
‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ పరాజయాల తర్వాత, పూరీ జగన్నాథ్ కొత్త కథతో విజయ్ సేతుపతితో సినిమా ప్రకటించారు. తాజాగా, సంయుక్తను హీరోయిన్‌గా ఎంచుకున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి.
Key Points
పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి కొత్త చిత్రం
మలయాళ నటి సంయుక్త హీరోయిన్‌గా ఎంపిక
ఈ ఏడాది చివర్లో రిలీజ్‌కు ప్లాన్
పూరీ-సేతుపతి కొత్త చిత్రం
‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ డిజాస్టర్ల దెబ్బకు పూర్తిగా ఆలోచనలో పడిపోయిన డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. తన రూట్ మార్చి స్టోరీ రాశాడు. దాన్ని తమిళ నటుడు విజయ్ సేతుపతికి చెప్పి మెప్పించాడు. కొన్ని నెలల క్రితం ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ కాగా.. ఇందులో ఎవరెవరు నటిస్తారనే విషయాన్ని ఒక్కొక్కరిగా ప్రకటిస్తున్నారు. తాజాగా హిట్ చిత్రాల హీరోయిన్‌ని తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
మలయాళ నటి సంయుక్త.. ఇప్పటివరకు చాలా సినిమాలు చేసింది. వాటిలో చాలావరకు హిట్ అయ్యాయి. తెలుగులోనూ భీమ్లా నాయక్, బింబిసార, సర్, విరూపాక్ష తదితర చిత్రాలతో సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం స్వయంభు, అఖండ 2, హైందవ, నారీ నారీ నడుమ మురారీ అని నాలుగు చిత్రాలు చేస్తోంది. ఇప్పుడు పూరీ-విజయ్ సేతుపతి ప్రాజెక్ట్‌లోకి ఎంటరైంది.
సంయుక్త హీరోయిన్‌గా ఎంపిక
సంయుక్తని తీసుకున్న విషయాన్ని పూరీ-ఛార్మీ ప్రకటించారు. ఆమెతో కలిసున్న ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విజయ్ సేతుపతి మూవీలో ఇప్పటికే టబు, కన్నడ నటుడు దునియా విజయ్ ఉన్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు సంయుక్త కూడా ఉందనేసరికి మూవీపై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ చిత్రంలో సేతుపతి.. బిచ్చగాడిగా కనిపించనున్నాడని తెలుస్తోంది. త్వరలో షూటింగ్ ప్రారంభించి ఈ ఏడాది చివర్లోనే రిలీజ్ చేయాలనే ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి
ఈ సినిమా విషయంలో పూరీ జగన్నాథ్ చాలా కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో తాను తీసిన సినిమాలు విషయంలో ఏ తప్పులైతే జరిగాయో ఈసారి అలాంటివేం జరగకుండా కచ్చితంగా ప్రేక్షకుల్ని అలరించాలని భావిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం విజయ్ సేతుపతిని పూరీ సినిమా చేస్తున్న సినిమా గురించి అడిగితే.. తనకు కథ నచ్చే అవకాశమిచ్చానని, ఆయన గత చిత్రాల ఫ్లాప్ కావడం తనకేం సమస్య కాదని చెప్పుకొచ్చాడు.
పూరీ జగన్నాథ్ తన గత చిత్రాల ఫ్లాప్‌ల నుండి పాఠాలు నేర్చుకుని, ఈ సినిమాతో ప్రేక్షకులను అలరించాలని భావిస్తున్నారు. ఈ చిత్రం విజయవంతం కావాలని ఆశిద్దాం.


