేడుకలో ప్రశాంత్ నీల్ ఈ విధంగా కనిపించారు.
ఈ వేడుకలో యష్, శ్రీనిధి శెట్టి, శ్రీలీల వంటి పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నారు.
ప్రశాంత్ నీల్ కొత్త లుక్ వెనుక కారణం
డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేరు చెప్పగానే అభిమానులకు గుర్తొచ్చేది బొగ్గు. ఎందుకంటే ఇప్పటివరకు తీసిన సినిమాలన్నింటినిలోనూ హీరోలు మసి లేదంటే బొగ్గుతో కనిపిస్తారు. డ్రస్సులు కూడా డార్క్ కలర్‌లోనే ఉంటాయి. ప్రస్తుతం ఎన్టీఆర్‌తో తీస్తున్న ‘డ్రాగన్’ కూడా దీనికి ఏ మాత్రం తీసిపోదు. ఎందుకంటే ఇదివరకే పోస్టర్ రిలీజ్ చేస్తే అందులోనూ డార్క్ థీమ్ కనిపించింది.
భార్య లిఖిత రెడ్డి ఫన్నీ పోస్ట్
అయితే ప్రశాంత్ నీల్.. డార్క్ కలర్ డ్రస్సుల్లో కాకుండా వేరే వాటిలో కనిపించడం అరుదని చెప్పొచ్చు. అలాంటిది ఇప్పుడు పూర్తిగా వైట్ షర్ట్, పంచెతో కనిపించి ఆశ్చర్యపరిచాడు. ఇదే విషయాన్ని ప్రశాంత్ నీల్ భార్య కూడా ఫీలైనట్లుంది. దీంతో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేసింది. ‘నా దొంగమొగుడి ఫైనల్లీ వైట్ దుస్తుల్లో..’ అని ఫన్నీ క్యాప్షన్ రాసుకొచ్చింది. దీంతో నెటిజన్లు కూడా సరదాగా నవ్వుకుంటున్నారు.
ప్రశాంత్ నీల్ తొలి సినిమా ‘ఉగ్రం’ నుంచి సినిమాటోగ్రాఫర్ చేస్తున్న భువన్ గౌడకి రీసెంట్‌గా పెళ్లి జరిగింది. ‘కేజీఎఫ్’ హీరోహీరోయిన్ యష్, శ్రీనిధి శెట్టితో పాటు మూవీ టీమ్‌లోని చాలామంది హాజరయ్యారు. ఇదే వేడుకలో భార్య లిఖిత రెడ్డితో పాటు ప్రశాంత్ నీల్ కూడా కనిపించాడు. డార్క్ కలర్ డ్రస్సులో కాకుండా తెల్లని దుస్తుల్లో కనిపించేసరికి అందరూ షాకవుతున్నారు. ఈ పెళ్లిలో హీరోయిన్ శ్రీలీల కూడా తల్లితో కలిసి కనిపించడం విశేషం.
భువన్ గౌడ పెళ్లిలో సెలబ్రిటీలు
ప్రశాంత్ నీల్ అరుదైన లుక్, ఆయన భార్య సరదా పోస్ట్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ చిన్న మార్పుతోనే పెద్ద వార్తగా మారిన ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచారు.


