
పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో వస్తున్న కొత్త సినిమాకు సంబంధించి ఆసక్తికర అప్‌డేట్ వచ్చింది. గతంలో ఊహించిన విధంగానే ‘స్లమ్ డాగ్’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఆదివారం జరిగే ఈవెంట్‌లో సినిమా టైటిల్, టీజర్‌ను లాంచ్ చేయనున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Key Points
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి సినిమాకు తొలి అప్‌డేట్ సిద్ధం.
ఆదివారం చెన్నైలో టైటిల్, టీజర్ లాంచ్ ఈవెంట్ జరగనుంది.
'స్లమ్ డాగ్' టైటిల్ ఖరారు, కథ బిచ్చగాడి జీవితంపై ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది.
సంయుక్త, టబు, దునియా విజయ్ కీలక పాత్రల్లో; ఈ ఏడాది చివరలో విడుదల అంచనా.
పూరీ – విజయ్ సేతుపతి మూవీ తాజా అప్‌డేట్
తెలుగులో డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ట్రెండ్‌కి తగ్గ సినిమాలు తీయలేక అవే మూసకథలతో తీయడంతో ప్రేక్షకుల నుంచి తిరస్కరణ ఎదురైంది. లైగర్, డబుల్ ఇస్మార్ట్ చిత్రాలు ఘోరమైన ఫ్లాప్స్ అయ్యాయి. దీంతో ఆలోచనలో పడిన పూరీ.. తెలుగు హీరోలని కాదని తమిళ హీరో విజయ్ సేతుపతితో ఓ ప్రాజెక్ట్ ఓకే చేశాడు. చాన్నాళ్ల క్రితమే షూటింగ్ మొదలైంది. ఇప్పుడు మూవీకి సంబంధించిన తొలి అప్‌డేట్ వచ్చే సమయం వచ్చేసింది.
‘స్లమ్ డాగ్’ టైటిల్, స్టోరీ వివరాలు
చెన్నైలో ఆదివారం ఓ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఇందులో టైటిల్, టీజర్ లాంచ్ చేయబోతున్నారు. గతంలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతున్నప్పుడే బెగ్గర్, మాలిక్ అనే టైటిల్స్ అనుకుంటున్నారని వినిపించింది. కానీ ఇప్పుడు అవేవి కాకుండా ‘స్లమ్ డాగ్’ టైటిల్ ఫిక్స్ చేశారని తెలుస్తోంది. స్టోరీ ఓ బిచ్చగాడి జీవితానికి సంబంధించింది. దీంతో ఈ పేరు అయితే సరిగ్గా సరిపోతుందని మూవీ టీమ్ భావించినట్లుంది.
తారాగణం, విడుదల తేదీపై అంచనాలు
ఇందులో విజయ్ సేతుపతికి జోడీగా సంయుక్త చేసింది. టబు, దునియా విజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. పూరీ దర్శకత్వం వహిస్తూనే మరోవైపు ఛార్మితో కలిసి నిర్మాతగా చేస్తున్నాడు. ఈ ఏడాది చివరలో రిలీజ్ ఉండొచ్చని టాక్. మరి రేపు జరగబోయే టీజర్ లాంచ్ ఈవెంట్‌లో రిలీజ్ తేదీపై ప్రకటన ఇస్తారేమో చూడాలి?
ఈ ‘స్లమ్ డాగ్’ టైటిల్ ఎంతవరకు సినిమాకు న్యాయం చేస్తుందో, టీజర్ ఎలా ఉండబోతుందో చూడాలి. పూరీ జగన్నాథ్ కెరీర్‌కు ఈ చిత్రం విజయం కీలకం కానుంది. విడుదల తేదీపై రేపటి ఈవెంట్‌లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


