|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రియాంక చోప్రా సంచలనం: ఆస్కార్ వేదికపై మెరిసిన తొలి భారతీయ తార!

Published: 17-03-2026, 10:30 AM
ప్రియాంక చోప్రా సంచలనం: ఆస్కార్ వేదికపై మెరిసిన తొలి భారతీయ తార!
  • ప్రియాంక చోప్రా అకాడమీ అవార్డుల వేడుకలో ప్రజెంటర్‌గా వ్యవహరించిన తొలి భారతీయ నటిగా చరిత్ర సృష్టించారు.
  • బాలీవుడ్, హాలీవుడ్ మధ్య వారధిగా నిలుస్తూ ప్రియాంక అంతర్జాతీయంగా తన ప్రాబల్యాన్ని పెంచుకుంటున్నారు.
  • రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న ‘వారణాసి’ సినిమాలో ప్రియాంక మందాకిని పాత్రలో కనిపించనున్నారు.
  • ప్రియాంక చోప్రా 2000 సంవత్సరంలో ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకున్నారు, 2002లో సినీ రంగ ప్రవేశం చేశారు.

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా మరోసారి చరిత్ర సృష్టించారు. అకాడమీ అవార్డుల వేడుకలో ప్రజెంటర్‌గా వ్యవహరించిన తొలి భారతీయ నటిగా నిలిచారు. ఆమె సినీ ప్రయాణం, విజయాలు అందరికీ గర్వకారణం.

అకాడమీ అవార్డులలో ప్రియాంక చోప్రా సంచలనం

Priyanka Chopra:గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అభినయంతో, నటనతో అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను సొంతం చేసుకున్న ఈమె.. తాజాగా చరిత్ర సృష్టించింది.. ముఖ్యంగా రెండవసారి అకాడమీ అవార్డుల వేడుకలో ప్రజెంటర్ గా వ్యవహరించి.. తొలి భారతీయ నటిగా చరిత్ర సృష్టించింది. ప్రపంచ వేదికపై భారత ప్రాతినిధ్యానికి ఇది మరో గర్వించదగిన విజయమని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక బాలీవుడ్ , హాలీవుడ్ మధ్య వారధిగా నిలుస్తున్న ప్రియాంక చోప్రా.. సినిమా, వినోద రంగాలలో తన అంతర్జాతీయ ప్రాబల్యాన్ని పెంచుకుంటున్న విషయాన్ని ఈ వేడుక హైలెట్ చేస్తోంది.

ప్రపంచ సినిమా రంగంలో భారతీయ కళాకారుల ప్రభావం ఎలా విస్తరిస్తుందో ఆమె ప్రయాణం ప్రతిబింబిస్తోందని పేర్కొంటూ ప్రియాంక చోప్రా అభిమానులు ఇదొక ముఖ్యమైన ఘట్టంగా అభివర్ణించారు.. ఏది ఏమైనా ఈ ఒక్క ఘటన ప్రియాంక చోప్రా స్థాయిని , ఆమె హుందాతనాన్ని మళ్లీ నిరూపించాయని చెప్పవచ్చు. ఇకపోతే 2016లో ప్రియాంక చోప్రా ప్రెజెంటర్ గా కనిపించి సందడి చేయగా.. మళ్లీ పదేళ్లకు ఈ అవకాశం లభించడం నిజంగా గొప్ప అదృష్టం అని అభిమానులు సైతం కొనియాడుతున్నారు. ఏది ఏమైనా ప్రియాంక చోప్రా క్రియేట్ చేసిన ఈ హిస్టరీ చూసి అభిమానులు, సినీ సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

గ్లోబల్ స్టార్‌గా ప్రియాంక చోప్రా ప్రస్థానం

ప్రియాంక చోప్రా కెరియర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న వారణాసి సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. మందాకిని పాత్రలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికే ఈ సినిమాలోని కీలక సన్నివేశాలలో షూటింగ్ పూర్తి చేసిన ఈమె..త్వరలోనే తన పాత్రకు సంబంధించిన మిగతా షూటింగ్ ను కంప్లీట్ చేయనున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 7వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది..

‘వారణాసి’ సినిమాలో ప్రియాంక చోప్రా పాత్ర

ప్రియాంక చోప్రా మోడల్గా తన కెరీర్ ను మొదలుపెట్టి.. 2000వ సంవత్సరంలో ప్రపంచ సుందరిగా కిరీటాన్ని ధరించింది. ఇక 2002లో తమిళన్ అనే చిత్రం ద్వారా తొలిసారి వెండితెరకు పరిచయమైంది.. తమిళ్లో వచ్చిన ఈ సినిమా ద్వారానే తన నటన జీవితాన్ని ప్రారంభించింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇప్పటినుంచి బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించిన ఈమె.. అనూహ్యంగా హాలీవుడ్ వెళ్ళిపోయి అక్కడే సినిమాలు చేస్తూ సెటిల్ అయిపోయింది.. దాదాపు 8 ఏళ్ల పాటు హాలీవుడ్ లోనే సినిమాలు చేసిన ప్రియాంక చోప్రా రాజమౌళి పుణ్యమా అని మళ్ళీ ఇండియన్ సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది.. ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ లో కూడా అవకాశాలు లభిస్తూ ఉండడం గమనార్హం.

Tags Oscar 2026 priyanka chopra Share

ప్రియాంక చోప్రా సాధించిన ఈ ఘనత భారతీయ సినిమాకు గర్వకారణం. ఆమె రాబోయే సినిమాల్లో మరింత విజయాలు సాధించాలని ఆశిద్దాం. ఆమె ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.