
📌 Key Points
- 2019 పుల్వామా దాడి సూత్రధారి హంజా బుర్హాన్ PoKలో హతం.
- అల్-బద్ర్ ఉగ్రవాద సంస్థ టాప్ కమాండర్‌గా బుర్హాన్ గుర్తింపు.
- ముజఫరాబాద్‌లో గుర్తుతెలియని వ్యక్తుల కాల్పుల్లో మృతి.
- భారత్‌పై ఉగ్ర కుట్రలకు ఇది గట్టి ఎదురుదెబ్బ.
2019 పుల్వామా దాడికి సూత్రధారి, అల్-బద్ర్ ఉగ్రవాద సంస్థ కమాండర్ హంజా బుర్హాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో హతమయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన మెరుపు దాడిలో అతడు మరణించడం, భారత్‌పై ఉగ్ర కుట్రలు పన్నుతున్న శక్తులకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
పుల్వామా దాడికి సూత్రధారి ఎవరు?
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) వేదికగా భారత్‌పై ఉగ్ర కుట్రలు పన్నుతున్న శక్తులకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2019 పుల్వామా టెర్రర్ అటాక్‌లో 40 సైనికుల ప్రాణాలు తీసి సూత్ర త్రధారి (Mastermind)గా వ్యవహరించిన అల్-బద్ర్ ఉగ్రవాద సంస్థ టాప్ కమాండర్ అర్జుమండ్ గుల్జార్ దార్ అలియాస్ ‘హంజా బుర్హాన్’ పాక్ ఆక్రమిత కాశ్మీర్ (POK)లో హతమయ్యాడు. ముజఫరాబాద్‌లో గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన మెరుపు కాల్పుల్లో అతడు మరణించినట్లుగా తెలుస్తోంది. అయితే, భారత ప్రభుత్వం 2022లోనే బుర్హాన్‌ను టెర్రరిస్ట్‌గా ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా రత్నీపోరా ప్రాంతానికి చెందిన హంజా బుర్హాన్, అల్-బద్ర్ ఉగ్రవాద సంస్థతో కలిసి లోయలో అనేక విధ్వంసకర చర్యలకు పాల్పడ్డాడు.
భారతదేశాన్ని వణికించిన 2019 పుల్వామా దాడిలో జైష్-ఎ-మహమ్మద్ ఉగ్రవాది అదిల్ అహ్మద్ దార్ పేలుడు పదార్థాలతో ఉన్న వాహనాన్ని సీఆర్‌పీఎఫ్ (CRPF) కాన్వాయ్‌కి ఢీకొట్టడంతో 40 మంది జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఈ కుట్ర వెనుక నెట్‌వర్క్ నడిపించడంలో, వ్యూహాలు రచించడంలో అల్-బద్ర్ అసోసియేట్ మెంబర్, కమాండర్ హంజా బుర్హాన్ కీలక పాత్ర పోషించాడని నిఘా వర్గాల దర్యాప్తులో తేలింది. తాజాగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ముజఫరాబాద్‌లో హంజా బుర్హాన్‌ను టార్గెట్ చేసిన దుండగులు అతడిపై పలు రౌండ్లు బుల్లెట్ల వర్షం కురిపించి అక్కడికక్కడే మట్టుబెట్టారు. అయితే, బుర్హాన్ మృతితో భారత్‌లో సంబురాలు అంబురాన్ని అంటాయి.
పాక్ గడ్డపై హంజా బుర్హాన్ హతం
భారత్‌కు ఇది పెద్ద విజయమా?
హంజా బుర్హాన్ మృతితో పుల్వామా అమరవీరులకు కొంతైనా న్యాయం జరిగిందని భారత్ భావిస్తోంది. పాక్ గడ్డపైనే ఉగ్రవాది హతం కావడం, ఉగ్రవాద నిర్మూలనకు భారత్ చేస్తున్న ప్రయత్నాలకు మరింత బలాన్ని చేకూర్చింది.


