|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నెలరోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు

Published: 05-10-2025, 7:13 PM
నెలరోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు

సత్యరాజ్ నటించిన ‘త్రిబాణధారి బార్బరిక్’ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. అక్టోబర్ 10న సన్ నెక్స్ట్ లో తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. విడుదల తేదీ ఖరారు కావడంతో సినీ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

Key Points

1

'త్రిబాణధారి బార్బరిక్' సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ ఆగస్టు 29న విడుదలైంది.

2

సత్యరాజ్, ఉదయభాను, వశిష్ట ఎన్ సింహా ప్రధాన పాత్రల్లో నటించారు.

4

తన మనవరాలిని కనుగొనేందుకు ఓ మానసిక వైద్యుడు చేసే పోరాటం ఈ చిత్ర కథాంశం.

‘త్రిబాణధారి బార్బరిక్’ సినిమా వివరాలు

స్టార్ నటుడు సత్యరాజ్Sathyaraj), ఉదయభాను(Udaya Bhanu), వశిష్ట ఎన్ సింహా, ప్రధాన పాత్రలో నటించి సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ ‘త్రిబాణధారి బార్బరిక్’(Tribanadhari Barbarik). మోహన్ శ్రీవాత్సవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సత్యం రాజేష్, క్రాంతి కిరణ్, వీటీవీ గణేష్, సాంచీ రాయ్ కీలక పాత్రలో కనిపించారు. స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యులాయిడ్ బ్యానర్‌పై విజయ్ పాల్‌రెడ్డి నిర్మించారు. ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య ఆగస్టు 29న విడుదలై ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ ఎప్పుడు?

దాదాపు నెల రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ప్రముఖ సంస్థ అధికారిక ప్రకటన చేసింది. ‘త్రిబాణధారి బార్బరిక్’ డిజిటల్ హక్కులను ప్రముఖ సంస్థ సన్ నెక్ట్స్ సొంతం చేసుకోగా.. అక్టోబర్ 10 నుంచి తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులోకి రాబోతున్నట్లు ఓ పోస్టర్‌ను షేర్ చేశారు. ‘‘ప్రేమ, నష్టం విడదీయరాని బంధం, తన మనవరాలిని కొనుగొనేందుకు ఓ మానసిక వైద్యుడు చేసే పోరాటం’’ అనే క్యాప్షన్ జత చేసి ఆసక్తిని పెంచారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రియులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

కథాంశం, ఆసక్తికర విషయాలు

A post shared by SUN NXT (@sunnxt)

నెలరోజుల్లోనే ఓటీటీలోకి వస్తున్న ‘త్రిబాణధారి బార్బరిక్’ సైకలాజికల్ థ్రిల్లర్ సినీ అభిమానులకు కొత్త అనుభూతిని అందించనుంది. సన్ నెక్స్ట్ లో అక్టోబర్ 10న స్ట్రీమింగ్ కానున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.