
📌 Key Points
- ప్రముఖ నిర్మాత ఆర్.బి. చౌదరి రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో రోడ్డు ప్రమాదంలో మృతి.
- సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై 90కి పైగా సినిమాలు నిర్మించి గొప్ప గుర్తింపు సాధించారు.
- తెలుగులో ‘రాజా’, ‘కలిసుందాం రా’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు.
- ఆయన కుమారుడు, హీరో జీవా కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
టాలీవుడ్, కోలీవుడ్ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత ఆర్.బి. చౌదరి రాజస్థాన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఆయన మరణంతో సినీ ప్రముఖులు, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. హీరో జీవా కుటుంబంలో తీవ్ర శోకం అలుముకుంది.
ఆర్.బి. చౌదరి: సినీ ప్రస్థానం
R.B.Choudary Death: సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆర్బీ చౌదరి (R.B.Choudary)రోడ్డు ప్రమాదంలో మరణించారు. రాజస్థాన్లోని ఉదయపూర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో(Road Accident) ఈయన మరణించినట్టు తెలుస్తుంది. సూపర్ గుడ్ ఫిలిమ్స్ (Super Good filmz)అనే బ్యానర్ స్థాపించిన ఆర్.బి చౌదరి నేడు రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో ఇండస్ట్రీలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈయన నిర్మాతగా వివిధ భాషలలో సుమారు 90 కి పైగా సినిమాలను నిర్మించి ఇండస్ట్రీలో ఎనలేని గుర్తింపు సంపాదించుకున్నారు. ఈయన బ్యానర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఇలా నిర్మాతగా మంచి సక్సెస్ అందుకున్న ఆర్ బి చౌదరి లేరనే వార్త తెలిసిన సినీ ప్రముఖులు ఒక్కసారిగా షాక్ అవుతూ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈయన రోడ్డు ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ విధంగా నిర్మాత ఆర్.బి చౌదరి మరణ వార్త తెలిసిన అభిమానులు సినీ ప్రేమికులు సోషల్ మీడియా వేదికగా ఈయన మరణం పట్ల స్పందిస్తూ నివాళులు అర్పిస్తున్నారు. ఇక ఆర్ బి చౌదరి మరణంతో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి ఇక ఈయనకు నలుగురు కుమారులైతే ఒక కుమారుడు హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తెలుగు తమిళ భాషలలో హీరోగా సినిమాలు చేస్తూ మంచి ఆదరణ సొంతం చేసుకున్న నటుడు జీవా స్వయాన ఆర్ బి చౌదరి కుమారుడు అనే విషయం తెలిసిందే. ఈయన మరణంతో హీరో జీవా ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
రోడ్డు ప్రమాదం: వివరాలు ఇంకా తెలియాలి
ఇక ఆర్. బి. చౌదరి కెరియర్ విషయానికి వస్తే… సూపర్ గుడ్ ఫిలిమ్స్ అనే బ్యానర్ స్థాపించి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను ప్రేక్షకులకు అందించడమే కాకుండా ఎంతో మంది నటీనటులకు జీవితాన్ని కూడా అందించారు. తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన రాజా, కలిసుందాం రా, నువ్వొస్తావని, సింహరాశి వంటి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఇక ఈయన తమిళంలో విజయ్, విక్రమ్ అంటే హీరోలతో కూడా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను చేశారు.
సంతాపం తెలియజేస్తున్న ప్రముఖులు..
కుటుంబంలో విషాదం: హీరో జీవా శోకం
విజయ్ కెరీర్ తొలినాళ్లలో, ఆయనతో కలిసి పూవే ఉనక్కాగ, లవ్ టుడే, తుళ్ళాత మనముమ్ తుళ్ళుమ్ , షాజహాన్, తిరుపాచ్చి ,జిల్లా వంటి అనేక మాస్ సూపర్ హిట్ సినిమాలను చేశారు. ఇలా సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలకు నిర్మాతగా వ్యవహరించి వినలేని గుర్తింపు సంపాదించుకున్న ఆర్. బి చౌదరి లేరనే వార్త తెలిసిన తెలుగు తమిళ అభిమానులు, సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు. ఇక ఈయన మరణానికి గల కారణాలు ఏంటి ?ఈ ప్రమాదం ఎలా జరిగిందనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆర్.బి. చౌదరి మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆయన నిర్మించిన సినిమాలు, అందించిన నటీనటుల జీవితాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిద్దాం.


