
📌 Key Points
- ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో ‘మహాకాళి’ చిత్రం రాబోతోంది.
- ఈ సినిమాలో ప్రభాస్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు.
- అక్షయ్ ఖన్నా శుక్రాచార్యుడి పాత్రలో నటిస్తున్నారు.
- భూమి శెట్టి ప్రధాన పాత్రలో పశ్చిమ బెంగాల్ నేపథ్యంలో సినిమా సాగుతుంది.
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో రాబోతున్న ‘మహాకాళి’ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించనున్నారనే వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అప్డేట్స్
Prabhas: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(Prashanth Varma) ఒకరు. హనుమన్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ఈయన ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాటిక్ యూనివర్సల్ నుంచి ఒక పవర్ ఫుల్ ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.పవర్ ఫల్ ఫిమేల్ సూపర్ హీరో మూవీగా మహాకాళి(Mahakali) సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ కథ అందించగా పూజ అపర్ణ (Pooja Aparna)కొల్లూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మొట్టమొదటి ఫిమేల్ సూపర్ హీరో సినిమాగా రాబోతోంది. ఈ సినిమా మొత్తం పశ్చిమ బెంగాల్ నేపథ్యంలో సాగే కథగా ఉండబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇకపోతే తాజాగా మహాకాళి సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇతర భాష సెలబ్రిటీలు కూడా ఇందులో భాగమవుతున్నారు.
మహాకాళి సినిమాలో ప్రభాస్ పాత్ర
ఈ నేపథ్యంలోనే పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కూడా మహాకాళి సినిమాలో కీలక అతిథి పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇండస్ట్రీ సమాచారం ప్రకారం ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉండబోతుందని, ఇప్పటికే ప్రభాస్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి చేసేసారని తెలుస్తుంది. మరి ప్రభాస్ ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నారు? ఆయన పాత్ర నిడివి ఎంత ఉంటుందనే వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా శుక్రాచార్యుడు అనే పాత్రలో కనిపించబోతున్నారు.
పశ్చిమ బెంగాల్ నేపథ్యంలో..
చిత్రంలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు
కన్నడ బ్యూటీ భూమి శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ నేపథ్యంలో విజువల్ వండర్ గా రాబోతున్న ఈ సినిమా ఇప్పటికే వంద రోజులపాటు షూటింగ్ పూర్తి చేసుకుందని సమాచారం. హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తరువాత ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రాబోతున్న చిత్రం మహాకాళి కావడంతో ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇక ఇందులో ప్రభాస్ కూడా భాగమయ్యారనే విషయం తెలిసి అంచనాలు మరింత రెట్టింపు అయ్యాయి. మహాకాళి సినిమాలో ప్రభాస్ నటించబోతున్నారు అంటూ వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలి అంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.
మొత్తానికి, మహాకాళి చిత్రంలో ప్రభాస్ నటిస్తున్నాడా లేదా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. కానీ ఈ వార్త మాత్రం సినిమాపై అంచనాలను పెంచేసింది. త్వరలోనే దీనిపై మరింత సమాచారం తెలుస్తుంది.


